BigTV English

Sai Kiran -Sravanthi: గుడ్ న్యూస్ చెప్పిన నటుడు సాయి కిరణ్.. కొత్త వ్యక్తి రాబోతున్నారంటూ!

Sai Kiran -Sravanthi: గుడ్ న్యూస్ చెప్పిన నటుడు సాయి కిరణ్.. కొత్త వ్యక్తి రాబోతున్నారంటూ!

Sai Kiran -Sravanthi: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగిన వారిలో సాయి కిరణ్(Sai Kiran) ఒకరు. ఈయన గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. నువ్వే కావాలి, ప్రేమించి వంటి సినిమాలలో నటించి పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్న సాయికిరణ్ ఇటీవల కాలంలో బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇక ఈయన కోయిలమ్మ సీరియల్ ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అలాగే స్టార్ మాలో ప్రసారమైన గుప్పెడంత మనసు సీరియల్ లో మహేంద్రగా కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.


తండ్రి కాబోతున్న నటుడు సాయి కిరణ్..

ప్రస్తుతం బుల్లితెరపై వరుస సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సాయికిరణ్ గత ఏడాది కోకిలమ్మ సీరియల్ నటి స్రవంతి(Sravanthi)ని ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలా వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు అప్పట్లో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఇక పెళ్లి తర్వాత ఈ జంట తమ వ్యక్తిగత జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. అలాగే పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి స్టార్ మాలో భానుమతి అనే సీరియల్ లో జంటగా నటించారు. ఇలా కెరియర్ పరంగా వరుస సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్న ఈ జంట తాజాగా అభిమానులకు శుభవార్తను తెలియజేశారు.

గుడ్ న్యూస్ చెప్పిన నటి స్రవంతి..

స్రవంతి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా ఈ జంట తమకు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ.. త్వరలోనే మరో కొత్త వ్యక్తి రాబోతున్నారు అంటూ తన ప్రెగ్నెన్సీ విషయాన్ని షేర్ చేస్తూ తమ సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఇలా త్వరలోనే సాయికిరణ్ స్రవంతి దంపతులు తల్లితండ్రులుగా మారబోతున్నారనే విషయం తెలియడంతో అభిమానులు కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం వీరు షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఇకపోతే నటుడు సాయికిరణ్ కు ఇది రెండవ వివాహం అనే సంగతి అందరికీ తెలిసిందే. ఈయన గతంలో వివాహం చేసుకొని కొన్ని కారణాలవల్ల మొదటి భార్యకు విడాకులు ఇచ్చారు. సాయి కిరణ్ 2010వ సంవత్సరంలో వైష్ణవి అనే అమ్మాయితో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా జన్మించింది. అయితే ఇద్దరి మధ్య ఏర్పడిన భేదాభిప్రాయాల కారణంగా వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. విడాకుల తర్వాత కెరియర్ పై ఫోకస్ పెట్టి వరుస బుల్లితెర సీరియల్స్ లో నటిస్తున్న సాయికిరణ్ నటి స్రవంతితో ప్రేమలో పడ్డారు. ఇలా ప్రేమలో ఉన్న ఈ జంట గత ఏడాది డిసెంబర్ లో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇలా బుల్లితెర సీరియల్స్ తో ఎంతో బిజీగా ఉన్న నటుడు సాయికిరణ్ వెండితెర సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.

Also Read: Nagachaitanya -Sobhita: శోభితతో తొలి పరిచయం.. సీక్రెట్ చెప్పిన చైతూ!

Related News

Yash 21 Movie: ఇప్పుడు ఆలస్యమేం లేదు… యష్ నెక్ట్స్ సినిమా వచ్చేస్తుంది!

Funky Teaser : విశ్వక్సేన్ ఫంకీ టీజర్ డేట్ ఫిక్స్, జాతి రత్నాలు అనుదీప్ కొత్త ఫన్

Nandamuri Tejaswini : కెమెరా ముందుకు బాలకృష్ణ కూతురు తేజస్విని, డెబ్యూ అయిపోయినట్లేనా?

Sreeleela: ఏంటీ శ్రీలీల ఆ విషయంలో ఇలాంటి సెంటిమెంట్ లు కూడా ఉన్నాయా..

Ram Charan: రామ్ చరణ్ న్యూ లుక్ చూశారా.. వింటేజ్ లుక్ లో.. ఆ మూవీను తలపిస్తూ!

Nagarjuna 100 Movie: సునామీ వచ్చే ముందు ఉండే సైలెన్సా ఇది ?

Nagachaitanya -Sobhita: శోభితతో తొలి పరిచయం.. సీక్రెట్ చెప్పిన చైతూ!

Big Stories

×