BigTV English
Advertisement

Jangaon District: విద్యార్థులందరూ భోజనం చేశాక సాంబార్‌లో బల్లి ప్రత్యక్షం.. జనగామ జిల్లాలో ఘటన

Jangaon District: విద్యార్థులందరూ భోజనం చేశాక సాంబార్‌లో బల్లి ప్రత్యక్షం.. జనగామ జిల్లాలో ఘటన

Jangaon District: గురుకుల పాఠశాలలో ఆహారం బల్లి పడి విద్యార్థులకు అస్వస్థత, సాంబార్ లో ఎలుక పడి విద్యార్థుల పరిస్థితి విషమం, చట్నీలో బొద్దింక పడి వాంతింగ్ చేసుకున్న పలువురు.. ఇలాంటి వార్తలు మనం నిత్యం చూస్తూనే ఉంటాం. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ.. వ్యవస్థలో మాత్రం మార్పు రావడం లేదు. నిత్యం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో ఓ చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా జనగామ జిల్లాలో సాంబారు పాత్ర అడుగ భాగాన బల్లి కనిపించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


సాంబారు పాత్ర అడుగున బల్లి..

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేట ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం తయారు చేసిన సాంబారు పాత్రను శుభ్రం చేస్తుండగా.. సాంబారు పాత్ర అడుగున బల్లి కనిపించడంతో ఒక్కసారిగా పాఠశాల మొత్తం ఆందోళనకు గురి అయ్యారు. దీంతో విద్యార్థుల్లో అలజడి నెలకొంది. అస్వస్థతకు గురి అయిన ఫీలింగ్ లో విద్యార్థులు ఆందోళన చెందారు.


స్పందించిన హెడ్ మాస్టర్..

విషయం గ్రహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంటనే స్పందించారు. ఎంఈవో, కలెక్టర్ కు సమాచారం అందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు స్పందించి వైద్యశాఖ, రెవెన్యూ శాఖ, విద్యాశాఖ అధికారులు పాఠశాలకు పంపించారు. విద్యార్థులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులకు ఎవరికీ ఆనారోగ్య సమస్యలు లేక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నాడు.

ALSO READ: RS Praveen Kumar: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు.. నవీన్ యాదవ్‌పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్

మరోసారి ఇలా చేస్తే.. కఠిన చర్యలు..

ఈ ఘటనతో గ్రామంలో ఆందోళన చెలరేగగా మధ్యాహ్న భోజనం నాణ్యతపై అధికారులు విచారణ ప్రారంభించారు. అధికారులు స్పందించి భోజనం తయారీపై తగిన జాగ్రత్తలు తీసుకుని పిల్లల భద్రతే మొదటి ప్రాధాన్యం కావాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. మరో సారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కఠినమైన, పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

ALSO READ: CM Revanth Reddy:మొంథా తుపానుపై అధికారులను అప్రమత్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

Related News

DCC President Post: సిద్ధిపేట డీసీసీ అధ్యక్షుడు ఎవరు?

Jubilee Hills : జూబ్లిహిల్స్ ఉపఎన్నిక.. గెలుపు డిసైడ్ చేసేది వాళ్లేనా?

Misuse of scholarship funds: స్కాలర్‌షిప్ నిధుల దుర్వినియోగంపై ఉక్కుపాదం.. విచారణకు తెలంగాణ సర్కార్ ఆదేశం

SFI: స్టూడెంట్స్‌కు అలెర్ట్.. రేపు అన్ని కాలేజీలు బంద్.. ఎందుకంటే?

Heavy Rains: భారీ వర్షాలు.. రైళ్లలో చిక్కుకున్న ప్రయాణికులను ఆదుకున్న పోలీసులు

Heavy rains: అత్యంత భారీ వర్షాలు.. రేపు స్కూళ్లకు సెలవు ఉందా..? లేదా..? ఇదిగో క్లారిటీ

RS Praveen Kumar: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు.. నవీన్ యాదవ్‌పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్

Big Stories

×