BigTV English

Tollywood: శశివదనే ప్రెస్ మీట్.. క్లైమాక్స్ ట్విస్ట్ కోసమైనా మూవీ చూడాల్సిందే!

Tollywood: శశివదనే ప్రెస్ మీట్.. క్లైమాక్స్ ట్విస్ట్ కోసమైనా మూవీ చూడాల్సిందే!

Tollywood: ప్రముఖ యంగ్ హీరో రక్షిత్ అట్లూరి (Rakshith Atluri) , హీరోగా , కోమలి ప్రసాద్ (Komali Prasad) హీరోయిన్గా అక్టోబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం శశివదనే. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిలిమ్స్ కంపెనీ, ఎస్.వి.ఎస్ స్టూడియోస్ బ్యానర్ పై అభిలాష రెడ్డి గోడల, అహితేజ బెల్లంకొండ ఈ చిత్రాన్ని నిర్మించారు.. శ్రీపాల్ ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేసారు. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా నేడు చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఇందులో ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు.


అశ్లీలతకు తావులేదు – రక్షిత్ అట్లూరి

ప్రెస్ మీట్ లో భాగంగా హీరో రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ.. “గత మూడు సంవత్సరాల క్రితం అహితేజ ఈ కథ గురించి చెప్పాడు. అయితే డైరెక్టర్ సాయి ఈ కథ చెప్పినప్పుడు నాకు పెద్దగా నచ్చలేదు. పైగా ఏం చెబుతున్నాడో కూడా అర్థం కాలేదు. అయితే ఆయన చెప్పిన సన్నివేశాలు నచ్చాయి. ఆయన తీసిన షార్ట్ ఫిలిమ్స్ కూడా నేను చూశాను. ఆయన రాసుకున్నట్టుగా తండ్రీ కొడుకుల మధ్య ఎమోషనల్ సీన్స్ ఇంతవరకు తెలుగులో రాలేదు. పైగా శ్రీమాన్ చేసిన పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది. సినిమా చాలా బాగా వచ్చింది. గోదావరి జిల్లాలను అద్భుతంగా చూపించిన సాయి పనితనం గురించి అందరూ ఇకపై చెప్పుకుంటారు. అశ్లీలతకు తావు లేకుండా ఈ చిత్రాన్ని రూపొందించాము. ఖచ్చితంగా ఏ ఒక్కరిని నిరాశపరచదు. ఆనందంతో బయటకి వస్తారు” అంటూ తెలిపారు.


క్లైమాక్స్ సీక్రెట్ మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తుంది – కోమలి ప్రసాద్

హీరోయిన్ కోమలి ప్రసాద్ మాట్లాడుతూ.. “ఈ చిత్రం నాకు చాలా ప్రత్యేకమైనది. క్లైమాక్స్ చాలా కొత్తగా ఉంటుంది. థియేటర్లలో ఈ క్లైమాక్స్ ట్విస్ట్ కోసం కచ్చితంగా సినిమా చూడాల్సిందే. ఇందులో చాలామంది కొత్తవారు. పైగా ప్రాణం పెట్టి పనిచేశారు. సినిమా మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తుంది” అంటూ తెలిపింది.

విజువల్స్ అద్భుతంగా వచ్చాయి – సాయి మోహన్

డైరెక్టర్ సాయి మోహన్ మాట్లాడుతూ.. “మా నాన్న నేను ఇండస్ట్రీలోకి రావాలని ఎప్పుడూ కోరుకునేవారు.నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన తేజ , గౌరీ లకు ధన్యవాదాలు. శశివదనే సినిమాకు మంచి విజువల్స్ ఇచ్చి, నేను రాసుకున్న కథను అందమైన పెయింటింగ్ ల మార్చాడు.అందుకు సాయికుమార్ కి ధన్యవాదాలు చెబుతున్నాను. అలాగే శర్వా , అనుదీప్ మంచి మ్యూజిక్ తో పాటు ఆర్ఆర్ కూడా ఇచ్చారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సంతోషంతో బయటకు వస్తారు” అంటూ తెలిపారు.

సినిమా ఏ ఒక్కరిని నిరాశపరచదు – అహితేజ

నిర్మాత అహితేజ మాట్లాడుతూ.. “ఈ చిత్రం కోసం మేమెంతో కష్టపడ్డాము. ఆడియన్స్ కి మంచి అనుభూతిని ఇవ్వాలనే లక్ష్యంతోనే అడుగులు వేసాము. ముఖ్యంగా మీడియా మాకు ముందు నుంచి మంచి సపోర్ట్ ఇచ్చింది. ఏ ఒక్కరిని కూడా ఈ సినిమా నిరాశపరచదు. నాకంతగా అనుభవం లేకపోయినా కంటెంట్ మీద మాకు అపారమైన నమ్మకం ఉంది. నన్ను నమ్మిన డిస్ట్రిబ్యూటర్లకు ధన్యవాదాలు. కచ్చితంగా సక్సెస్ అందుకుంటుంది” అంటూ తెలిపారు.

