BigTV English

Team India: ఓరి మీ దుంపలు తెగ…ఇక ఆ టీమిండియా పేరు తీసేసి, KKR అని పెట్టుకోండి

Team India: ఓరి మీ దుంపలు తెగ…ఇక ఆ టీమిండియా పేరు తీసేసి, KKR అని పెట్టుకోండి

Team India: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఈనెల 19వ తేదీ నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా జట్టును ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఈ లిస్టులో రోహిత్ శర్మ కెప్టెన్సీ దొబ్బేశారు. గిల్ కు కెప్టెన్సీ ఇవ్వడమే కాకుండా శ్రేయాస్ అయ్యర్ ను రంగంలోకి దింపారు. ఇలాంటి నేపథ్యంలో సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. టీమిండియాను కాస్త కేకేఆర్ జట్టుగా మార్చేసారని గౌతమ్ గంభీర్ పై కొంతమంది అభిమానులు కూడా ఫైర్ అవుతున్నారు.


Also Read:  India Schedule: 2026 వ‌ర‌కు వ‌రుస‌గా మ్యాచ్ లే…ప్లేయ‌ర్ల‌కు రెస్ట్ కూడా లేదు..టీమిండియా కొత్త షెడ్యూల్ ఇదే

టీమిండియాను కాస్త కేకేఆర్ గా మార్చేశారా ?

టీమిండియాను కాస్త కేకేఆర్ జట్టుగా మార్చేశారని సోషల్ మీడియాలో రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ అభిమానులు తెగ కామెంట్స్ పెడుతున్నారు. దీనంతటికి కారణం గౌతమ్ గంభీర్ అన్న సంగతి తెలిసిందే. గతంలో కేకేఆర్ జట్టు కోచ్గా గౌతమ్ గంభీర్ వ్యవహరించారు. దీంతో అప్పటి నుంచి కేకేఆర్ నుంచి ఏ ప్లేయర్ వచ్చినా కూడా అతనికి ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నారని గౌతమ్ గంభీర్ పై అనేక విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా కేకేఆర్ బౌలర్ హర్షిత్ రానా ను ప్రతి మ్యాచ్ లో కూడా ఆడిస్తున్నాడు గౌతమ్ గంభీర్. రిజర్వ్ బెంచ్ లో ఉన్న ఇతరులకు ఛాన్స్ ఇవ్వకుండా హర్షిత్ రా నాకు మాత్రమే ఇస్తున్నారు. దీంతో గౌతమ్ గంభీర్ పెద్దకొడుకు హర్షిత రానా అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు జనాలు.


ఇక లేటెస్ట్ గా మరో అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు నేటిజన్స్. టీం ఇండియన్ కాస్త కేకేఆర్ జట్టుగా మార్చేశారని దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. గతంలో కేకేఆర్ జట్టు తరఫున గిల్ ఆడిన సంగతి తెలిసిందే. అతని టీమిండియా వన్డే అలాగే టెస్ట్ కెప్టెన్ చేసేసారు గౌతమ్ గంభీర్. త్వరలో టి20 కెప్టెన్ కూడా అవుతాడని తెలుస్తోంది. సూర్య కుమార్ యాదవ్ కూడా కేకేఆర్ జట్టుకు ప్రాతినిధ్యం మొదట్లో వహించాడు. అతడికి టి20 కెప్టెన్సీ ఇచ్చేశారు. శ్రేయాస్ అయ్యర్ కూడా 2024 టోర్నమెంట్ లో కేకేఆర్ ను చాంపియన్ గా నిలిపాడు.

దానికి ప్రతిఫలంగా టీమిండియా వన్డే వైస్ కెప్టెన్సీ శ్రేయాస్ అయ్యర్ కు అప్పగించారు గౌతమ్ గంభీర్. ఇటు గౌతమ్ గంభీర్ గతంలో కేకేఆర్ హెడ్ కోచ్ గా ఉండి ఇప్పుడు టీమిండియా కు కోచ్ అయిపోయారు. హర్షిత్ రానా కూడా టీమిండియాలో కీలక బౌలర్గా కొనసాగుతున్నాడు. పెద్దగా ఆడకపోయినా అవకాశాలు ఇస్తున్నారు. దీంతో టీం ఇండియాను కాస్త కేకేఆర్ జట్టుగా మార్చేశారని సోషల్ మీడియాలో దారుణంగా కామెంట్స్ పెడుతున్నారు.

Also Read: Tazmin Brits: ఒకే ఏడాది 5 సెంచరీల‌తో రికార్డు…రాముడి అవ‌తారం ఎత్తిన సౌతాఫ్రికా లేడీ..అచ్చం కోహ్లీ లాగే

 

Related News

Shikhar Dhawan: రెండో పెళ్లి చేసుకున్న శిఖ‌ర్ ధావ‌న్‌..చాహ‌ల్ కు భార్య‌ను ప‌రిచ‌యం చేస్తూ!

Rohit Sharma Captaincy: డిప్రెష‌న్ లో రోహిత్ శ‌ర్మ‌..షాకింగ్ వీడియో వైర‌ల్‌

Manoj Tiwary: కోహ్లీ, రోహిత్ ఉంటే ప్ర‌శ్నిస్తారు..అందుకే వాళ్ల గొంతు గంభీర్ నొక్కేశాడు

AB de Villiers: కోహ్లీ, రోహిత్‌పై గ్యారెంటీ లేదు..ఇక రిటైర్మెంట్ ఇచ్చేస్తే బెట‌ర్ !

Gautam Gambhir: గంభీర్ మ‌హాముదురు.. ట్రోలింగ్ కు చెక్ పెట్టేందుకు బీరు, బిర్యానీలు పెట్టి మ‌రీ !

Inzamam-ul-Haq: రోహిత్ శ‌ర్మ ఓ ముసలోడు, పందిలాగా ఉంటాడు…అందుకే కెప్టెన్సీ పీకిపారేశారు !

Womens World Cup 2025: నేడు ఇంగ్లాండ్ తో బంగ్లా ఫైట్‌..పాయింట్ల ప‌ట్టిక ఇదే, చిట్ట‌చివ‌ర‌న పాకిస్థాన్‌

Big Stories

×