E-Paper
Advertisement

అర్ధరాత్రి లాంగ్ డ్రైవ్‌… రాంగ్ టర్న్ తో డైరెక్ట్ గా నరకంలోకి… బోన్ చిల్లింగ్ ట్విస్టులు

అర్ధరాత్రి లాంగ్ డ్రైవ్‌… రాంగ్ టర్న్ తో డైరెక్ట్ గా నరకంలోకి… బోన్ చిల్లింగ్ ట్విస్టులు
Advertisement

Psychological Horror Thriller: ఒక రాత్రి సరదాగా కారులో బయటకు వెళ్లిన నలుగురు ఫ్రెండ్స్‌కు… తాము ప్రయాణిస్తున్న రోడ్డు ఎప్పటికీ ముగియదని తెలిస్తే ? వెనక్కి వెళ్లే దారి కనిపించదు. ముందుకు వెళ్తే అదే రోడ్డు తిరిగి తిరిగి కనిపిస్తుంది. చుట్టూ అడవి, తెలియని శబ్దాలు, భయంతో పరుగులు తీస్తున్న మనుషులు… కానీ విచిత్రంగా కారులో పెట్రోల్ మాత్రం ఎప్పటికీ అయిపోదు. ఆకలి, దాహం కూడా ఉండవు. అసలు వాళ్లు ఏ ప్రపంచంలో చిక్కుకున్నారు ? ఈ అనంతమైన ప్రయాణం ఎక్కడికి తీసుకెళ్తుంది ? ఇలాంటి అంశాలతో తెరకెక్కిన సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్ ‘ఇట్ ఎండ్స్’ (It Ends). మరి ఈ మూవీని తెలుగులో చూడొచ్చా ? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే…

కాలేజీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న జేమ్స్, డే, ఫిషర్, టైలర్ నలుగురూ మంచి స్నేహితులు. జేమ్స్ కొత్త అపార్ట్‌మెంట్‌కు షిఫ్ట్ అవుతుండటంతో మిగిలిన ముగ్గురు అతనికి సహాయం చేస్తుంటారు. పనులన్నీ పూర్తయ్యాక రాత్రి సమయంలో కలిసి బయటకు వెళ్లి ఏదైనా తినాలని నిర్ణయించుకుంటారు. సాధారణంగా మొదలైన ఆ చిన్న ప్రయాణమే వారి జీవితాలను మార్చేస్తుంది. కారులో వెళ్తుండగా తాము ఓ మలుపు మిస్ అయ్యామని గుర్తిస్తారు. తిరిగి అదే దారిలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తారు.

Advertisement

కానీ వెనక్కి వెళ్లాల్సిన రహదారి ఒక్కసారిగా దట్టమైన చెట్లతో మూసుకుపోయి ఉంటుంది. ఏం జరిగిందో అర్థం కాక ముందుకు వెళ్లాల్సి వస్తుంది. అదే సమయంలో అడవి వైపు నుంచి కొంతమంది వ్యక్తులు భయంతో అరుస్తూ పరుగెత్తుకుంటూ వచ్చి వారి కారులోకి ఎక్కేందుకు ప్రయత్నిస్తారు. పరిస్థితి మరింత భయంకరంగా అనిపించడంతో నలుగురూ అక్కడి నుంచి కారును వేగంగా నడుపుతారు. కానీ కొంత దూరం వెళ్లిన తర్వాత అసలు సమస్య అర్థమవుతుంది. వాళ్లు ఎంత దూరం ప్రయాణించినా ఆ రెండు లేన్ల రోడ్డు మాత్రం ముగియదు. మళ్లీ అదే రోడ్డు.. అదే చెట్లు.. అదే వాతావరణం.

