BigTV English

Bigg Boss : బిగ్ బాస్ హౌస్‌లో కాస్ట్యూమ్స్ కష్టాలు… కొత్త బట్టలు కావాలంటే తిప్పలే

Bigg Boss : బిగ్ బాస్ హౌస్‌లో కాస్ట్యూమ్స్ కష్టాలు… కొత్త బట్టలు కావాలంటే తిప్పలే

Bigg Boss : ప్రస్తుతం తెలుగు బుల్లితెర పై వస్తున్న రియాల్టీ షోలలో బిగ్ బాస్ (Bigg Boss) రియాల్టీ షో భారీ టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతోంది. అయితే మొదట ఫస్ట్ సీజన్ స్టార్ట్ అయిన సమయంలో వచ్చినంత టీఆర్పీ రేటింగ్ ఇప్పుడైతే రావట్లేదు. మొదట్లో ఈ షోని చాలామంది చూసేవారు. అయితే ఈ షోకి వెళ్లిన వారిలో కొంతమందికి బిగ్ బాస్ ప్లస్ అయితే మరికొంతమందికి మైనస్ అయింది. అయితే బిగ్ బాస్ లోకి వెళ్లిన చాలామంది షోపై నెగిటివ్ కామెంట్స్ చేయడంతో మరింత నెగెటివిటీ మూట కట్టుకుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్ 9 నడుస్తున్న సంగతి తెలిసిందే.ఇందులో 6 గురు కామనర్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో ఇప్పటికే నలుగురు ఎలిమినేట్ అయ్యారు. శ్రష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియా శెట్టి, మాస్క్ మాన్ హరీష్ లు ఎలిమినేట్ అయ్యారు.


బిగ్ బాస్ హౌస్ లో బట్టల కష్టాలు..

అయితే తాజాగా ఈ బిగ్ బాస్ హౌస్ లోకి కామనర్ గా వెళ్లిన మర్యాద మనీష్ బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ వేసుకునే బట్టల కష్టాల గురించి ఓ వీడియో ద్వారా బయటపెట్టారు. ఆయన ఏం మాట్లాడారంటే.. “బిగ్ బాస్ టీం కంటెస్టెంట్స్ కి బట్టలు ఇస్తారా లేదా అనే డౌట్ చాలా మందికి ఉంది. బిగ్ బాస్ టీం క్లాత్స్ ఇస్తారు. కానీ బిగ్ బాస్ లో 4 టైప్స్ కాస్ట్యూమ్స్ ఉంటాయి. డైలీ వేర్, నైట్ వేర్,టాస్క్ వేర్,వీకెండ్ వేర్.. ఇబిగ్ బాస్ లోకి వచ్చేటప్పుడే రెండు వారాలకు సరిపడా బట్టలు మేమే తీసుకెళ్తాం. డైలీ వేర్,నైట్ వేర్ కొంతమంది రిపీట్ చేస్తారు. మరి కొంతమంది కొత్తవి వేసుకుంటారు.

అప్పుడు మాత్రమే కొత్త బట్టలు ఇస్తారు..

వీకెండ్ లో అయితే ప్రతి ఒక్కరు కొత్త డ్రెస్ లే వేసుకుంటారు. ఇక టాస్క్ లో అయితే బిగ్ బాస్ టీం స్పెషల్ టాస్క్ వేర్ డ్రెస్ లను ఇస్తుంది. స్పెసిఫిక్ టాస్కులు ఉన్నప్పుడు బిగ్ బాస్ టీం అందరికీ క్లాత్స్ ఇస్తుంది. ఒకవేళ మాకు కొత్త బట్టలు కావాలి అనుకుంటే కెమెరా ముందు నిలబడి బిగ్ బాస్ ని అడుగుతాం. అలాగే మా దగ్గర ఉన్న బట్టలు చిరిగిపోతే బిగ్ బాస్ ని రిక్వెస్ట్ చేసి కొత్త బట్టలు పంపించమని చెప్తాం.అయితే అన్ని సార్లు అలా పంపించరు. ఎన్నో కెమెరాలు మమ్మల్ని చూస్తూ ఉంటాయి. కాబట్టి మాకు బట్టలు అవసరం అనిపిస్తే మా పర్సనాలిటీకి సరిపోయేలా బట్టలు లోపలికి పంపిస్తారు. ఆ తర్వాత బిగ్ బాస్ స్టోరేజ్ రూమ్ లో పెట్టి బెల్ మోగిస్తాడు. మేం వెళ్లి బట్టలు తెచ్చుకుంటాం.


also read:Bigg Boss 9 Promo: ముదిరిన లవ్ ట్రాక్.. నవ్వులే కాదు కన్నీళ్లు కూడా!

వీడియోతో సహా బయట పెట్టిన మర్యాద మనీష్..

ప్రస్తుతం నేను కాదంబిని అనే డిజైనర్ తో పార్ట్నర్ అయ్యాను. నాకు కావలసిన బట్టలన్నీ వాళ్లే పంపారు. వారికి థాంక్స్.. ఇక ఓవరాల్ గా చెప్పాలంటే బిగ్ బాస్ మాకు వీకెండ్ క్లాత్స్ అస్సలు ఇవ్వరు.. కేవలం స్పెసిఫిక్ టాస్కుల కోసం మాత్రమే టాస్క్ వేర్ డ్రెస్సులు ఇస్తారు.అలాగే ఎప్పుడు పడితే అప్పుడు డ్రెస్సులు పంపించరు. అవసరం అయితేనే పంపిస్తారు” అంటూ బిగ్ బాస్ లోని బట్టల కష్టాల గురించి చెప్పుకొచ్చారు మర్యాద మనీష్

 

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related News

Bigg Boss 9 Promo: ముదిరిన లవ్ ట్రాక్.. నవ్వులే కాదు కన్నీళ్లు కూడా!

Bigg Boss: బిగ్‌ బాస్‌కి షాక్.. షో ఆపేయాలంటూ ప్రభుత్వం నోటీసులు!

Bigg Boss 9 Telugu : రీతూ లవ్ స్టోరీ పై మాస్క్ మ్యాన్ షాకింగ్ కామెంట్స్.. నెక్స్ట్ ఎలిమినేట్ ఆమె..?

Bigg Boss 9 Promo : వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ… హౌస్‌మేట్స్ బెండ్ తీస్తున్న బిగ్ బాస్!

Bigg Boss 9 Telugu : ఆమె వల్లే మా వాడు ఫోకస్ చెయ్యట్లేదు.. పవన్ తమ్ముడి హాట్ కామెంట్స్..!

Bigg Boss 9 Telugu: 5వ వారం నామినేషన్స్ లో ట్విస్ట్.. డబుల్ ఎలిమినేషన్ ఉందా..?

Bigg Boss 9 Promo: కలిసిపోయిన రీతూ , కళ్యాణ్.. మండిపడ్డ శ్రీజ!

Big Stories

×