E-Paper
Advertisement

వెండితెరపై బికినీతో సంచలనం.. చివరికి ఎయిడ్స్‌తో దర్గా బయట అనాథగా..

వెండితెరపై బికినీతో సంచలనం.. చివరికి ఎయిడ్స్‌తో దర్గా బయట అనాథగా..
Advertisement

Nisha Noor:సినిమా ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోయే తారలు కొన్నాళ్ల తర్వాత అసలు సోదిలో లేకుండా పోవడం, కనిపిస్తే గుర్తుపట్టలేనంతగా మారిపోవడం అడపా దడపా మనం చూస్తునే  ఉంటాం. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ముందుగానే భవిష్యత్తును అంచనా వేసుకొని జాగ్రత్తపడ్డ వారు కొందరైతే, చిన్న చిన్న పొరపాటులు చేసి అప్పటి పరిస్థితుల ప్రభావానికి గురై తమ కెరీర్ ని నాశనం చేసుకున్న వాళ్ళు మరికొందరు. ఇదిగో అలాంటి  ఒక విషాదకరమైన జీవితమే నిషా నూర్ కథ.

ఒకప్పుడు కమలహాసన్, రజనీకాంత్ వంటి సూపర్ స్టార్స్ సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన నిషా నూర్ చివరి రోజుల్లో అనాధగా ఎయిడ్స్ వ్యాధితో పోరాడుతూ అత్యంత దిన స్థితిలో కన్నుమూయడం బాధాకరం.నిషానూర్ విషయానికి వస్తే 1962 సెప్టెంబర్ 18న తమిళనాడులోని నాగపట్నం లో జన్మించిన నిషా చిన్నతనం నుంచే గ్లామర్ ఇండస్ట్రీ వైపు ఆకర్షితురాలు అయింది.హీరోయిన్ కావాలనే టార్గెట్ పెట్టుకుని ఎన్నో కలలతో చెన్అనైలో అడుగు పెట్టింది నిషా .అలా ‘మంగళ నాయకి’ అనే తమిళ సినిమాతో నటిగా కెరీర్ మొదలెట్టింది .

15 ఏళ్ల పాటు కెరియర్ లో పీక్స్

Advertisement

మొదటి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకున్న ఇండస్ట్రీలో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ముఖ్యంగా 1980లో సౌత్ ఇండస్ట్రీలో నిషా క్రేజ్ అమాంతంపెరిగిపోయింది. ముఖ్యంగా గ్లామరస్ పాత్రలకి నిషా పెట్టింది పేరు అయింది.అలా బోల్డ్  పాత్రలకు కూడా చేయడానికి వెనుకాడకుండా ఆ రోజుల్లోనే బికినీతరించి సెన్సేషన్ క్రియేట్ చేసింది.ఇక ఆమె గ్లామర్ కు, నటనకు అప్పట్లో భారీ ఫ్యాన్ బేస్ ఉండేదంటే ఆశ్చర్యం లేదు.ముఖ్యంగా సౌత్ టాప్ డైరెక్టర్స్ అంతా నిషా తో సినిమా చేయాలని అనుకునేవారంటే  ఆమెకి ఎంత  డిమాండ్ ఉండేదో అర్థం చేసుకోవచ్చు.అలా 1980 నుంచి 1995 వరకు దాదాపు 15 ఏళ్ల పాటు కెరియర్ లో పీక్స్ చూసింది నిషా.అలా తమిళం తో పాటు తెలుగు మలయాళ కన్నడ భాషలోనూ ఆమె ఎన్నో సినిమాలు నటించింది.ఇంతటి సుదీర్ఘ కెరిర్ లో ఆమె తమిళ ఇండస్ట్రీలోని టాప్ హీరోల సరసన నటించే అవకాశాన్ని కొట్టేసింది.

