Nagarjuna 100th Film Details: సునామీ లాంటి ప్రళయం వచ్చే ముందు తీర ప్రాంతం సైలెంట్‌గా ఉంటుంది. ఆ సైలెన్స్ తర్వాత దిక్కులు పిక్కటిల్లేలా ప్రళయం వస్తుంది. ఇప్పుడు అలాంటి సైలెన్స్ టాలీవుడ్‌లో ఉందా… అలాంటి ప్రళయం రాబోతుందా ? అంటే అవును అనే అంటున్నారు అక్కినేని అభిమానులు. నాగార్జున 100వ సినిమా కోసం అక్కినేని అభిమానులు మాత్రమే కాదు, సాధారణ ఆడియన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. ఈ 100వ సినిమాతో అయినా… నాగార్జున రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరుతాడా అనే ఎదురుచూసే వారి సంఖ్య కూడా ఎక్కువే ఉంది.
2024 సంక్రాంతికి నాగార్జున 99వ మూవీ ‘నా సామి రంగా‘ మూవీ రిలీజ్ అయింది. దీని తర్వాత నాగార్జున కుబేర, కూలీ సినిమాల్లో కనిపించాడు. కానీ, అవి స్ట్రెయిట్ హీరో సినిమాలు కావు. వాటిలో నాగార్జున నెగిటివ్ రోల్‌లో చేశాడు. అయితే, నాగ్ 100వ మూవీ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు అందరికీ గుడ్ న్యూస్ వచ్చింది. నాగార్జున 100వ మూవీ పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుందట. అంతే కాదు రెగ్యులర్ షూటింగ్ పార్ట్ ను కూడా స్టార్ట్ చేసుకుందట. సాధారణంగా సినిమా పూజా కార్యక్రమం అంటే… కొంత మంది గెస్ట్‌ల మధ్య, మీడియా ప్రతినిధుల మధ్య జరుపుకుంటారు.
Also Read:
కానీ, నాగార్జున 100వ మూవీ పూజా మాత్రం చాలా సైలెంట్‌గా అతి తక్కువ మంది అతిథులు, సన్నిహితుల మధ్య జరుపుకున్నారట. పూజా కార్యక్రమం సైలెంట్ కానిచ్చేసిన పర్లేదు. కానీ, కింగ్ మాత్రం వందకోట్ల క్లబ్ చేరాలని అభిమానులంత ఆశగా ఎదురుచూస్తున్నారు. సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం వైలెంట్ రిజల్ట్ రావాలని, బాక్సాఫీస్ వద్ద ప్రళయం రావాలని, అక్కినేని నాగార్జున కెరీర్‌లో చూడలేని రూ. 100 కోట్ల మార్క్ ను కొట్టాలని అంటున్నారు అభిమానులు.
నాగార్జున 100వ మూవీకి లాటరీ కింగ్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఈ టైటిల్ ను త్వరలోనే మేకర్స్ ప్రకటించే ఛాన్స్ ఉంది. కాగా, ఈ చిత్రానికి Ra కార్తిక్ దర్శకత్వం వహిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్నారు. అన్నపూర్ణ బ్యానర్ నిర్మిస్తుంది. అలాగే సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారట. ఇప్పటికే ఒక హీరోయిన్‌ను ఫిక్స్ చేశారట. మరో ఇద్దరి కోసం మూవీ యూనిట్ సెర్చ్ చేస్తున్నట్టు సమాచారం. ఇక సినిమాలో నాగ చైతన్య, అఖిల్ గెస్ట్ పాత్రలో మెరవబోతున్నట్టు కూడా తెలుస్తుంది.