Abhisekh Bachchan: బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న నటుడు అభిషేక్ బచ్చన్ (Abhisekh Bachchan)సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.. అభిషేక్ బచ్చన్ మేకప్ ఆర్టిస్ట్(Make Up Artist) మరణంతో ఈయన భావోద్వేగానికి గురి అయ్యారని తెలుస్తోంది. దాదాపు 27 సంవత్సరాలుగా అశోక్ దాదా(Ashok Dada) అనే మేకప్ ఆర్టిస్ట్ అభిషేక్ బచ్చన్ దగ్గర పని చేస్తున్నారు. అయితే ఆయన మరణించడంతో అభిషేక్ ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియా వేదికగా అతనితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అభిషేక్ బచ్చన్ మొదటి సినిమా నుంచి ఆయనకు మేకప్ ఆర్టిస్ట్ గా అశోక్ దాదా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం గురించి అభిషేక్ స్పందిస్తూ.. అశోక్ దాదా నా దగ్గర దాదాపు 27 ఏళ్లుగా పని చేస్తున్నాడు అతడు కేవలం నా టీంలో ఒక వ్యక్తి మాత్రమే కాదు, నా సొంత కుటుంబ సభ్యుడితో సమానమని తెలిపారు. అశోక్ దాదా అనారోగ్యం సమస్యలతో బాధపడుతున్నట్లు అభిషేక్ వెల్లడించారు. ఇలా అశోక్ దాదా నాతో పాటు షూటింగ్ కి రాకపోయినా ఆయన అసిస్టెంట్ కి మేకప్ సరిగ్గా వేయమని చెప్పే వారని ఎప్పుడు చిరునవ్వుతో కనిపించే వ్యక్తి అని అభిషేక్ వెల్లడించారు.
ఇకపోతే అభిషేక్ బచ్చన్ ఏదైనా ఒక కొత్త సినిమాకు కమిట్ అయ్యి షూటింగ్ కు వెళ్లడానికి ముందు మొదట తన మేకప్ ఆర్టిస్ట్ అశోక్ దాదా కాళ్లకు నమస్కరించిన తర్వాతే కెమెరా ముందుకు వెళ్లే వారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇలా ప్రతి సినిమాకు అశోక్ దాదా ఆశీర్వాదం తీసుకునే వాడిని ఇకపై తన ఆశీర్వాదం కోసం ఆకాశం వైపు చూడాలి స్వర్గంలో ఉన్న అశోక్ దాదా నన్ను ఆశీర్వదిస్తారని ఎమోషనల్ అయ్యారు. నాపట్ల మీరు చూపించిన ప్రేమ, కేరింగ్ అన్నింటికీ థాంక్యూ దాదా.. మీరు నాతో లేరనే విషయం నమ్మశక్యంగా లేదని, ఇకపై మీరు లేకుండా షూటింగ్ సెట్ కి వెళ్లాలని తలుచుకుంటేనే నా గుండె ముక్కలు అవుతుంది.. మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అంటూ అభిషేక్ బచ్చన్ ఈ సందర్భంగా చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
ఇక అభిషేక్ చేసిన ఈ పోస్ట్ పై ఆయన అభిమానులు స్పందిస్తూ తన మేకప్ ఆర్టిస్ట్ అశోక్ దాదా మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. ఇక తన మేకప్ ఆర్టిస్ట్ ను సొంత మనిషిలా భావించి, ప్రతి సినిమా షూటింగ్ ఒక ముందు ఆయన ఆశీర్వాదం తీసుకోవడం అంటే ఎంతో గర్వించదగ్గ విషయమని చెప్పాలి. అభిషేక్ బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో అయినప్పటికీ మేకప్ ఆర్టిస్ట్ కాళ్లకు నమస్కరించడం అంటే మామూలు విషయం కాదని, పని వారిని కూడా సొంతవాళ్లుగా చూసుకునే మనస్తత్వం అందరికీ ఉండదు అంటూ అభిషేక్ బచ్చన్ పై ఆయన అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read: Actor Dharmendra: నటుడు ధర్మేంద్ర ఆరోగ్య పరిస్థితి విషమం…వెంటిలేటర్ పై చికిత్స!