Sekhar Kammula: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో శేఖర్ కమ్ముల(Sekhar Kammula) ఒకరు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా వస్తుంది అంటే కచ్చితంగా ఆ సినిమాని ప్రతి ఒక్కరూ చూసే విధంగానే ఉంటుంది. ఇలా ఎన్నో ఫీల్ గుడ్ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన శేఖర్ కమ్ముల తాజాగా నాగార్జున(Nagarjuna) శివ (Shiva) రీ రిలీజ్ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. అదే విధంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) గురించి కూడా ఈయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న రాంగోపాల్ వర్మ ఒకప్పుడు ఎన్నో అద్భుతమైన క్లాసిక్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
ఇలా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున అమల హీరో హీరోయిన్లుగా నటించిన సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ చిత్రం శివ. ఈ సినిమా నవంబర్ 14వ తేదీ తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల మాట్లాడుతూ…శివ సినిమా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదని తెలిపారు. ఈ సినిమా షూటింగ్ మా ఇంటి పరిసర ప్రాంతాలలోనే జరిగిందని అయితే సినిమా షూటింగ్ కోసం నాగార్జున వస్తున్నారనే విషయం తెలియగానే మా ఫ్రెండ్స్ అందరితో పాటు వెళ్లే వాళ్లమని తెలిపారు.
నా స్నేహితులతో కలిసి నాగార్జునను చూడటానికి వెళ్లే వాళ్లమే తప్ప, అప్పటివరకు నాకు రాంగోపాల్ వర్మ ఎవరో కూడా తెలియదని ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా ట్రూ క్లాసిక్ మాస్టర్ పీస్ అనే ఫీలింగ్ ను ఇస్తుందని, ఈ సినిమా రీ రిలీజ్ కోసం తాను కూడా ఎదురు చూస్తున్నానని శేఖర్ కమ్ముల వెల్లడించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో పలువురు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
అదేంటి డైరెక్టర్ గారు ఏకంగా వర్మ ఎవరో తెలియదని చెప్పేస్తున్నారు. కాంట్రవర్సీ కింగ్ తోనే ఆటలా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఒకానొక సమయంలో వర్మ దర్శకత్వంలో సినిమా వస్తుందంటే సినిమాపై భారీ అంచనాలు ఉండేవి కానీ ఇటీవల కాలంలో ఈయన సినిమా వస్తుందంటే సినిమా కంటే ముందు సినిమాపై వివాదాలు చెలరేగుతూ ఉంటాయి. ఇటీవల కాలంలో వర్మ తన సినిమాల ద్వారానే వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇక శేఖర్ కమ్ముల సినిమాల విషయానికి వస్తే ఇటీవల ఈయన ధనుష్, రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన కుబేర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల తన తదుపరి సినిమాని ప్రకటించాల్సి ఉంది.
Also Read: Narne Nithin pre Wedding: ఘనంగా నార్నే నితిన్ సంగీత్..సూపర్ లుక్ లో ప్రణతి!