OTT Movie : ఇప్పుడు సమయం దొరికినప్పుడల్లా ఓటీటీ వైపు చూస్తున్నారు మూవీ లవర్స్. సినిమాలకి తోడుగా వెబ్ సిరీస్ లు కూడా ఆడియన్స్ ని కదలకుండా కూర్చోబెడుతున్నాయి. ఆడియన్స్ ఎక్కువగా హారర్, థ్రిల్లర్, కామెడీ జానర్లను చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం ఓటీటీలో కడుపుబ్బా నవ్విస్తున్న ఒక హిందీ వెబ్ సిరీస్ గురించి తెలుసుకుందాం. ఈ సిరీస్ డబ్బు కోసం ఒక సామాన్యుడు కిల్లర్ అవతారం ఎత్తుతాడు. అయితే అతని ఫన్నీ సీన్స్ కథను కామెడీ రోల్ వైపు నడిపిస్తుంది. క్లైమాక్స్ వరకు ఉరుకులు, పరుగులతో ఆడియన్స్ ని నవ్వులతో ముంచెత్తుతుంది. ఇది తెలుగులో కూడా అందుబాటులో ఉంది. కామెడీ ఫ్యాన్స్ కి బెస్ట్ సజెషన్. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏంటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘A Simple Murder’ హిందీ బ్లాక్ కామెడీ క్రైమ్ వెబ్ సిరీస్. సచిన్ పాఠక్ దర్శకత్వంలో 2020 నవంబర్ 20న ఈ సిరీస్ రిలీజ్ అయింది. మొత్తం 7 ఎపిసోడ్‌లతో ఐయండిబిలో 6.9/10 రేటింగ్ పొందింది. ఇందులో మొహ్ద్ జీషాన్ అయ్యుబ్, ప్రియా ఆనంద్, అమిత్ సియాల్, సుషాంత్ సింగ్, యశ్‌పాల్ శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం SonyLIV ప్లాట్ ఫామ్ లో హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, బెంగాలీ, మరాఠీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
మనీష్ అనే డిల్లీ యువకుడు స్టార్టప్ ఐడియా ఉంటుంది. కానీ దాని పెట్టుబడికి పైసలు ఉండవు. మరో వైపు భార్య సునీతాతో కూడా గొడవలు ఉంటాయి. ఇంట్లో తలనొప్పి వాతావరణం. ఈ సమయంలో అతనికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. సౌమ్య అనే అమ్మాయిని చంపితే 5 లక్షలు ఇస్తాం అని డీల్ వస్తుంది. మనీష్ మొదట్లో భయపడతాడు. కానీ పైసల కోసం ఒప్పుకుంటాడు. అతను పొలిటీషియన్ ప్రాన్ దావాస్ కుమార్తెను చంపాల్సి ఉంటుంది. మనీష్ టార్గెట్‌ను కిల్ చేయడానికి వెళ్తాడు. కానీ తప్పు పర్సన్ ని చంపుతాడు. అతను పొరపాటున పవన్ అనే ప్రొఫెషనల్ కిల్లర్ వైఫ్‌ను చంపేస్తాడు. పవన్ కోపంతో మనీష్‌ను వెంబడిస్తాడు, కానీ మనీష్ తెలివిగా ఎస్కేప్ అవుతాడు. ఇక్కడి నుండి కామెడీ మొదలవుతుంది. మనీష్ స్టార్టప్ ఇన్వెస్టర్‌ను మీట్ అవుతాడు, కానీ మర్డర్ సీక్రెట్ లీక్ అవుతుంది.
Read Also : బాబోయ్ అన్నీ అవే సీన్లు… ప్రతీ 5 నిమిషాలకు ఆ ఇంటెన్షన్ ఉన్న టెన్షన్ పెట్టే సీన్.. .సింగిల్స్ కు పండగే
పోలీస్ ఆఫీసర్ రతన్ ఈ కేస్ తీసుకుంటాడు. అతని అసిస్టంట్ పాల్ ఈ కేసులో ఫన్నీ మిస్టేక్స్ చేస్తాడు. తప్పు ఎవిడెన్స్, తప్పు సస్పెక్ట్ తో వీళ్ళు ముందుకు వెళతారు. మనీష్ సీక్రెట్ ను సునీతా తెలుసుకుని మొదట కోపంతెచ్చుకుని, తర్వాత డబ్బు కోసం సపోర్ట్ చేస్తుంది. చివరి ఎపిసోడ్‌లో అందరూ మనీష్‌ను ఛేజ్ చేస్తారు. ఒక బిగ్ ఫైట్, చేజ్ సీన్స్ జరుగుతాయి. మనీష్ తన లక్ & స్మార్ట్‌తో ఎస్కేప్ అవుతాడు. ఇక్కడే ఒక ట్విస్ట్ వస్తుంది. అసలు కిల్లర్ మనీష్ కాదు, మిస్టేకెన్ ఐడెంటిటీ వల్ల అందరూ తప్పుగా అనుకున్నారు. మరి కిల్లర్ ఎవరు ? పొలిటీషియన్ కూతురుని ఎవరు చంపమన్నారు ? ఇక్కడ జరిగిన హత్య చేసింది ఎవరు ? ఈ కథ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను, ఈ కామెడీ సిరీస్ ని చూసి తెలుసుకోండి.