E-Paper
Advertisement

సీజేపీ ఉద్యమం.. విద్యార్థులకు అండగా ప్రముఖ సెలబ్రిటీలు!

సీజేపీ ఉద్యమం.. విద్యార్థులకు అండగా ప్రముఖ సెలబ్రిటీలు!
Advertisement

Gouri G. Kishan: నీట్ పరీక్షలో అవకతవకలు ఏర్పడ్డాయి అంటూ ఢిల్లీలో విద్యార్థులు చేస్తున్న నిరసనకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఈ మేరకు కేరళ కొచ్చిలోని మహారాజా కళాశాలలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో సినీ ప్రముఖులు కూడా పాల్గొంటూ విద్యార్థులకు అండగా నిలిచారు. ఈ నిరసన బృందంలో ప్రముఖ దర్శకులు ఆషిక్ అబు, మహేష్ నారాయణన్, నటులు జోజు జార్జ్, నటీమణులు ప్రియా వారియర్, గౌరీ జి కిషన్, శాంతి బాలచంద్రన్, గోపిక రమేష్ తో పాటు బిగ్ బాస్ తారలు నోరా, రజ్మీన్ అలాగే రచయితలు ఎన్ఎస్ మాధవన్ , కేఆర్ మీరా కూడా ఇందులో పాల్గొన్నారు.

పోస్టర్ తో గౌరీ నిరసన..

ఇకపోతే విద్యార్థులకు అండగా నిలిచిన గౌరీ ఏకంగా ఒక పోస్టర్ పట్టుకొని నిరసన ప్రదర్శనకు వచ్చారు. ఇక ఆమె పట్టుకున్న పోస్టర్ లో” శాంతియుతంగా.. చెప్పే ప్రతి మాటను వినండి.. ప్రజాస్వామ్యం ప్రతిదీ వింటుంది” అంటూ రాసి ఉన్న ఒక పోస్టర్ ను పట్టుకొని ప్రదర్శన ఇచ్చింది.

నిరసన తెలిపిన పలువురు సినీ తారలు..

Advertisement

అలాగే ప్రముఖ నటుడు రాపర్ బేబీ జీన్ కూడా ఈ నిరసనకు సంఘీభావం తెలిపేందుకు మహారాజా కళాశాలకు వచ్చారు. అలాగే ప్రముఖ నటుడు జోజు జార్జ్..” దేశంలో జరుగుతున్నది అత్యవసర పరిస్థితి అని, దేశ విద్యా వ్యవస్థ ఇబ్బందుల్లో ఉందని , అయితే దీనిని ప్రతి ఒక్కరం సంకల్ప బలంతో అధిగమిద్దాం” అంటూ ఆయన తెలిపారు. అంతేకాదు “ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిగా ఉండేందుకు అర్హుడు కాదు” అంటూ దర్శకుడు ఆషిక్ అబూ కూడా తెలిపారు.

సోషల్ మీడియా ద్వారా మద్దతు పలికిన తారలు..

వీరితోపాటు చాలామంది ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ మద్దతు పలికారు. పార్వతి తిరువోత్ , నజ్రియా నజీమ్, నజ్లెన్ , నిఖిల విమల్, గ్రేస్ ఆంటోనీ, హషీర్ వంటి ప్రముఖులు విద్యార్థులకు నిరసనగా మద్దతు పలికారు. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Advertisement

ALSO READ:మెట్టెల సవ్వడి, స్నేహ సీరియల్స్ నటి కావేరి గుర్తుందా.. ఆమె అసలు పేరు తెలిస్తే షాక్?

జాను తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన గౌరీ జి కిషన్..

ఇకపోతే ఇందులో నిరసన తెలిపిన గౌరీ జి కిషన్ విషయానికి వస్తే.. మలయాళ బ్యూటీ అయిన ఈమె.. తమిళ్, తెలుగు చిత్రాలలో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. తొలిసారి 2018లో 96 అనే తమిళ చిత్రంలో త్రిష చిన్నప్పటి పాత్ర పోషించి అందరిని ఆకట్టుకుంది. ఇక అలాగే తెలుగులో రీమేక్ అయిన జాను చిత్రంలో కూడా నటించి మెప్పించింది.. ఇకపోతే ఈమె తెలుగులో నేరుగా నటించింది మాత్రం శ్రీదేవి శోభన్ బాబు. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విష్ణు ప్రశాంత్ , సుస్మిత నిర్మించిన ఈ చిత్రానికి ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు. సంతోష్ శోభన్ , గౌరీ కిషన్ ప్రధాన పాత్రలో 2023 లో ఈ సినిమా విడుదల అయింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా వచ్చిన ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది.

Related News

RAW NTR సంచలన నిర్ణయం.. సంస్థ మూసివేత!

శ్రీవారి సన్నిధిలో మరో వివాదం.. పెద్ది పోస్టర్ తో మహిళా హల్ చల్!

ధురంధర్ నటి ఆయేషా ఖాన్ అరెస్ట్.. అసలేం జరిగిందంటే?

ఇండియాలో 450కి పైగా షోలు.. 59దేశాలలో స్క్రీనింగ్.. కృతజ్ఞతలు చెప్పిన డైరెక్టర్!

‘ది ఒడిస్సీ’లో ధనుష్ మిస్ ..అసలు కారణం ఇదే!

చమ్మక్ చంద్ర మగాడు అనే విషయం కూడా….అసలు విషయం చెప్పేసిన జబర్దస్త్ సత్యశ్రీ

గబ్బర్ సింగ్ నటుడికి బ్రెయిన్ స్ట్రోక్.. పరిస్థితి విషమంటున్న వైద్యులు!

Big Stories

Advertisement
×