రక్షిత్ శెట్టి డెడికేషన్ చూసి ఆశ్చర్యపోయాను – సాయికుమార్

కెమెరామెన్ సాయికుమార్ మాట్లాడుతూ.. “గత నెల నేను పనిచేసిన బ్యూటీ సినిమా వచ్చింది. కానీ టెక్నికల్ గా నాకు ఇదే మొదటి సినిమా. ఇందులో రాసినట్టుగా ఈ చిత్రం కోసం మేమంతా ఒక యుద్ధం చేసాము. రక్షిత్ మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు . గాయాలైన కూడా షూటింగ్ కంటిన్యూ చేశారు. శశివదనే విజువల్స్ చూసిన తర్వాతనే నాకు అందరూ అవకాశం ఇస్తున్నారు” అని తెలిపారు.

తప్పకుండా మంచి పేరు తీసుకొస్తుంది – శ్రీ పాల్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీ పాల్ మాట్లాడుతూ.. “శశివదనే చిత్ర బృందం చాలా కష్టపడి చిత్రాన్ని నిర్మించింది. గౌరీ, అహీతేజ ఎంతో ఫ్యాషనేట్ గా ఈ సినిమాను నిర్మించారు. ట్రైలర్ అందరికీ రీచ్ అయింది.అటు దర్శకుడు ఇటు హీరో, హీరోయిన్, టీం ఇలా ప్రతి ఒక్కరికి ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలి” అంటూ తెలిపారు.

ఆడియన్స్ నుంచి సపోర్ట్ కావాలి – నటి అంబిక

ప్రముఖ నటి అంబికా మాట్లాడుతూ..” మా కష్టానికి తగిన ప్రతిఫలం అక్టోబర్ 10 వస్తుందని ఆశిస్తున్నాను. మా అందరికీ ఆడియన్స్ నుంచి సపోర్టు లభించాలి” అంటూ ఆమె తెలిపారు.

నటీనటులు :

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్, శ్రీమాన్, దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ తదితరులు

సాంకేతిక బృందం

బ్యానర్ : ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్‌వీఎస్ స్టూడియోస్, సమర్పణ :గౌరీ నాయుడు, నిర్మాతలు :అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోదాల, దర్శకుడు :సాయి మోహన్ ఉబ్బన, సంగీత దర్శకుడు : శరవణ వాసుదేవన్, నేపథ్య సంగీతం :అనుదీప్ దేవ్, కెమెరామెన్ :శ్రీ సాయి కుమార్ దారా, ఎడిటర్ : గ్యారీ బీహెచ్, కాస్ట్యూమ్ డిజైనర్ :గౌరీ నాయుడు, పీఆర్వో : నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), మార్కెటింగ్ : విష్ణు తేజ పుట్టా (క్రాస్ క్లిక్ మార్కెటింగ్)

ALSO READ:Zubeen Garg: ప్రమాదం కాదు.. విషమిచ్చి చంపారు… సింగర్ కేసులో బిగ్ ట్విస్ట్?

Related News

OG Movie: యూట్యూబ్‌లోకి వచ్చేసిన ‘ఓజి’ కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ సాంగ్.. ఎంజాయ్ పండుగో!

Sandhya Shantaram: ప్రముఖ నటి కన్నుమూత, బాలీవుడ్ లో అలుముకున్న విషాదఛాయలు

Kalki 2: నాగ్ అశ్విన్ మూవీలో సాయి పల్లవి.. కల్కి 2లోనా? వేరే మూవీనా? ఇదిగో క్లారిటీ

Rahul Ramakrishna: ట్రోల్స్ ఎఫెక్ట్… ప్రజా సేవలోకి దిగిన రాహుల్ రామకృష్ణ

Hrithik Roshan: వార్ 2 సినిమాపై ఓపెన్ అయిన హృతిక్.. గాయంలా ఉండాల్సిన పనిలేదంటూ!

Zubeen Garg: ప్రమాదం కాదు.. విషమిచ్చి చంపారు… సింగర్ కేసులో బిగ్ ట్విస్ట్?

Srinidhi Shetty: అందరూ నన్ను లేడీ ప్రభాస్ అంటారు.. డార్లింగ్ ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే?

Big Stories

×