BigTV English

Rashmika Mandanna: రష్మికను బ్యాన్ చేసిన కన్నడ ఇండస్ట్రీ.. అసలు విషయం చెప్పిన నటి!

Rashmika Mandanna:  రష్మికను బ్యాన్ చేసిన కన్నడ ఇండస్ట్రీ.. అసలు విషయం చెప్పిన నటి!

Rashmika: సినీ నటి రష్మిక మందన్న(Rashmika Mandanna) ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈమె సినిమాలన్నీ ఇటీవల కాలంలో పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. రష్మిక కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కిరిక్ పార్టీ అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ప్రేక్షకులకు పరిచయమైన ఈమె అనంతరం తెలుగులో అవకాశాలను అందుకుంటూ తెలుగు తమిళ హిందీ భాషలలో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అయితే రష్మిక పట్ల కన్నడ ప్రేక్షకులు పలు సందర్భాలలో తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.


కన్నడ ఇండస్ట్రీకి దూరంగా రష్మిక?

గతంలో కాంతార సినిమా గురించి ఈమె మాట్లాడకపోవడం అదేవిధంగా తన సినిమా ప్రమోషన్లను బెంగళూరులో నిర్వహించగా ఈమె కన్నడ కాకుండా ఇంగ్లీషులో మాట్లాడటంతో కన్నడ అంటే అంత చులకన అంటూ ఈమెపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి బ్యాన్ చేయాలి అంటూ డిమాండ్లు చేశారు. గత కొంతకాలంగా ఈమె కన్నడ సినిమాలలో నటించని నేపథ్యంలో నిజంగానే రష్మికను కన్నడ చిత్ర పరిశ్రమ బ్యాన్ చేసిందా? అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. తాజాగా కన్నడ చిత్ర పరిశ్రమ తనని బ్యాన్ చేసింది అంటూ వస్తున్న వార్తలపై ఈమె స్పందించి క్లారిటీ ఇచ్చారు.

తనని ఎవరు బ్యాన్ చేయలేదు..

రష్మిక మందన్న నటిస్తున్న తాజా చిత్రం థామా(Thamma). ఈ సినిమా అక్టోబర్ 21వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా హర్రర్ థ్రిల్లర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్న నేపథ్యంలో రష్మిక ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె కన్నడ చిత్ర పరిశ్రమ తనని బ్యాన్ చేయడం గురించి మాట్లాడారు. ఇతరుల అభిప్రాయాలకుల అనుగుణంగా వెళ్లడం కష్టతరమని అలాగే మన వ్యక్తిగత విషయాలు ఎప్పుడూ కూడా ప్రైవేటుగానే ఉండాలని రష్మిక తెలియజేశారు.


మూలాలను మరిచిపోవద్దు..

కన్నడ ఇండస్ట్రీకి చెందిన నిర్మాతలు తనని బ్యాన్ చేశారని వస్తున్న వార్తలలో కూడా నిజం లేదని ఇప్పటివరకు నన్ను ఎవరు బ్యాన్ చెయ్యలేదు అంటూ రష్మిక ఈ సందర్భంగా తన గురించి వస్తున్న రూమర్లకు చెక్ పెట్టారు. దీంతో రష్మిక అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఇటీవల రిషబ్ శెట్టి హీరోగా నటించిన కాంతార 1 సినిమాపై ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తున్న రష్మిక మాత్రం ఇప్పటివరకు స్పందించకపోవడం పట్ల పలువురు ఈమెపై విమర్శలు కురిపిస్తున్నారు. రష్మిక నేడు ఈ స్థాయిలో ఉంది అంటే అందుకు కారణం రిషబ్ అనే చెప్పాలి. రిషబ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిరిక్ పార్టీ సినిమా ద్వారా ఈమె హీరోయిన్గా పరిచయం కావడంతో ఆయన సినిమాపై స్పందించని నేపథ్యంలో మూలాలను మర్చిపోవద్దు అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read: Anchor Lasya: కొత్తింట్లోకి అడుగుపెట్టిన యాంకర్ లాస్య.. కల నెరవేరిందంటూ!

Related News

Heroine : హీరోయిన్ పై దారుణం, మత్తు మందిచ్చి ఆ పని చేసిన నటుడు

Mohan Lal: మరో అరుదైన గౌరవాన్ని అందుకున్న మోహన్ లాల్.. సంతోషంలో అభిమానులు!

Ravi Teja: మాస్‌ జాతర సాంగ్‌ ట్రోల్స్‌పై రవితేజ రియాక్షన్, ఏమన్నారంటే..!

Allari Naresh: పాములకు భయపడి బ్లాక్ బస్టర్ వదులుకున్న అల్లరి నరేష్..ఎంత పని చేశావయ్యా!

Yash 21 Movie: ఇప్పుడు ఆలస్యమేం లేదు… యష్ నెక్ట్స్ సినిమా వచ్చేస్తుంది!

Funky Teaser : విశ్వక్సేన్ ఫంకీ టీజర్ డేట్ ఫిక్స్, జాతి రత్నాలు అనుదీప్ కొత్త ఫన్

Nandamuri Tejaswini : కెమెరా ముందుకు బాలకృష్ణ కూతురు తేజస్విని, డెబ్యూ అయిపోయినట్లేనా?

Big Stories

×