E-Paper
Advertisement

ఒంటి నిండా రక్తంతో అపరిచిత మహిళ… నిజమైన మొసళ్ళతో తీసిన డార్క్ హర్రర్ అడ్వెంచర్

ఒంటి నిండా రక్తంతో అపరిచిత మహిళ… నిజమైన మొసళ్ళతో తీసిన డార్క్ హర్రర్ అడ్వెంచర్
Advertisement

Survival horror thriller: ఒక చిన్న వెకేషన్ కోసం ఫ్లోరిడా బీచ్‌కు వెళ్లిన ఫ్రెండ్స్‌కు అక్కడ ఇలాంటి భయంకరమైన స్వాగతం ఎదురైతే? సరదాగా తిరగాల్సిన వాళ్లు ఓ పాడుబడిన ఇంట్లోకి వెళ్లి, మొసలి ముసుగు ధరించిన గొడ్డలి హంతకుడి చేతిలో చిక్కుకుంటే ? అతడి వెనుక మనుషులను మొసళ్లకు బలి ఇచ్చే ఓ రహస్య తెగ ఉందని తెలిస్తే ? ప్రాణాలు కాపాడుకోవడానికి చిత్తడి నేలల్లో పరుగులు తీస్తున్న వాళ్లకు బయటపడే దారి కూడా లేకపోతే ? ఇలాంటి రక్తపాతంతో కూడిన సర్వైవల్ హర్రర్ కథే ‘గేటర్ ఫేస్’ (Gator Face). సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లవర్స్ కి ఐఫీస్ట్ లాంటి ఈ సినిమాను ఎక్కడ చూడవచ్చు ? అన్నది తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే…

ఫ్లోరిడాలోని బీచ్‌లు, చిత్తడి నేలలను సందర్శించేందుకు కొంతమంది స్నేహితులు వెకేషన్‌ కు వస్తారు. మొదట్లో వారి ట్రిప్ అంతా సరదాగానే సాగుతుంది. కొత్త ప్రదేశాలను చూస్తూ, పార్టీ చేసుకుంటూ సమయం గడుపుతున్న సమయంలో వాళ్ల కంటికి ఓ పాత పాడుబడిన ఇల్లు కనిపిస్తుంది. ఎవరూ పెద్దగా పట్టించుకోని ఆ ఇంటి దగ్గరకు వెళ్లడంతో వారి వెకేషన్ ఒక్కసారిగా భయంకరమైన అనుభవంగా మారుతుంది.

Advertisement

ఆ ఇంట్లో ఓ భారీ మొసలి మాత్రమే కాదు… విచిత్రమైన మొసలి ముసుగు ధరించిన ఓ క్రూరమైన హంతకుడు కూడా దాగి ఉంటాడు. చేతిలో గొడ్డలితో తిరిగే అతడినే అందరూ గేటర్ ఫేస్ అని పిలుస్తారు. స్నేహితుల గుంపుపై అతను ఒక్కసారిగా దాడి చేయడంతో అక్కడి పరిస్థితి నరమేధంలా మారిపోతుంది. కొందరు అక్కడికక్కడే హత్యకు గురవుతారు. జెస్ మాత్రం ఎలాగోలా అతడి బారి నుంచి తప్పించుకుని చిత్తడి అడవుల్లోకి పరుగులు తీస్తుంది.

అయితే జెస్‌కు అక్కడ కూడా భద్రత ఉండదు. అదే ప్రాంతంలో వ్యాన్ బ్రేక్‌డౌన్ కావడంతో చిక్కుకుపోయిన మరో నలుగురు ప్రయాణికులు ఆమెకు ఎదురవుతారు. పరిస్థితి అర్థం చేసుకునేలోపే గేటర్ ఫేస్ వాళ్ల జాడ కూడా కనిపెట్టేస్తాడు. దీంతో అందరూ కలిసి పాత ఇళ్లు, బురద ప్రాంతాలు, జంక్‌యార్డ్‌లలో దాక్కుంటూ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. వేట నుంచి తప్పించుకునే క్రమంలో వాళ్లకు అసలు భయం ఏంటో అర్థమవుతుంది.

