Akhil Lenin: అయ్యగారి సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానుల వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ పడే రోజు రానే వచ్చింది.అవును..అఖిల్’, ‘హలో’, ‘మిస్టర్ మజ్ను , మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ఏజెంట్ ఇలా ఇప్పటి దాకా చేసిన సినిమాలని ఒక లెక్క, ఇప్పుడు చేసిన లెనిన్ ఒక లెక్క అంటూ ఎట్టకేలకి థియేటర్లలోకి ఎంట్రీ ఇచ్చేస్తుంది.ఇక ఒక్కరోజులో అంటే జులై10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న ఈ సినిమాకి ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ ‘U/A’ సర్టిఫికెట్ ఇచ్చేసింది సెన్సార్ బోర్డ్.
ఇక 2 గంటల 38 నిమిషాల 33 సెకన్ల నిడివి ఉన్న ఈ సినిమాకి సెన్సార్ రూమ్ నుండి వస్తున్న ఇన్నర్ టాక్ మాత్రం అక్కినేని ఫ్యాన్స్ కి మాంచి గూస్ బంప్స్ తెప్పిస్తుంది.ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న సాలిడ్ బ్లాక్ బస్టర్ ని లెనిన్ ఇచ్చి తీరుతుంది అంటూ కాలర్ ఎగరేస్తున్నారు.
అయ్యగారి విశ్వ రూపం చూపిస్తాడా ?
అయితే ఇప్పటి ట్రెండ్ తో పోలిస్తే కాసింత ఎక్కువగానే రన్ టైం ఉన్నప్పటికీ డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బురు ఎక్కడా ల్యాగ్ లేకుండా సీన్స్ ఫ్లో ని చాలా పర్ఫెక్ట్ గా డిజైన్ చేశాడని తెలుస్తుంది.అయితే వినిపిస్తున్న టాక్ ప్రకారం రూరల్ బ్యాక్ డ్రాప్ లో లవ్లీ సీన్స్ తో చాలా సరదాగా గడిచిపోతున్న సినిమా ఇంటర్వెల్ దగ్గరకి వచ్చేసరికి ఇక మేజర్ ట్విస్ట్ వస్తుందని,అదే సినిమాని నెక్స్ట్ లెవెల్ లో కూర్చో బెడుతుందని తెలుస్తుంది.ఇక అక్కడి నుండి సినిమా చివరి వరకు అయ్యగారి విశ్వ రూపం ఏంటో ఈ సినిమాతో తెలుస్తుందని సెన్సార్ వర్గాల నుండి వినిపిస్తున్న మాట.
also read:ఆ బ్లాక్ బాస్టర్ సినిమాలో నా సీన్స్ కాపీ కొట్టారంటున్నయంగ్ డైరెక్టర్ !
ఇక సినిమాలో సెకండాఫ్ లో వచ్చే సెంటి మెంట్స్ సీన్స్ కళ్ళ వెంబడి నీళ్ళు తెప్పిస్తే, హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ మాత్రం రోమాలు నిక్కబొడిచేలా చేస్తాయని సమాచారం. ఇక ఈ సినిమాకి మరో ఎసెట్ బాగ్యశ్రీ బోర్సే అని, అఖిల్ తో భాగ్యశ్రీ కెమిస్ట్రీ నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది.ఇక వీటన్నింటికి తోడు తన కొడుకు సినిమాని నాగ్ స్వయంగా భుజాలకి ఎత్తుకోవడంతో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.
ఇక సినిమా రిలీజ్ విషయానికి వస్తే ఒక టాప్ హీరో సినిమాలాగే ఎక్కడా తగ్గకుండా భారీ స్థాయిలో థియేటర్లలో వదలబోతున్నారట. ఇక ఓవర్సీస్ లో జులై 10న తెల్లవారు జామునే 4:30 గంటలకే ప్రీమియర్స్ పడుతుండగా, తెలుగు స్టేట్స్ లో ఉదయం 5 గంటలకే అయ్యగారి జాతర మొదలు కాబోతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి టికెట్స్ రేట్స్ కూడా పెంచకుండా మామూలు రేట్లతోనే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయడం పాజిటివ్ సైన్ అని చెప్పాలి. ఇక ఇప్పటికే బుకింగ్స్ జరుగుతున్న తీరు చూస్తుంటే అఖిల్ కెరీర్ లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ లెనిన్ కొల్లగొట్టేటట్టే కనిపిస్తుంది.చూడాలి మరి కొద్ది గంటల్లోనే మొదలయ్యే లెనిన్ సినిమాకి అయ్యగారి ఆకలి తీరుస్తుందో లేదో !
also read:హాట్ పిక్స్ కావాలా? …ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్‌పై పాయల్ రాజ్‌పుత్ స్ట్రాంగ్ కౌంటర్!