గ్లామర్ డాల్ గా ఇండస్ట్రీని ఏలిన  నిషా

ముఖ్యంగా కమలహాసన్ తో  నటించిన టిక్ టిక్ టిక్, అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ‘శ్రీ రాఘవేంద్ర’, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టితో ‘అయ్యర్ ద గ్రేట్’ మోహన్ లాల్ సరసన ‘దేవాసురం’ వంటి ఎన్నో సూపర్ సినిమాలో నటించి ఆడియన్స్ ని మెప్పించింది.ఇక తెలుగులో రాజేంద్రప్రసాద్ తో ‘ఇనిమై ఇదో ఇదో’, అలాగే భానుచందర్ వంటి హీరోలతో కూడా కలిసి నటించింది.అలా కేవలం స్టార్ హీరోలతోనే కాకుండా కే బాలచందర్, భారతి రాజా, విసు, చంద్రశేఖర్ వంటి దిగ్గజ దర్శకులతో కలిసి పనిచేయడం విశేషం.అయితే ఇక అలా గ్లామర్ డాల్ గా ఇండస్ట్రీని ఒక ఏలిన  నిషా  కెరీర్ లో  మంత దూసుకెళ్తుందని అనుకున్నారంతా.

Advertisement

also read:స్టార్ విలన్ నిజ జీవితంలో ఇంత ఘోరమా.. 5 పెళ్లిళ్లు, 300 సినిమాలు, చివరకు కుళ్ళిన శవమై!

కాలం ఎప్పుడూ ఒకేలా ఉంటె అది కాలం ఎందుకు అవుతుంది.ముఖ్యంగా ఇండస్ట్రీలో.అలా 1995 తర్వాత నిషా కెరీర్ లో డౌన్ ఫాల్ మొదలైంది.ఇందాస్స్త్రీలోకి కొత్త తరం హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తుండటంతో  ఆమెకు వరుసగా అవకాశాలు తగ్గాయి .ఇక ప్రేక్షకులు కూడా ఆమెను మెల్లగా మర్చిపోవడం మొదలెట్టారు .ఏ దర్శకుడు కూడా ఆమెతో సినిమా చేయడానికి ముందుకు రాలేదు.కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు సంపాదించిన డబ్బు ఐశ్వర్యం అన్ని ఆవిరైపోయాయి .అలా తీవ్రమైన ఫైనాన్షియల్ ఇబ్బందుల్లో కురుకుపోయింది నిషా .అయితే ఆ కష్ట సమయంలో ఆమెకు కనీసం తినడానికి తిండి ఉండడానికి కూడా లేకపోవడం బాధాకరం.

బలవంతంగా వ్యభిచారకుపంలోకి

ఇక ఇక్కడ అత్యంత దారుణమైన విషయమేంటంటే నిషా కష్టాల్లో ఉన్నప్పుడు ఆమె కుటుంబ సభ్యుల నుంచి కానీ, ఇటు ఫ్రెండ్స్ నుంచి కానీ ఎలాంటి సపోర్ట్ లభించకపోవడం గమనార్హం.అలా ఆర్ధికంగా  పూర్తిగా చితికిపోయిన నిషా నూర్ పరిస్థితులను కొంతమంది ఇండస్ట్రీకి చెందిన దుర్మార్గులు ఆసరాగా చేసుకున్నారు.సినిమాల్లో మంచి మంచి ఛాన్సులు ఇస్తామంటూ నమ్మించిన ఒక బడా నిర్మాత ఆమెను నమ్మించి మోసం చేశాడు .ఇక బతకడానికి డబ్బు అవసరం కావడం, వేరే దారి కనిపించకపోవడంతో ఆ నిషా కూడా బలవంతంగా వ్యభిచారకుపంలోకి అడుగు పెట్టింది.పరిస్థితులు ఆమెను అటు వైపు నడిపించాయా లేక బలవంత పెట్టారో తెలీదు కాని  ఆమె వేసిన ఆ రాంగ్ స్టెప్ ఆమె జీవితాన్ని పూర్తిగా నాశనం చేసింది.ఇక ఆ నరకం నుంచి ఆమె బయట పడాలని ఎంత ప్రయత్నించిన సాధ్యం కాలేదు.

