OTT Movie : గ్రామీణ భక్తి, ట్రెడిషన్స్, మహిళల ఎంపవర్మెంట్ గురించి, ఒక చూడ చక్కని మలయాళం థ్రిల్లర్ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాకుండా నేరుగా ఓటీటీలోకి వచ్చింది. ఈ థ్రిల్లర్ సినిమా కథ ఒక గ్రామీణ ప్రాంతంలో జరుగుతుంది. దేవతలుగా కొలచే ఒక ఫ్యామిలీ చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. ఒక అమ్మాయి సిటీకి వెళ్ళి జాబ్ చేయాలని ప్రయత్నించే క్రమంలో ఈ కథ ఊహించని మలుపులు తీసుకుంటుంది. థ్రిల్లర్ ఆడియన్స్ కి ఈ సినిమా బెస్ట్ సజెషన్ . దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
‘తంపాచ్చి’ (Thampachi) అనేది 2025లో విడుదలైన మలయాళ థ్రిల్లర్ సినిమా. మనోజ్ టి. యాదవ్ అనే కొత్త డైరెక్టర్ తో ఈ సినిమా రూపొందింది. ఇందులో రాహుల్ మాధవ్ (శివ తంపాచ్చి), అప్పాని శరత్ (కోమారస్), ఆలియా (శివాని) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 అక్టోబర్ 5 నుంచి మనోరమా మాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే, అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా అందుబాటులో ఉంది. 1 గంట 33 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకి ఐయండిబిలో 6.5/10 ఉంది.
తమపాచి, కొమరాస్ అనే ఇద్దరు దేవుళ్లను నమ్మే ఒక కేరళ గ్రామంలో ఈ సినిమా కథ మొదలవుతుంది. అక్కడ శివ తంపాచి, అతని కుమార్తె శివానిని అందరూ గౌరవిస్తారు. శివాని గ్రామం డెవలప్ మెంట్ కి తన వంతు ప్రయత్నం చేస్తుంటుంది. గ్రామస్తులు శివానిని దేవతాలా చూస్తారు. ఈ సమయంలో శివానిని వెతుక్కుంటూ, సిటీ నుంచి ఒక జాబ్ ఆఫర్ వస్తుంది. అది కూడా ఒక NGOలో లీడర్ గా ఆ ఉద్యోగం ఉంటుంది. ఇది మహిళల హక్కులు, గ్రామీణ ఎంపవర్మెంట్ కోసం పాటు పడే పని. ఈ ఉద్యోగం రావడంతో శివాని చాలా సంతోషిస్తుంది. కానీ గ్రామస్తులకు ఆమె వెళ్ళడం ఏమాత్రం ఇష్టపడరు. ఆమె గ్రామం వదలకూడదని అనుకుంటారు. ఈ ఆఫర్ వల్ల గ్రామంలో గొడవ మొదలవుతుంది. కొందరు లోకల్ లీడర్స్ శివానిని ఆపాలనుకుంటారు.
Read Also : ఓటీటీలో ఆడరోబో అరాచకం… గ్రిప్పింగ్ థ్రిల్లర్, ఊహించని ట్విస్టులు… తుక్కురేగ్గొట్టే యాక్షన్ డ్రామా
ఇక్కడ కోమారస్ అనే వ్యక్తి ఎంట్రీ ఇస్తాడు. అతను మోడర్న్ థింకింగ్ ఉన్న వ్యక్తి. ఈ విషయంలో శివానికి సపోర్ట్ చేస్తాడు. దీంతో ఇద్దరి మధ్య రొమాన్స్ కూడా మొదలవుతుంది. ఇంతలో కొన్ని ఊహించని ఘటనలు వస్తాయి. శివాని ఇంటికి థ్రెట్ ఉన్నట్లు అనిపిస్తుంది. పూజల్లో వింత సంఘటనలు జరుగుతాయి. శివ తంపాచ్చి తన భక్తి ద్వారా గ్రామాన్ని కాపాడుతుంది. కానీ కుమార్తె ఫ్యూచర్ కోసం సిటీకి వెళ్లేందుకు సపోర్ట్ చేస్తుంది. ఇక శివాని సిటీకి వెళ్లాలనుకుంటుంది. కానీ గ్రామంలో పెద్ద గొడవ మొదలవుతుంది. లోకల్ లీడర్స్ శివాని డెవలప్ ప్లాన్స్ ను అడ్డుకోవడానికి ప్లాన్ చేస్తారు. ఈ క్లైమాక్స్ ఒక ఆసక్తికరమైన ముగింపును ఇస్తుంది. శివాని సిటీకి వెళ్తుందా ? గ్రామంలోనే ఉండి లీడర్లకు బుద్ది చెబుతుందా ? అనే విషయాలను, ఈ సినిమాని చూసి తెలుసుకోండి.