మొదట ఇది తమకు కనిపిస్తున్న భ్రమ అనుకుంటారు. కానీ గంటలు, రోజులు గడిచినా పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండదు. ఇక్కడే మరో విచిత్రమైన విషయం బయటపడుతుంది. కారు ఎంత దూరం వెళ్లినా ఇంధనం తగ్గదు. ఎవరికీ ఆకలి వేయదు. దాహం కూడా ఉండదు. అంటే శరీరానికి అవసరమైన సహజమైన విషయాలే అక్కడ పని చేయడం లేదు. వాళ్లు బతికే ఉన్నారా ? లేక మరో రియాలిటీ వరల్డ్ లోకి వెళ్లిపోయారా ? అనే అనుమానం మొదలవుతుంది. సమయం గడుస్తున్నకొద్దీ నలుగురి మధ్య ఒత్తిడి పెరుగుతుంది. బయటకు వెళ్లే మార్గం కనిపించకపోవడంతో ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం మొదలవుతుంది.

Advertisement

కాలేజీ తర్వాత తమ జీవితాల్లో చేయాల్సిన పనులు, భవిష్యత్తుపై ఉన్న ఆశలు అన్నీ ఒక్కసారిగా అర్థం లేనివిగా అనిపిస్తాయి. ఒకే కారులో బందీలుగా మారిన పరిస్థితి వారి స్నేహాన్ని కూడా పరీక్షిస్తుంది. రోడ్డుపై వినిపించే వింత శబ్దాలు, అడవిలో కనిపించే భయంకరమైన సంకేతాలు వారి మానసిక స్థితిని మరింత దెబ్బతీస్తాయి. బయట ఏదో అతీంద్రియ శక్తి ఉందా ? లేక వాళ్లే తమ భయాలకు బందీలయ్యారా ? అసలు ఈ అనంతమైన రహదారి ఏంటి ? దాని నుంచి బయట పడటానికి ఏదైనా మార్గం ఉందా ? నలుగురిలో చివరకు ఎవరు ప్రాణాలతో మిగిలారు ? ఆ రోడ్డు వాళ్లను ఎప్పటికీ తనలోనే బంధించిందా ? అనేదే ‘ఇట్ ఎండ్స్’ (It Ends)లోని అసలు కథ.

తెలుగులో ఉందా లేదా ?

‘ఇట్ ఎండ్స్’ ప్రస్తుతం తెలుగు ఆడియోతో అందుబాటులో లేదు. ఈ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలైన నేపథ్యంలో డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లలో ఇంగ్లీష్ ఆడియోతో రెంట్/ప్రీ-ఆర్డర్ విధానంలో అందుబాటులోకి వచ్చింది. తెలుగు డబ్బింగ్ ప్రస్తుతం లేదు. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో రెంట్ విధానంలోనే చూడాలి. జీవితం గురించి ఆలోచింపజేసే, భిన్నమైన అనుభూతిని ఇచ్చే సినిమా కావాలంటే ఈ మూవీని డోంట్ మిస్.

Read Also: సమస్యలతో అల్లాడుతున్న ఐదుగురి జీవితాల్లోకి బాబా ఎంట్రీ… ఎమోషనల్ స్పిరిచువల్ డ్రామా

Related News

ఒంటి నిండా రక్తంతో అపరిచిత మహిళ… నిజమైన మొసళ్ళతో తీసిన డార్క్ హర్రర్ అడ్వెంచర్

నైట్ క్లబ్ లో డ్రీం గర్ల్… కట్ చేస్తే కిరాక్ ట్విస్ట్… మనసుకు హత్తుకునే లవ్ స్టోరీ

హఠాత్తుగా ఆకాశంలో హోల్… టైమ్ ట్రావెల్ తో థ్రిల్లింగ్ సై-ఫై అడ్వెంచర్

విశ్వంభర ఓటీటీ డీల్ పై సందిగ్ధత.. తెరపైకి కొత్త విడుదల తేదీ!

స్కూల్ పిల్లాడి దారుణ హత్య… ప్రాణం పణంగా పెట్టి నిజం తేల్చే తండ్రి… ఊపిరి బిగబట్టించే సైకలాజికల్ మిస్టరీ

పగ, ప్రతీకారంతో క్రిటిక్ ప్రాణాంతక కుట్రలు… ఈ డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ ను డోంట్ మిస్

​ఏలియన్స్ దాడి నుండి భూమిని కాపాడే ఏజెంట్లు… మైండ్ బ్లోయింగ్ సై-ఫై హై-టెక్ యాక్షన్ అడ్వెంచర్

Big Stories

Advertisement
×