E-Paper
Advertisement

రష్మికకు ఏమైంది.. ఒంటినిండా కత్తిపోటు గాట్లతో?

రష్మికకు ఏమైంది.. ఒంటినిండా కత్తిపోటు గాట్లతో?
Advertisement

Rashmika:టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్న.. అందం, అభినయంతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది. పేరుకే కన్నడ బ్యూటీ అయినా తెలుగులో భారీ ప్రాజెక్టులలో అవకాశం దక్కించుకొని తన నటన విశ్వరూపాన్ని చూపించింది. కేవలం మూడేళ్లలోనే 4వేల కోట్లకు పైగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీస్ క్వీన్ గా గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే దాదాపు 8 ఏళ్ల ప్రేమాయణం తర్వాత తన ప్రియుడు, ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ తో ఈ ఏడాది హిందూ, కొడగు సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక వివాహం అనంతరం మళ్లీ తన సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్న రష్మిక సడన్గా ఒంటినిండా గాయాలతో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది

ఒంటినిండా గాయాలతో రష్మిక..

ఇకపోతే వరుస సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్న రష్మికకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టీ షర్టు, డెనిమ్ ప్యాంటు ధరించి, పోనీటైల్ వేసుకున్న రష్మిక.. నీటిలో నిల్చొని అటు తిరిగి ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. అందులో ఆమె వీపు వెనుక భాగంలో కత్తిపోటు గాయాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు రష్మికకు ఏమైంది? ఒంటినిండా ఆ రక్తపోటు గాట్లు ఏంటి ?అంటూ కంగారుపడుతున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

Advertisement

ALSO READ:Driving Schools: కొత్తగా కారు డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా.. మీకో షాకింగ్ న్యూస్!

అసలేమైందంటే?

అసలు విషయంలోకి వెళ్తే ..ఈ పిక్చర్ రష్మిక నటిస్తున్న మైసా సినిమా నుండి వెలువడింది. అసలు విషయంలోకి వెళ్తే గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ఆస్కారం ఉన్న ఛాలెంజింగ్ రోల్స్ ను ఎంచుకుంటూ దూసుకుపోతున్న రష్మిక మందన్న తాజాగా నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ యాక్షన్ థ్రిల్లర్ మైసా.. యువ దర్శకుడు రావీంద్ర పుల్లె ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమాలోని అత్యంత కీలకమైన , సాహసోపేతమైన అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణను చిత్ర బృందం విజయవంతంగా పూర్తి చేసింది. ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకి హైలెట్గా నిలవనుంది అని సమాచారం.

Advertisement

ALSO READ:అదే ఐస్‌లాండ్‌ రహస్యం.. ప్రపంచంలో ప్రశాంతమైన దేశం, 19 ఏళ్లుగా నెంబర్ వన్

యాక్షన్ సీక్వెన్స్ కంప్లీట్..

ఈ మేరకు చిత్ర బృందం ఒక అఫీషియల్ పోస్ట్ విడుదల చేస్తూ..” యాక్షన్ సినిమాలలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. నిర్భయ నటిగా రష్మిక మందన్న నటించిన భారత దేశపు మొదటి మహిళా అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్ ను మైసా టీం విజయవంతంగా పూర్తి చేసింది. భారతీయ సినిమా రంగంలో ప్రకంపనలు సృష్టించనున్న ఈ అద్భుతమైన యాక్షన్ వినోదాన్ని వీక్షించడానికి సిద్ధంగా ఉండండి. త్వరలోనే టీజర్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ విడుదల చేస్తాము. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది అంటూ మేకర్స్ ప్రకటించారు.

రష్మికపై ఒక అద్భుతమైన పాట కూడా..

ఇకపోతే ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్ గురించి నిర్మాత అజయ్ సాయిరెడ్డి కూడా తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.. రష్మిక మందన్న తో అద్భుతమైన , ఉత్కంఠ భరితమైన అండర్ వాటర్ సీక్వెన్స్ షూటింగు పూర్తయింది. ఇది కేవలం యాక్షన్ మాత్రమే కాదు 10 రోజుల క్రితమే ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ నేతృత్వంలో రష్మికపై ఒక అద్భుతమైన పాటను కూడా చిత్రీకరించారు అంటూ స్పష్టం చేశారు.

Related News

రామ్ చరణ్ ‘పెద్ది’ ఓటీటీ రిలీజ్.. థియేటర్ల కంటే డిజిటల్ వెర్షన్‌లోనే అసలైన ట్విస్ట్!

లెనిన్ మూవీ హిట్ కొట్టాలంటే ఎన్ని కోట్లు రాబట్టాలో తెలుసా?

థియేటర్లలోకి వచ్చేస్తున్న జననాయగన్ ….ఎప్పుడో తెలుసా ?

జగపతిబాబు సైకలాజికల్ థ్రిల్లర్ వదలా నుండి ట్రైలర్ రిలీజ్!

వెండితెరపై బికినీతో సంచలనం.. చివరికి ఎయిడ్స్‌తో దర్గా బయట అనాథగా..

లెనిన్ సెన్సార్ రిపోర్ట్…తెల్లవారుజామున 5 గంటలకే థియేటర్లలో అయ్యగారి జాతర!

ఆ బ్లాక్ బాస్టర్ సినిమాలో నా సీన్స్ కాపీ కొట్టారంటున్నయంగ్ డైరెక్టర్ !

Big Stories

Advertisement
×