Advertisement

ఈ ప్రాంతంలో సాధారణ మనుషులు కాకుండా ఓ వింతైన స్వాంప్ కల్ట్ ఉంటుందని తెలుస్తుంది. ఈ తెగవాళ్లు పురాతన మొసలి దేవుడిని ఆరాధిస్తుంటారు. అంతేకాదు, తమ నమ్మకాల కోసం మనుషులను బలి ఇవ్వడం కూడా వారి ఆచారంలో భాగమై ఉంటుంది. గేటర్ ఫేస్ ఒంటరిగా పనిచేసే సీరియల్ కిల్లర్ కాదని వారికి తెలుస్తుంది. ఆ తెగ కోసం మనుషులను వేటాడి పట్టుకోవడమే అతని పని. అతని చేతికి చిక్కిన వాళ్లను స్వాంప్ కల్ట్ సభ్యులు మొసళ్లకు బలిగా ఉపయోగిస్తుంటారు.

దీంతో జెస్, మిగిలిన ప్రయాణికుల పోరాటం కేవలం ఓ హంతకుడి నుంచి తప్పించుకోవడంగా కాకుండా, ఓ భయంకరమైన కల్ట్ నుంచి బయటపడే సర్వైవల్ మిషన్‌గా మారుతుంది. వాళ్ళు గేటర్ ఫేస్‌ను ఎలా తప్పించుకున్నారు ? మనుషులను బలిచ్చే ఆ తెగ నుంచి జెస్, ఆమెతో ఉన్నవాళ్లు ఎలా బయట పడ్డారు ? అక్కడ తిరుగుతున్న మృత్యువులాంటి మొసళ్లను ఎదుర్కొని ప్రాణాలతో బయట పడగలిగారా ? అనేదే సినిమా అసలు ఉత్కంఠ.

తెలుగులో ఉందా ?

‘గేటర్ ఫేస్’అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో రెంట్ విధానంలో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఇంగ్లీష్ ఆడియోతోనే చూడాల్సి ఉంటుంది. తెలుగు డబ్బింగ్ అందుబాటులో లేదు. హై-వోల్టేజ్ హర్రర్, స్లాషర్ సినిమాలతో పాటు స్వాంప్ సర్వైవల్, క్రూరమైన విలన్ కాన్సెప్ట్ సినిమాల కోసం ఓటీటీలో వెతుకుతున్న వాళ్లు ఈ మూవీని ఒకసారి ట్రై చేయొచ్చు.

Read Also: రాక్షస శక్తుల వలలోపడి రాజ్యాన్ని సర్వనాశనం చేసే చక్రవర్తి… దేవతల ఎంట్రీతో దిమ్మతిరిగే ట్విస్ట్…

Related News

అర్ధరాత్రి లాంగ్ డ్రైవ్‌… రాంగ్ టర్న్ తో డైరెక్ట్ గా నరకంలోకి… బోన్ చిల్లింగ్ ట్విస్టులు

నైట్ క్లబ్ లో డ్రీం గర్ల్… కట్ చేస్తే కిరాక్ ట్విస్ట్… మనసుకు హత్తుకునే లవ్ స్టోరీ

హఠాత్తుగా ఆకాశంలో హోల్… టైమ్ ట్రావెల్ తో థ్రిల్లింగ్ సై-ఫై అడ్వెంచర్

విశ్వంభర ఓటీటీ డీల్ పై సందిగ్ధత.. తెరపైకి కొత్త విడుదల తేదీ!

స్కూల్ పిల్లాడి దారుణ హత్య… ప్రాణం పణంగా పెట్టి నిజం తేల్చే తండ్రి… ఊపిరి బిగబట్టించే సైకలాజికల్ మిస్టరీ

పగ, ప్రతీకారంతో క్రిటిక్ ప్రాణాంతక కుట్రలు… ఈ డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ ను డోంట్ మిస్

​ఏలియన్స్ దాడి నుండి భూమిని కాపాడే ఏజెంట్లు… మైండ్ బ్లోయింగ్ సై-ఫై హై-టెక్ యాక్షన్ అడ్వెంచర్

Big Stories

Advertisement
×