ఒక దర్గా బయట ఉన్న వీధిలో నిద్రిస్తూ

అలా వ్యభిచారం కారణంగా ఆమె సంపాదించిన పేరు ప్రతిష్టలన్నీ మంట కలిశాయి.ఇక సమాజం కూడా ఆమెను తక్కువ చేసి చూడటం మొదలెట్టింది .ఇండస్ట్రీ అయితే ఆమెను పూర్తిగా మర్చిపోయింది.అలా కొన్నేళ్లపాటు నరకంలోనే గడిపిన నిషా  జీవితం మరింత దుర్భర పరిస్థితులలోకి వెళ్ళిపోయింది.వయసు మీద పడటం, అనారోగ్యం కారణంగా ఆమె శరీరం పూర్తిగా కోలుకోలేకుండా పోయింది .దాంతో  వ్యభిచార రొంపి నుంచి కూడా ఆమెను బయటకు తోసేశారు .

ఇక ఆదాయం లేకపోవడం అనారోగ్యం పాలవటంతో ఆమె వీధుల పాలయింది .ఒకప్పుడు వెండితెరని ఏలిన  స్టార్ హీరోయిన్ చివరికి నడిరోడ్డుపై భిక్షం ఎత్తుకునే దుస్థితికి దిగజారింది.అలా చాలా కాలం తర్వాత తమిళనాడులోని నాగపట్నం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఒక దర్గా బయట ఉన్న వీధిలో నిద్రిస్తూ, అత్యంత దారుణమైన స్థితిలో కనిపించింది.

ఎయిడ్స్ వ్యాధితో మృతి చెందడం నిజంగా బాధాకరం

మొత్తం శరీరం బక్క చిక్కిపోయి ఒక ఎముకల గూడులా , అస్తిపంజరంలా  మారిపోయిన నిషాని మొదట్లో ఎవరు గుర్తుపట్టలేదు.ఇక ఆస్థితిలో ముస్లిం మున్నేట్ర కజగం అనే ఒక తమిళ ఎన్జీవో ఆమెను కాపాడి  ఆశ్రయం కల్పించారు. అలా ఆ ఎన్జీవో ఆమె ఎవరని ఆరా తీయగా ఆమె ఒకప్పటి స్టార్ హీరోయిన్ నిషా నూర్ అని తెలిసేసరికి షాక్ కి  గురయ్యారు.వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించగా ఆమెకి ఎయిడ్స్ వ్యాధి వచ్చినట్లు నిర్ధారించారు.

also read:ఆ డ్రామా నా వల్ల కాదు.. భాగ్యరాజ్ అంత్యక్రియలకు వెళ్లకపోవడంపై ఊర్వశి సంచలన వ్యాఖ్యలు!

ఇక అప్పటికే వ్యాధి ముదిరిపోవడంతో ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది.అలా చివరకు 2007లో అంటే కేవలం 44 ఏళ్ల వయసులోనే ఆసుపత్రిలో ఏ ఒక్కరు తోడుగా లేని స్థితిలో ఒక అనాధలా  కన్ను మూసింది నిషా .ఇక ఆమె మరణ వార్త తెలిసిన సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరు కడసారి చూపు  చూడడానికి కూడా  రాలేదు.ఏది ఏమైనా కోటాదిమందిని అలరించిన నిషా చివరికి ఎయిడ్స్ వ్యాధితో మృతి చెందడం నిజంగా బాధాకరం.

Related News

లెనిన్ మూవీ హిట్ కొట్టాలంటే ఎన్ని కోట్లు రాబట్టాలో తెలుసా?

రష్మికకు ఏమైంది.. ఒంటినిండా కత్తిపోటు గాట్లతో?

థియేటర్లలోకి వచ్చేస్తున్న జననాయగన్ ….ఎప్పుడో తెలుసా ?

జగపతిబాబు సైకలాజికల్ థ్రిల్లర్ వదలా నుండి ట్రైలర్ రిలీజ్!

లెనిన్ సెన్సార్ రిపోర్ట్…తెల్లవారుజామున 5 గంటలకే థియేటర్లలో అయ్యగారి జాతర!

ఆ బ్లాక్ బాస్టర్ సినిమాలో నా సీన్స్ కాపీ కొట్టారంటున్నయంగ్ డైరెక్టర్ !

హాట్ పిక్స్ కావాలా? …ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్‌పై పాయల్ రాజ్‌పుత్ స్ట్రాంగ్ కౌంటర్!

Big Stories

Advertisement
×