Yash 21 Movie: సాధారణంగా ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే ఒక హీరో మంచి సక్సెస్ అందుకున్నారు అంటే.. నెక్స్ట్ ఆయన చేసే ప్రాజెక్టు ఏంటి అంటూ అభిమానులు సైతం ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ఇంకొంత మంది హీరోల విషయంలో అయితే ఇంకా ఒక సినిమా సెట్ పై ఉండగానే.. మరో సినిమా గురించి ఆలోచనలు మొదలు పెడతారు. ఈ క్రమంలోనే ఒకప్పుడు సీరియల్స్ ద్వారా కెరియర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత పలు చిత్రాలలో హీరోగా నటించి.. ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో యష్ (Yash) ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ చిత్రంతో సంచలనం సృష్టించారు. కేజీఎఫ్ 1,2 చిత్రాలతో ఏకంగా పాన్ ఇండియా హీరోగా పేరు సొంతం చేసుకున్న.. ఈ చిత్రాలతో భారీ కలెక్షన్స్ వసూలు చేసి అరుదైన రికార్డులు కూడా అందుకున్నారు.
ఇదిలా ఉండగా కేజీఎఫ్ 1, 2 చిత్రాల తర్వాత యష్ ఏ జానర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు? డైరెక్టర్ ఎవరు? నిర్మాణ సంస్థ ఎవరు? అంటూ ఇలా పలు విషయాలు వైరల్ అయ్యాయి. దీంతో ఈ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని టాక్సిక్ (Toxic)అంటూ మూవీ ప్రకటించారు. గీత మోహన్ దాస్(Geeta Mohan Das)దర్శకత్వంలో గ్యాంగ్ స్టార్ మూవీగా రాబోతోంది. ఈ చిత్రానికి యష్ కథను అందించారు. ఇందులో నయనతార , కియారా అద్వానీ, తారా సుతారియా, హుమా ఖురేషి , అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్ష న్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కే నారాయణ, యష్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యష్ 19వ సినిమాగా రాబోతున్న ఈ సినిమా 2026 మార్చి 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత ఎవరితో సినిమా చేయబోతున్నారు అని అభిమానులు అప్పుడే ఆలోచించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండగా.. తాజాగా ఒక వార్త తెరపైకి వచ్చింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రస్తుతం టాక్సిక్ సినిమాతో పాటు హిందీ రామాయణ చిత్రాలలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రావణాసుర పాత్ర పోషిస్తున్నారు. అంతేకాదు ఈ చిత్రానికి సహనిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు ఇంకా తెరపై ఉండగానే ఈయన సర్దార్ డైరెక్టర్ పి ఎస్ మిత్రన్ (PS Mitran) తో కలిసి సినిమా చేసే అవకాశం ఉందట.
మిత్రన్ చెప్పిన సైన్స్ ఫిక్షన్ కథకు సానుకూలంగా స్పందించారని, చర్చలు విజయవంతం అయితే ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాది మొదట్లోనే ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా కేజీఎఫ్ తర్వాత టాక్సిక్ సినిమా కోసం చాలా గ్యాప్ తీసుకున్న యష్.. ఇప్పుడు ఆ గ్యాప్ లేకుండానే వెంటనే మరో కొత్త మూవీని ప్రకటించడానికి సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. ఏదిఏమైనా యష్ కూడా ఇప్పుడు అందరిలాగే జోరు పెంచారని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
also read: Bigg Boss : బిగ్ బాస్ హౌస్‌లో కాస్ట్యూమ్స్ కష్టాలు… కొత్త బట్టలు కావాలంటే తిప్పలే