Nandamuri Tejaswini : ప్రతి ఫీల్డ్ లో వారసత్వం ఉన్నట్లు సినిమా ఫీల్డ్ లో కూడా ఉంది. ఇప్పుడు ఉన్న చాలామంది సీనియర్ హీరోలు ఒకప్పటి హీరోలకు వారసులు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు నందమూరి బాలయ్య. చాలామంది నందమూరి అభిమానులు బాలయ్యను దేవుడులా కొలుస్తారు. విపరీతంగా ప్రేమిస్తారు.
బాలకృష్ణ కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా సమాజ సేవ కూడా చేస్తుంటారు. బసవతారకం హాస్పిటల్ ను సక్సెస్ఫుల్ గా నడుపుతున్నారు. ఒకవైపు సినిమాల్లో రాణిస్తూనే మరోవైపు అన్ స్టాపబుల్ వంటి షో కు హోస్ట్ గా వ్యవహరించారు. ఈ షో కూడా బాగా సక్సెస్ అయింది. నందమూరి బాలకృష్ణ కొడుకు మోక్షాజ్ఞ ఎంట్రీ కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. బాలయ్య కూతురు తేజస్విని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పటివరకు నందమూరి తేజస్విని ఏ సినిమాలో కూడా కనిపించలేదు. చూడడానికి కూడా ఆవిడ బాగుంటారు. హీరోయిన్ అవ్వడానికి అన్ని క్వాలిటీస్ పుష్కలంగా ఉన్నాయి అనిపిస్తుంది.
నందమూరి తేజస్విని ఒక ఫేమస్ జువెలరీ కంపెనీకి యాడ్ ఫిలింలో నటించారు. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా అయిపోయినట్లు తెలుస్తుంది. మరోవైపు అదే కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే యాడ్ ఫిలిమ్ చేసి చాలామంది నందమూరి అభిమానులకు ఒక హోప్ ఇచ్చారు. నందమూరి వారసురాలు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుంది అంటే అభిమానులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు.
మరోవైపు మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని (Sitara gattamaneni) కూడా ఇంస్టాగ్రామ్ రీల్స్ లో తన టాలెంట్ చూపించి అభిమానులను ఆకట్టుకున్నారు. ఇప్పటికే కొన్ని యాడ్ ఫిలిమ్స్ లో నటించి ఆకట్టుకున్నారు సితార ఘట్టమనేని.
మరోవైపు నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ (Nandamuri mokshagna) కూడా చూడడానికి ఇప్పుడు చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. తనను తాను మార్చుకున్న విధానం చాలా ఆశ్చర్యకరంగా నందమూరి అభిమానులకు అనిపించింది.
గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమా ఉంటుంది అని ఆ మధ్యకాలంలో వార్తలు కూడా వచ్చాయి. అయితే తాను దర్శకుడుగా ఆదిత్య 369 (Aditya 369 movie sequel) సీక్వెల్ చేస్తే దానిలో మోక్షజ్ఞను హీరోగా పెడతాను అని బాలకృష్ణ కూడా స్వయంగా చెప్పారు. అయితే ఇప్పటివరకు మోక్షజ్ఞ సినిమాకి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన కూడా జరగలేదు. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎంతో క్యూరియాసిటీ ఎదురుచూస్తున్నారు.
Also Read: Vijay rashmika : మొత్తానికి బయటపడ్డారు, సీక్రెట్ గా విజయ రష్మిక ఎంగేజ్మెంట్