Jana Nayagan: ‘జన నాయగన్’…ఇదే నా చివరి సినిమా అని దళపతి ఏ ముహుర్తాన అనౌన్స్ చేశాడో కానీ ఎప్పుడెప్పుడు సినిమా థియేటర్లోకి వస్తుందా ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ కళ్ళల్లో వత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు విజయ్ ఫ్యాన్స్.కానీ గత కొన్ని రోజులుగా ఈ సినిమా చుట్టూ నడిచినంత డ్రామా మరే సినిమా చుట్టూ నడవలేదంటే ఆశ్చర్యం లేదు.సినిమాలో వివాస్పద సీన్స్ ఉన్నాయంటూ సెన్సార్ బోర్డ్ సెన్సార్ ఇవ్వకుండా నిరాకరించడంతో దాదాపు ఏడు నెలల పాటు ఈ సినిమా సెన్సార్ గదిలోనే మగ్గిపోయింది.
అయితే వెయిటింగ్ ఈజ్ ఎండ్ అంటూ జననాయగన్ సినిమా ఈనెల జులై 24న థియేటర్లలోకి వస్తుందంటూ కెనడాకు చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ యార్క్ సినిమాస్ చేసిన ‘ఎక్స్’ పోస్ట్ ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వాస్తవానికి ఈ సినిమా రాజసాబ్ కి పోటీగా జనవరి 9న పొంగల్ బరిలో దిగాల్సి ఉంది. కానీ అప్పటి సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకి సెన్సార్ ఇవ్వడం లో అభ్యంతరాలు తెలుపడంతో రిలీజ్ ఆగిపోయింది. దానికి తోడు సినిమా గనుక రిలీజ్ అయితే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో విజయ్ కి మరింత బలం చేకూరుతుంది కాబట్టే సినిమాని రిలీజ్ కాకుండా సెన్సార్ పేరుతో అడ్డంకులు క్రియేట్ చేస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగింది.
also read:వెండితెరపై బికినీతో సంచలనం.. చివరికి ఎయిడ్స్‌తో దర్గా బయట అనాథగా..
ఇక గతంలో విజయ్ నటించిన విజయ్ ‘సర్కార్’, ‘మెర్సల్’ సినిమాలు కూడా ఇలాంటి కాంట్రవర్సీలలోనే ఇరుక్కున్నప్పటికీ త్వరగానే రిలీజ్ అయి మంచి సక్సెస్ ని చూశాయి. అయితే జననాయగన్ మేకర్స్ సినిమా త్వరగా రిలీజ్ కావాలంటూ మద్రాస్ హై కోర్ట్ ఎక్కినప్పటికీ రిలీజ్ కి అడ్డంకులు తొలగకపోవడం తో రివైజింగ్ కమిటీ చెప్పిన కట్స్ కి ఒప్పుకోకతప్పలేదు. ఇక ఈలోపు ఏప్రిల్ నెలలో సినిమా hd ప్రింట్ ఆన్ లైన్ లో లీక్ కావడంతో దాన్నిఏకంగా కోటి మందికి పైగా చూసేశారట.
ఇక కోలీవుడ్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వచ్చిన ఈ సినిమా cbfc ప్రకారం అన్ని చేంజెస్ చేసిందని, ఈ శుక్రవారం కల్లా సెన్సార్ సర్టిఫికెట్స్ వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది .ఇక అన్ని అనుకున్నట్టుగానే జరిగితే ఓవర్సీస్ మార్కెట్ ని దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాని జులై 24న కాకుండా, ఒక రోజు ముందుగానే అంటే జులై 23న కూడా ప్రీమియర్లతో సినిమాను దించే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్.అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, కెనడా డిస్ట్రిబ్యూటర్ ఉత్సాహంగా పోస్ట్ పెట్టినప్పటికీ, చెన్నైలోని ప్రధాన నిర్మాణ సంస్థ మాత్రం ఇప్పటివరకు అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు. చూడాలి మరి సర్క్యులేట్ అవుతున్నట్టుగా జననాయగన్ జులై 24నే వస్తాడా లేక మరో తేదీ వెతుక్కుంటాడా !