BigTV English

Funky Teaser : విశ్వక్సేన్ ఫంకీ టీజర్ డేట్ ఫిక్స్, జాతి రత్నాలు అనుదీప్ కొత్త ఫన్

Funky Teaser : విశ్వక్సేన్ ఫంకీ టీజర్ డేట్ ఫిక్స్, జాతి రత్నాలు అనుదీప్ కొత్త ఫన్

Funky Teaser : సినిమా అంటే వినోదానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని నమ్మే అతి తక్కువ మంది దర్శకులలో అనుదీప్ కేవి ఒకడు. పిట్టగోడ అనే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు అనుదీప్. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది.


నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కలిసి నటించిన జాతి రత్నాలు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఆ సినిమా ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అదే స్థాయిలో అనుదీప్ కూడా పాపులర్ అయిపోయాడు. ఇప్పటికీ అనుదీప్ వీడియోస్ కి స్పెషల్ క్రేజ్ ఉంటుంది. చాలామంది స్ట్రెస్ బస్టర్స్ గా అనుదీప్ వీడియోస్ ని కూడా చూస్తుంటారు అనడంలో అతిశయోక్తి లేదు. విశ్వక్సేన్ హీరోగా అనుదీప్ ఫంకీ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఫంకీ టీజర్ అప్డేట్ 

విశ్వక్సేన్ తో అనుదీప్ సినిమా అనౌన్స్ చేసినప్పుడే చాలామందికి క్యూరియాసిటీ ఏర్పడింది. శివ కార్తికేయన్ హీరోగా చేసిన ప్రిన్స్ సినిమా ఊహించిన స్థాయి సక్సెస్ అందుకోలేకపోయింది. ఇప్పుడు మరోసారి ఫంకీ సినిమాతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు అనుదీప్.


ఈ సినిమాకి సంబంధించిన టీజర్ అప్డేట్ కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించారు. అక్టోబర్ 10న ఈ సినిమాకి సంబంధించిన టీజర్ విడుదల కానుంది. ఈ అప్డేట్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది.

డైరెక్టర్ గా విశ్వక్సేన్

ఫంకీ సినిమాలో విశ్వక్సేన్ క్యారెక్టర్ డైరెక్టర్ అని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు రిలీజ్ అయిన పోస్టర్ చూస్తుంటే ఆ వార్తలకు బలం చేకూరుతుంది. ఎందుకంటే ముందు క్లాప్ బోర్డును చూపించారు. ఆ వెనుక బ్లర్ లో విశ్వక్సేన్ ఉన్నాడు.

ఒకవైపు అనుదీప్ సినిమాలు చేస్తూనే మరోవైపు కొన్ని సినిమాల్లో నటుడుగా కూడా దర్శనమిస్తున్నాడు. అనుదీప్ కామెడీ టైమింగ్ కు చాలా మంది అభిమానులు ఉన్నారు. వాళ్లంతా కూడా ఫంకీ టీజర్ అనుదీప్ ఎలా డిజైన్ చేశాడు అని క్యూరియాసిటీతో ఉన్నారు. అనుదీప్ రచనలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఒక నిజాన్ని కూడా చాలా కామెడీగా చెబుతాడు.

అనుదీప్ మాట్లాడితే కొన్ని సందర్భాల్లో కామెడీగా ఉంటుంది కానీ అనుదీప్ కు కొన్ని విషయాల్లో ఉన్న అవగాహన చూస్తే చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంది. సుమా హోస్టుగా చేసిన క్యాష్ షో తో మంచి పాపులారిటీ అనుదీప్ కు వచ్చింది. ఇప్పటికీ కూడా కొంతమంది క్యాష్ అనుదీప్ అని పిలుస్తూ ఉంటారు. అలానే కొన్ని సినిమాలను ప్రమోట్ చేసే విధానం కూడా ఫన్నీగా అనిపిస్తుంది.

Also Read: Nandamuri Tejaswini : కెమెరా ముందుకు బాలకృష్ణ కూతురు తేజస్విని, డెబ్యూ అయిపోయినట్లేనా?

Related News

Mohan Lal: మరో అరుదైన గౌరవాన్ని అందుకున్న మోహన్ లాల్.. సంతోషంలో అభిమానులు!

Ravi Teja: మాస్‌ జాతర సాంగ్‌ ట్రోల్స్‌పై రవితేజ రియాక్షన్, ఏమన్నారంటే..!

Allari Naresh: పాములకు భయపడి బ్లాక్ బస్టర్ వదులుకున్న అల్లరి నరేష్..ఎంత పని చేశావయ్యా!

Rashmika Mandanna: రష్మికను బ్యాన్ చేసిన కన్నడ ఇండస్ట్రీ.. అసలు విషయం చెప్పిన నటి!

Yash 21 Movie: ఇప్పుడు ఆలస్యమేం లేదు… యష్ నెక్ట్స్ సినిమా వచ్చేస్తుంది!

Nandamuri Tejaswini : కెమెరా ముందుకు బాలకృష్ణ కూతురు తేజస్విని, డెబ్యూ అయిపోయినట్లేనా?

Sreeleela: ఏంటీ శ్రీలీలకు ఆ విషయంలో ఇలాంటి సెంటిమెంట్ లు కూడా ఉన్నాయా..

Big Stories

×