Sreeleela : సినీ నటి శ్రీ లీల(Sreeleela) ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు. త్వరలోనే రవితేజతో (Raviteja)కలిసి శ్రీ లీల నటించిన మాస్ జాతర (Mass Jathara)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా అక్టోబర్ 31వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్లలో భాగంగా చిత్ర బృందం యాంకర్ సుమతో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
రవితేజ మీసం తిప్పాడంటే సినిమా హిట్ అవుతుందనే సెంటిమెంట్ ఇప్పటికే అభిమానులలో ఉంది అలాగే ఈయన పోలీస్ డ్రెస్ వేశారంటే ఆ సినిమా పక్కా బ్లాక్ బాస్టర్ అంటూ కూడా అభిమానులు భావిస్తుంటారు. ఈ సెంటిమెంట్ గురించి సుమా ప్రశ్నించడంతో మేము కావాల్సిగా అలాంటి సన్నివేశాలు పెట్టలేదు. అది అనుకోకుండా జరిగిపోయిందని రవితేజ సమాధానం ఇచ్చారు. వెంటనే సుమ శ్రీలీలను ప్రశ్నిస్తూ ఇలాంటి సెంటిమెంట్లు మీకు ఉన్నాయా అంటూ అడగడంతో వెంటనే రవితేజ బోలెడు ఉన్నాయి అంటూ సమాధానం చెప్పారు.
తాను పిల్లి ఎదురు వచ్చిన బయటకు వెళ్లకూడదు, ఎవరైనా తుమ్మిన బయటకు వెళ్ళకూడదనే సెంటిమెంట్లను బాగా నమ్ముతానని ఈ సందర్భంగా శ్రీ లీల తెలియచేశారు. ఇక ఇదే విషయం గురించి రవితేజ మాట్లాడుతూ ఇలాంటి సెంటిమెంట్లను మూఢనమ్మకాలను దాదాపు 99 శాతం మంది నమ్ముతుంటారు. మిగిలిన ఆ ఒక్క శాతంలో నేను కూడా ఒకడినే ఇలాంటి వాటిని అస్సలు నమ్మను అంటూ రవితేజ తెలియజేశారు. ఇక శ్రీ లీల మాత్రం ఇలాంటి వాటిపై నాకు నమ్మకం ఎక్కువ అని చెప్పడంతో ఏంటి శ్రీ లీల ఇలాంటి వాటిని కూడా నమ్ముతారా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే సినీ ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలు ఎక్కువగా ఇలాంటి నమ్మకాలను సెంటిమెంట్లను ఫాలో అవుతూ ఉంటారు.
రైల్వే పోలీస్ ఆఫీసర్ గా రవితేజ..
ఇక మాస్ జాతర సినిమా విషయానికి వస్తే భాను భోగవరపు దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. నిజానికి ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ అక్టోబర్ 31వ తేదీ విడుదలకు సిద్ధమైంది. ఇక ఈ సినిమాలో మరోసారి రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి మాత్రం రైల్వే పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఈయన నటించబోతున్నారని స్పష్టమవుతుంది. ఇక ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం వరుస అప్డేట్స్ విడుదల చేయబోతున్నారు. రవితేజ చివరిగా ధమాకా సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత పలు చిత్రాలలో నటించిన ఈయనకు పెద్దగా సక్సెస్ మాత్రం రాలేదని చెప్పాలి. మరి మాస్ జాతర సినిమాతో రవితేజ ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది.
Also Read: Sai Kiran -Sravanthi: గుడ్ న్యూస్ చెప్పిన నటుడు సాయి కిరణ్.. కొత్త వ్యక్తి రాబోతున్నారంటూ!