intimate scenes shooting in films| సినిమాలు లేదా వెబ్ సిరీస్‌లో నటీనటులు బోల్డ్ సీన్స్ లేదా ఇంటిమేట్ సీన్స్ చేస్తుంటారు. అయితే అదంతా నిజంగానే జరుగుతుందా అనే సందేహం చాలామందికి వస్తుంది. చాలా సహజంగా కనిపించే ఈ సన్నివేశాల వెనుక కెమెరా ముందు కంటే ఎక్కువ ప్లానింగ్ ఉంటుంది. నటీనటుల సౌకర్యం, వ్యక్తిగత హద్దులు, సన్నివేశం అవసరాలు ముందుగానే చర్చిస్తారు. ఈ సీన్లు షూట్ చేసేందుకు ఒక ప్రత్యేక నిపుణులు ఉంటారు. వారినే ఇంటిమసీ కోఆర్డినేటర్. హిందీ సినిమాల్లో ఇంటిమసీ కోఆర్డినేటర్‌గా పనిచేసే ఆస్తా
ఈ ప్రక్రియ గురించి పలు విషయాలను వెల్లడించారు.
దర్శకుడు ‘యాక్షన్’ చెప్పడానికి ముందే ఇంటిమేట్ సీన్‌కు సంబంధించిన సన్నాహాలు మొదలవుతాయి. ఇంటిమసీ కోఆర్డినేటర్ ముందుగా నటీనటులతో సన్నివేశం గురించి మాట్లాడతారు. దర్శకుడి ఆలోచన, సన్నివేశం అవసరం, నటీనటుల సౌకర్యం వంటి అంశాలను తెలుసుకుంటారు. తర్వాత సన్నివేశంలోని కదలికలు, స్థానాలు, బ్లాకింగ్, కొరియోగ్రఫీని నిర్ణయిస్తారు.
తెరపై సహజంగా కనిపించే ఇంటిమేట్ సీన్లు కూడా చాలా ముందుగానే ప్లాన్ చేస్తారు. ఎవరు ఎక్కడ నిలబడాలి, ఏ కదలిక తర్వాత ఏం జరగాలి అనేది నిర్ణయిస్తారు. ఫిజికల్ కాంటాక్ట్‌కు సంబంధించిన విషయాలను కూడా ముందే చర్చిస్తారు. దీంతో షూటింగ్ సమయంలో నటీనటులకు క్లిష్టమైన, అనుకోని పరిస్థితులు ఎదురుకావు.
బెడ్‌షీట్‌లో షూట్ చేసే సీన్ల గురించి ప్రేక్షకుల్లో ఎన్నో సందేహాలు ఉంటాయి. తెరపై కనిపించే దృశ్యం, కెమెరా వెనుక జరిగేది ఒకేలా ఉండాల్సిన అవసరం లేదు. నటీనటుల ప్రైవసీ కోసం మోడెస్టీ గార్మెంట్స్, బ్యారియర్స్ ఉపయోగిస్తారు. కెమెరా యాంగిల్స్, లైటింగ్, ఫ్రేమింగ్, దుస్తులు కూడా సన్నివేశాన్ని నిజరూపం ఇచ్చేలా మార్చి చూపించగలవు.
ఇంటిమేట్ సీన్ షూటింగ్ సమయంలో అవసరం లేని సిబ్బందిని సెట్లో ఉంచకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇలాంటి విధానం నటీనటులకు మరింత ప్రైవసీ, భద్రత కల్పిస్తుంది. ఏదైనా అంశంపై అసౌకర్యంగా అనిపిస్తే నటీనటులు ఇంటిమసీ కోఆర్డినేటర్‌తో తమ సమస్యల గురించి చర్చిస్తారు. అందుకే ‘యాక్షన్’తో పాటు నటీనటుల ‘కంఫర్ట్’ కూడా ముఖ్యంగా మారింది.
ఇంటిమేట్ సీన్లకు వర్క్‌షాప్స్, రిహార్సల్స్ నిర్వహిస్తారు. కో ఆర్డినేటర్ ఆస్తా ప్రకారం.. కొత్త నటీనటులకు ముందుగా బ్లాకింగ్, వర్క్‌షాప్, కొరియోగ్రఫీ గురించి వివరిస్తారు. కో యాక్టర్‌తో సన్నివేశాన్ని ముందుగానే ప్రాక్టీస్ చేయడం వల్ల భయం తగ్గుతుంది.తర్వాత షూటింగ్ సమయంలో నటీనటులు తమ నటనపై మరింత దృష్టి పెట్టగలరు. దీని వల్ల వారి ఎక్స్‌ప్రెషన్స్ వారు చేసేది నటన కాదు నిజమని నమ్మింపజేసేలా ఉంటాయి.
ఇంటిమసీ కోఆర్డినేటర్ కేవలం నటీనటులకు మాత్రమే సహాయం చేయరు. దర్శకుడి క్రియేటివ్ ఐడియాలను గౌరవిస్తూ నటీనటుల హద్దులను కూడా కాపాడుతారు. ఆస్తా ఈ బాధ్యతను స్టంట్ కోఆర్డినేటర్ పనితో పోల్చారు. సినిమాల్లో ఫైటింగ్, దూకడం లాంటి స్టంట్స్ అన్నీ.. స్టంట్ కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో సురక్షితంగా జరిగినట్లే, ఇంటిమసీ కోఆర్డినేటర్ నటీ నటుల హద్దులు, సౌకర్యాన్ని చూసుకుంటారు.
Also Read: ఒకేసారి ఇద్దరిని ప్రేమించడం కరెక్టేనా? కొత్త డేటింగ్ ట్రెండ్..
ఇంటిమసీ కోఆర్డినేటర్ బాధ్యతలు ఒక సన్నివేశాన్ని షూట్ చేయించడంతో ముగియవు. సన్నివేశాన్ని అర్థం చేసుకోవడం, హద్దులు నిర్ణయించడం, కొరియోగ్రఫీ, వర్క్‌షాప్, రిహార్సల్ వంటి పనులు కూడా ఇందులో ఉంటాయి. తెరపై కొన్ని నిమిషాలు కనిపించే సన్నివేశం వెనుక చాలా ప్లానింగ్ ఉంటుంది. ఈ విధానం వల్ల ఇంటిమేట్ సీన్ల షూటింగ్ మరింత క్రమబద్ధంగా మారుతోంది. చివరగా తెరపై కనిపించే బోల్డ్ సీన్లు పూర్తిగా నిజం కావు కానీ సన్నివేశాన్ని బట్టి కొంత వరకు ప్రాక్టికల్‌గా ఉంటాయి.
Also Read: డేటింగ్‌కు వెళ్లినప్పుడు బిల్లు ఎవరు చెల్లించాలి? 2026లో కొత్త ట్రెండ్ గురూ