E-Paper
Advertisement

Rakul Preet Singh: డబ్బులు ఇచ్చి మరీ అలాంటి పని చేయిస్తున్నారు.. నిజాలు బయటపెట్టిన రకుల్!

Rakul Preet Singh: డబ్బులు ఇచ్చి మరీ అలాంటి పని చేయిస్తున్నారు.. నిజాలు బయటపెట్టిన రకుల్!
Advertisement

Rakul Preet Singh:ప్రముఖ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే తన అద్భుతమైన డైలాగ్స్ తో మరింత క్రేజ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాలో ..”ప్రార్థన ప్రతి రూపాయి కౌంటింగ్ ఇక్కడ ” అనే డైలాగ్ తో ఊహించని క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి హీరోల సరసన నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా డబ్బులు ఇచ్చి మరీ అలాంటి పనులు చేయిస్తున్నారు అంటూ మండిపడింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

మంచి కోసం కాదు.. చెడు కోసమే పీఆర్ టీములు..

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ ప్రీత్ సింగ్.. బాలీవుడ్ సెలబ్రిటీలు పెట్టుకున్న పి ఆర్ టీంల గురించి చేసిన కామెంట్లు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఒకప్పుడు మన పాపులారిటీని పెంచుకోవడానికి ఈ పి.ఆర్ టీంలు పనిచేసేవి. కానీ ఇప్పుడు పక్కవారి ఇమేజ్ డామేజ్ చేయడానికి ఈ పీఆర్ టీములు పనిచేస్తున్నాయి. ఇలాంటి పనులు చేయడానికి కొంతమంది సెలబ్రిటీలు డబ్బులు ఇచ్చి మరీ పీ ఆర్ టీమ్ లను పెట్టుకోవడం విచారకరం అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.

Advertisement

ALSO READ:Kalki 2: కల్కి2లో సుప్రీమ్ యాస్కిన్ విశ్వరూపం.. ఏకంగా 90 నిమిషాల పాటూ?

పక్కవారిని తొక్కేయడమే పని..

ఈ మేరకు రకుల్ మాట్లాడుతూ..” బాలీవుడ్ లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తమ పబ్లిసిటీ కోసం కాకుండా పక్కవారిని తొక్కేయడానికి డబ్బులు ఇచ్చి మరీ నెగెటివిటీని ప్రచారం చేయిస్తున్నారు. ఇంతలా ఇతరుల గురించి నెగిటివ్ గా మాట్లాడించే వాళ్లకు అసలు నిద్ర ఎలా పడుతుంది? అసలు వాళ్లు మనుషులేనా? వాళ్లకు మనస్సాక్షి ఉండదా? ఇలాంటి వాళ్లకు ఏదో ఒక రోజు గట్టి దెబ్బ పడుతుంది” అంటూ ఊహించని కామెంట్లు చేసింది రకుల్ ప్రీత్ సింగ్. ఇక ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Advertisement

అలాగే ఏర్పోర్ట్ దగ్గర, జిమ్ దగ్గర వెంటపడే ఫోటోగ్రాఫర్ల గురించి ఆమె మాట్లాడుతూ..” నేను నచ్చితే ఒక జీన్స్ ను నెలకు 5 సార్లు అయినా వేసుకుంటాను. ఎందుకంటే అది నా కంఫర్ట్ మాత్రమే.. అయితే దానిని కూడా గమనించి కామెంట్ చేస్తున్నారు అంటే వారికి హద్దులు లేవు అనిపిస్తోంది. దుస్తుల కంటే సౌకర్యానికి నేను ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తాను.”అంటూ ఆమె తెలిపింది. మొత్తానికి అయితే రకుల్ ప్రీత్ సింగ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఇలాంటి కామెంట్లు గతంలో మరో హీరోయిన్ కూడా చేసిన విషయం తెలిసిందే.

Related News

సాహో ప్రపంచంలోకి ఓజీ..? ఏం ప్లాన్ చేస్తున్నావ్ సుజిత్ ?

మీరే నాకు స్ఫూర్తి… బాబాయ్ కు అబ్బాయ్ విషెస్!

ఒంటిమీద బట్టలు లాగేసి ఘోరంగా అవమానించారు – స్టార్ కమెడియన్ ఎమోషనల్!

పవన్ అభిమాని మృతి..గొప్ప మనసు చాటుకున్న ఎస్కేఎన్!

నాని ‘ప్యారడైజ్’ అసలు కథ ఇదేనా?

రజనీకాంత్ జైలర్ 2 వాయిదాపై మేకర్స్ క్లారిటీ..వెనక్కి తగ్గేదేలే!

ప్రభాస్ తో సుమంత్ ప్రభాస్.. ఒక్కమాటతో రియల్ క్యారెక్టర్ రివీల్!

నేపాల్ విధ్వంసం.. రంగంలోకి సోనూసూద్.. ప్రజలకు విజ్ఞప్తి!

Big Stories

Advertisement
×