E-Paper
Advertisement

జగపతిబాబు సైకలాజికల్ థ్రిల్లర్ వదలా నుండి ట్రైలర్ రిలీజ్!

జగపతిబాబు సైకలాజికల్ థ్రిల్లర్ వదలా నుండి ట్రైలర్ రిలీజ్!
Advertisement

Vadala Movie: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు మోస్ట్ హ్యాండ్సమ్ హీరోగా, ఫ్యామిలీ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. జగపతిబాబు విలన్ గానే తన కెరీర్ ను మొదలుపెట్టి, ఆ తర్వాత ఫ్యామిలీ హీరోగా మారి తన కామెడీతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత యూటర్న్ తీసుకొని లెజెండ్ సినిమాలో అద్భుతమైన విలనిజం కనబరిచిన ఈయన.. రంగస్థలం సినిమాలో అంతకుమించి ఆకట్టుకున్నారు. ఇక ఈ మధ్యకాలంలో ఎక్కువగా విలన్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించిన జగపతిబాబు.. మళ్ళీ తన రూటు మార్చి ప్రధాన పాత్రల్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అందులో బాగానే తాజా జగపతిబాబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ వదలా.. ఒకప్పుడు జగపతిబాబు సరసన నటించి, తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న లయ ఈయనతో మరోసారి జతకట్టింది.

జగపతిబాబు వదలా మూవీ నుండి ట్రైలర్ రిలీజ్..

దర్శకుడు అకెళ్ళ వి కృష్ణ దర్శకత్వంలో ఈనెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్లను వేగవంతం చేసింది. అందులో భాగంగానే ఈ సినిమా నుండి ట్రైలర్ విడుదల చేయగా.. ఈ ట్రైలర్ ఒక్కసారిగా సినిమాపై ఊహించని అంచనాలు పెంచేసింది. హృతిక శ్రీనివాస్ అత్యంత కీలక పాత్రలో కనిపించనుంది. కిషోర్ నాయుడు చిరుమామిళ్ల, తమ్మారెడ్డి భరద్వాజ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. 20 సంవత్సరాల పచ్చని సంసారంలోకి ఒక సైకో అడుగు పెడితే.. ఆ కాపురం ఏమైంది? అనే ప్రధాన అంశంతో ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

ట్రైలర్ లో ఏముందంటే?

Advertisement

ట్రైలర్ లో ఏముంది? అనే విషయానికి వస్తే.. ఒక సాధారణ కుటుంబ కథలా ఈ సినిమా ప్రారంభమవుతుంది. 20 సంవత్సరాలుగా సంతోషకరమైన దాంపత్య జీవితాన్ని గడుపుతున్న దంపతులుగా లయ, జగపతిబాబు కనిపిస్తారు. ఒకరిపై ఒకరికి అపారమైన ప్రేమ, ఆప్యాయతతో జీవిస్తున్న వారి జీవితంలోకి అనుకోకుండా ఒక యువతి ప్రవేశించడం.. కథను పూర్తిగా మలుపు తిప్పుతుంది. పక్కింటికి వచ్చిన అమ్మాయి జగపతిబాబు పాత్ర పై ప్రమాదకరమైన స్థాయిలో ఇష్టం పెంచుకోవడం, క్రమంగా అది వ్యామోహం గా మారడం ట్రైలర్లో చాలా ఆసక్తికరంగా చూపించారు. అదే సమయంలో లయ పాత్రకు గుర్తు తెలియని వ్యక్తులను రావడం బెదిరింపులు రావడం.. కుటుంబంపై ముప్పు పెరగడం, కథలోని సస్పెన్షన్ మరింత పెంచుతోంది. కుటుంబాన్ని కాపాడుకోవడానికి పోరాటే వ్యక్తిగా జగపతిబాబు ఈ చిత్రంలో కనిపిస్తున్నారు.

ALSO READ:అఖిల్ లెనిన్ మూవీకి సెన్సార్ షాక్.. నిర్మాతలు ఏం చేస్తున్నారంటే?

సైకోథ్రిల్లర్ ప్రేక్షకులను మెప్పిస్తుందా?

Advertisement

కుటుంబ బాధ్యతలు , అనుకోని ప్రమాదంలో చిక్కుకున్న వ్యక్తి పాత్రలో ఆయన నటన ట్రైలర్ లోనే పీక్స్ కి వెళ్ళిపోయింది. మరొకవైపు లయ సహజమైన నటనతో కుటుంబ భావోద్వేగాలను బలంగా ఆవిష్కరించింది. అలాగే హృతిక రోషన్ పోషించిన పాత్ర ట్రైలర్ కే ప్రధాన ఆకర్షణగానే నిలిచింది. దర్శకుడు కృష్ణ మరొకసారి థ్రిల్లర్ జానర్ పై తన పట్టు చూపించినట్లు మనకు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. మొత్తానికైతే ఎక్కడా సస్పెన్స్ తగ్గకుండా.. అదే సమయంలో కుటుంబ భావోద్వేగాలను సమతుల్యంగా చూపించే ప్రయత్నం చేసినట్లు స్పష్టమవుతోంది. మొత్తానికైతే జగపతిబాబు ఇష్టం పెంచుకున్న ఆమె ఎవరు ? అసలు ఆమె ఉద్దేశం ఏమిటి? జగపతిబాబు జీవితంలోకి ఆమె ఎందుకు వచ్చింది? ఈ సంఘటనల వెనుక అసలు ఏం జరిగింది? అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే . ఇక ఈ చిత్రానికి కార్తీక్ కోడకండ్ల మ్యూజిక్ అందించారు. మరి ఈ సైకోథ్రిల్లర్ ప్రేక్షకులను మెప్పిస్తుందా అనే విషయం తెలియాలంటే సినిమా రిజల్ట్ వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.

 

Related News

రష్మికకు ఏమైంది.. ఒంటినిండా కత్తిపోటు గాట్లతో?

థియేటర్లలోకి వచ్చేస్తున్న జననాయగన్ ….ఎప్పుడో తెలుసా ?

వెండితెరపై బికినీతో సంచలనం.. చివరికి ఎయిడ్స్‌తో దర్గా బయట అనాథగా..

లెనిన్ సెన్సార్ రిపోర్ట్…తెల్లవారుజామున 5 గంటలకే థియేటర్లలో అయ్యగారి జాతర!

ఆ బ్లాక్ బాస్టర్ సినిమాలో నా సీన్స్ కాపీ కొట్టారంటున్నయంగ్ డైరెక్టర్ !

హాట్ పిక్స్ కావాలా? …ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్‌పై పాయల్ రాజ్‌పుత్ స్ట్రాంగ్ కౌంటర్!

Lenin Movie : ‘లెనిన్’ మూవీకి బిగ్ షాక్.. అక్కడ ఆపేయ్యాలని డిమాండ్.. అసలు ఏం జరుగుతుంది..?

Big Stories

Advertisement
×