E-Paper
Advertisement

పునాది వేసింది కాంగ్రెస్.. ముద్ర వేసింది బీజేపీ.. ‘తాడిచర్ల-2’ క్రెడిట్ ఎవరిది?

పునాది వేసింది కాంగ్రెస్.. ముద్ర వేసింది బీజేపీ.. ‘తాడిచర్ల-2’ క్రెడిట్ ఎవరిది?
Advertisement

Tadicherla-2 Coal Block: భూపాలపల్లి జిల్లాలోని తాడిచర్ల-2.. తెలంగాణలో ఇప్పుడు దీనిపై పొలిటికల్‌ క్రెడిట్‌ వార్‌ తెరపైకి వచ్చింది. ఇటీవల తాడిచర్ల-2ను సింగరేణికి కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్‌కు మోక్షం కల్పించామని.. సింగరేణి సిరులకు బాటలు వేసింది తామనేనని కేంద్ర బొగ్గు గనుల శాఖామంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు.

కిషన్‌ రెడ్డి కామెంట్స్‌కు కాంగ్రెస్‌ కౌంటర్‌

Advertisement

అయితే, కేటాయింపు వరకు కిషన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాగానే ఉన్నాయి.. కానీ, ఆ క్రెడిట్‌ తమదే అనడంతోనే.. మరో క్రెడిట్‌ వార్‌కు తెర లేపినట్టైంది. కిషన్‌ రెడ్డి కామెంట్స్‌కు కాంగ్రెస్‌ కౌంటర్‌ స్ట్రెయిట్‌ కౌంటర్ ఇచ్చింది. తాడి చర్ల–2 బ్లాక్‌‌‌‌ను 2013 సెప్టెంబర్ 16న అప్పటి యూపీఏ సర్కారు సింగరేణికి కేటాయించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఇక్కడ మైనింగ్​ తవ్వకాలకు మాత్రమే అనుమతి ఇచ్చిందన్నారు.

Also Read: ఎవరా టాలీవుడ్ హీరో? డీఎస్పీ భీమ్‌రెడ్డి డైరీలో దొరికిన ‘రూ.3 కోట్ల’ సీక్రెట్ డీల్!

Advertisement

13 ఏండ్లుగా మైనింగ్​ లీజులు

13 ఏండ్లుగా మైనింగ్​ లీజులు ఇవ్వకుండా కేంద్ర పెండింగ్​ పెడితే తాము రెండేండ్లు కొట్లాడి సాధించుకున్నామని చెప్పారు. కానీ, కిషన్‌‌రెడ్డి మాత్రం సింగరేణిపై దయతో తాడిచర్ల –2 బ్లాక్‌‌ను మోడీ ప్రభుత్వమే కేటాయించినట్టు చెప్పుకోవడం సర్‌ప్రైజింగ్‌గా ఉందని సెటైర్లు వేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను మీడియా ముందు చూపారు భట్టి.

తాడిచర్ల-2 ఘనతలో ఇరు పక్షాల పాత్ర

టెక్నికల్‌గా చూస్తే, ఈ బొగ్గు గనిపై హక్కు 2013లోనే సింగరేణికి దక్కిందనేది కాంగ్రెస్ వాదన. అయితే, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ పాత ఫైల్‌కు ఫైనల్‌ ఆమోద ముద్ర వేసి, వేలం లేకుండా మైనింగ్ లీజు క్లియరెన్స్ ఇచ్చింది. కాబట్టి కేటాయింపు పునాది కాంగ్రెస్‌ది కాగా.. దానిని కార్యరూపంలోకి తెచ్చిన క్రెడిట్ బీజేపీది.. దానికోసం ఒత్తిడి తెచ్చిన ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానిది అని కూడా చెప్పవచ్చు. కాబట్టి.. తాడిచర్ల-2 ఘనతలో ఇరు పక్షాల పాత్ర ఉందని అర్థం చేసుకోవాలి.

Also Read: కాళేశ్వరంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్.. ఎంపీ అరవింద్ షాకింగ్ కామెంట్స్!

Related News

ప్లానింగ్‌ లోపం.. జంతర్‌మంతర్‌ 2.0 విఫలం! ప్రచారార్బాటాలకే పరిమితమైన సీజేపీ.. కేంద్రం అలర్ట్‌గా ఉందని తెలిసినా.. తిప్పికొట్టే వ్యూహంలో ఫెయిల్‌..!

కొత్త పార్టీతో తొలి ఎన్నికను ఎదుర్కొనేందుకు రెడీ అయిన కవిత! తొలి ప్రయత్నంలోనే హేమాహేమీలతో ఢీ అంటే ఢీ..! ఏమిటా వ్యూహం..?

ఎండాకాలంలో కనిపించే ఆలయం.. ఈసారి అక్టోబర్‌లోనే దర్శనం.. దేనికి సంకేతం?

ఏపీలో స్థానిక ఎన్నికలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్.. ఆరు వారాల్లో నోటిఫికేషన్‌!

వరి రైతు నోటికాడి ధరను కొల్లగొట్టిన మిల్లర్‌ గద్దలు! ఎంఎస్‌పీ కన్నా వెయ్యి అదనంగా చెల్లిస్తున్న వ్యాపారులకు ధమ్కీ! ఎలా కొంటారని బెదిరించిన మిల్లర్ల అసోసియేషన్‌..!

రాబోయే ఎన్నికలపై.. సీఎం రేవంత్ వేసిన బిగ్ పొలిటికల్ ప్లాన్ ఇదే!

కేసీఆర్‌ ఉన్నప్పుడే గౌరమ్మా..! బతుకంతా పచ్చగ ఉండే గౌరమ్మా..! రెండు పాటలను విడుదల చేసిన బీఆరెస్‌ పార్టీ..!

చంద్రుడిపై ఐదు మెరుపులు.. ఆర్టెమిస్-2 వ్యోమగాములు గుర్తించిన వింత ఏంటి?

Big Stories

Advertisement
×