Ram Charan: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) వారసుడిగా అడుగుపెట్టి.. మొదటి సినిమాతో ఇబ్బందులు ఎదుర్కొన్నా.. రెండవ సినిమాతోనే స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్నారు రామ్ చరణ్ (Ram Charan). రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ‘మగధీర’ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరో అయిపోయారు.. ఆ తర్వాత ఆచితూచి అడుగులు వేస్తూ.. కథలో జాగ్రత్తలు తీసుకుంటూ.. బాడీ ఫిట్నెస్ మైంటైన్ చేస్తూ.. నటనలో తనను తాను ఇంప్రూవ్ చేసుకొని.. నేడు గ్లోబల్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్నారు. మళ్ళీ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్.ఆర్.ఆర్. చిత్రంతో ఏకంగా గ్లోబల్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్న ఈయన.. ప్రస్తుతం బుచ్చిబాబు సనా (Bucchibabu sana) దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమా చేస్తున్నారు.
వచ్చే ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇందులో రామ్ చరణ్ కి జోడిగా ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi kapoor) హీరోయిన్గా నటిస్తోంది.. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా ఈ సినిమాలో తన లుక్ రివీల్ చేయకుండా మెయింటైన్ చేస్తున్న రామ్ చరణ్ సడన్గా కెమెరా కంటికి చిక్కాడు. ఇందులో ఆయన లుక్ చూసి అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు రామ్ చరణ్ కొత్త లుక్ వింటేజ్ లుక్ ను తలపిస్తోంది అని, పైగా ఆ సినిమాను గుర్తు చేస్తోంది అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
అసలు విషయంలోకి వెళ్తే.. ఇటీవల ఒక ఈవెంట్ లో పాల్గొన్న రామ్ చరణ్ కి సంబంధించిన లుక్ కాస్త బయటపడింది. అందులో ఆయన మగధీర సినిమాలో ఎలా అయితే జుట్టు ముడి పెట్టుకుని కనిపించారో.. అచ్చం ఇప్పుడు అదే లుక్ లో కనిపించేసరికి అంచనాలు భారీగా పెరిగిపోయాయి ముఖ్యంగా ఈ లుక్ రామ్ చరణ్ కు బాగా కలిసి వచ్చింది. ఇదే లుక్ ను ఇప్పుడు పెద్ది సినిమాలో కూడా బుచ్చిబాబు ప్లాన్ చేశాడని సమాచారం. ఏది ఏమైనా రాంచరణ్ లుక్ మాత్రం మాస్ లవర్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోందని చెప్పడంలో సందేహం లేదు. మరి భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది ప్రేక్షకులు ముందుకు రాబోతున్న ఈ సినిమా రామ్ చరణ్ కు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.
పెద్ది సినిమా విషయానికి వస్తే.. తెలుగు భాషా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ పెద్ది చిత్రాన్ని వృద్ధి సినిమాస్ , IVY ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ హీరోగా నటిస్తూ ఉండగా.. శివరాజ్ కుమార్ , జాన్వీ కపూర్, దివ్యేందు శర్మ, జగపతిబాబు తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ గ్రహీత ఏ.ఆర్.రెహమాన్ (AR Rahman) సంగీతాన్ని అందిస్తూ ఉండగా..R.రత్నవేలు సినిమాటోగ్రఫీ గా పని చేస్తున్నారు. సుమారుగా 300 కోట్ల బడ్జెట్ తో రాబోతున్న ఈ చిత్రం నుండి ఇప్పటికే పోస్టర్ , షార్ట్ వీడియో రిలీజ్ అవ్వగా.. రెండు కూడా సినిమాపై అంచనాలు పెంచేశాయి.ఇప్పుడు రామ్ చరణ్ లుక్ కూడా బయటపడడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయని చెప్పవచ్చు.
ALSO READ :Vyjayanthi Movies: యాక్షన్ అడ్వెంచర్ కాదు లేడీ ఓరియంటెడ్.. భలే ప్లాన్ చేస్తున్నారే?
The #Peddi Beast giving Vintage Vibes ❤️🔥@AlwaysRamCharan 🦁 pic.twitter.com/1hKBhY8VRa
— Trends RamCharan ™ (@TweetRamCharan) October 7, 2025