Vijay Sethupathi : కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా తమిళ్ సినిమాలు కూడా చూడటం ఎప్పటినుంచో అలవాటు చేసుకున్నారు తెలుగు ప్రేక్షకులు. ఇప్పుడు చాలామంది తమిళ నటులు సినిమాలు కంటే కూడా అప్పట్లోనే విజయ్ సేతుపతి సినిమాలు విపరీతంగా చూసేవారు. విజయ్ సేతుపతి సినిమాలను ఓటీటీ లో వెతుక్కుని మరీ చూసి ఫిదా అయిపోయిన ఆడియన్స్ ఉన్నారు.
ఆ తర్వాత విజయ్ సేతుపతి తెలుగు సినిమాల్లో కూడా భాగం అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి, బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన వంటి సినిమాల్లో కీలకపాత్రలో కనిపించాడు. ఆ తర్వాత విజయ్ సేతుపతి నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో డబ్బింగ్ రూపంలో విడుదలయ్యాయి. వాటికి కూడా ప్రేక్షకులు మంచి ఆదరణ చూపించారు.
విజయ్ సేతుపతి కొడుకు ఫీనిక్స్ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. తమిళ్లో విడుదలైన ఈ సినిమా ఆల్రెడీ కమర్షియల్ సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం అదే సినిమాను తెలుగులో ఫీనిక్స్ పేరుతో నవంబర్ 7న విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రెస్మీట్లో విజయ్ సేతుపతి పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు.
చాలామంది తమిళ నటులు తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళు మాట్లాడిన ప్రతిసారి నెక్స్ట్ టైం ఇంకా బాగా మాట్లాడుతానని చెబుతూ ఉంటారు. ఇప్పుడు విజయ్ సేతుపతి అదే ప్రయత్నం చేశారు. విజయ్ సేతుపతి మాట్లాడుతూ..
నేనిప్పుడు పూరి గారి సినిమా చేస్తున్నాను, ఇంకా తెలుగులో రెండు సినిమాలు చేస్తే అప్పుడు తెలుగు ఇంకా బాగా మాట్లాడుతాను. ఆ తర్వాత కవితలు కూడా రాస్తాను. అప్పటివరకు కొంచెం అడ్జస్ట్ అవ్వండి. వాస్తవానికి కవితలు రాసిన ఆశ్చర్య పడాల్సిన పనిలేదు. ఆల్రెడీ తెలుగు నేర్చుకొని ప్రకాష్ రాజు కూడా చాలా కవితలు తెలుగులో రాశారు. ఇక ఆ పని విజయ్ సేతుపతి చేస్తాడేమో చూడాలి.
నాకు వరలక్ష్మి గారు బాగా క్లోజ్ మీ ఇద్దరం కలిసి మైకేల్, విక్రం వేద అనే సినిమాలు చేశాము. ఆవిడకి ఎల్లప్పుడూ మంచి ఎనర్జీ ఉంటుంది. ఆవిడ ఎనర్జీ డ్రింక్ కంపెనీ మొదలు పెడితే ఇంకా బాగుంటుంది. ఏ లాంగ్వేజ్ లో సినిమా చేసిన, మనం ఎక్కడికి వెళ్లినా, సినిమా బాగుంటే అది ఆడియన్స్ కి ఎప్పటికీ కనెక్ట్ అయి ఉంటుంది.
అందుకనే మనం అన్ని లాంగ్వేజ్ సినిమాలు చూస్తుంటాం. ఫీనిక్స్ సినిమాతో కూడా అదే జరగబోతుంది. ఈ సినిమా నవంబర్ 7న విడుదలవుతుంది ఖచ్చితంగా చూసి ఎంజాయ్ చేయండి. ఇకపోతే విజయ్ సేతుపతిని తెలుగు ప్రేక్షకులు ఆదరించిన రేంజ్ లో తన కొడుకును ఫినిక్స్ సినిమాతో ఏ రేంజ్ లో ఆదరిస్తారో చూడాలి. అదే రోజు రష్మిక నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.
Also Read: The Girl Friend: పరభాషా నటీ నటులకు తెలుగు నిర్మాతలు ఎక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కారణం ఇదే