E-Paper
Advertisement

Driving Schools: కొత్తగా కారు డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా.. మీకో షాకింగ్ న్యూస్!

Driving Schools: కొత్తగా కారు డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా.. మీకో షాకింగ్ న్యూస్!
Advertisement

Driving Schools: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతులు లేకుండా నడుస్తున్న మోటార్ డ్రైవింగ్ స్కూళ్లపై రవాణాశాఖ నిఘాపెట్టింది. నిబంధనలను బేఖాతరు చేస్తూ,కాలపరిమితి ముగిసినా లైసెన్సులు రెన్యూవల్ చేసుకోకుండా, కనీస వసతులు లేకుండా బోర్డులు తిప్పేస్తున్న స్కూళ్లపై కఠిన చర్యలకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డ్రైవింగ్ స్కూళ్ల పూర్తి వివరాలు, వాటి ప్రస్తుత స్థితిగతులపై రవాణాశాఖ సమగ్ర నివేదికను రూపొందిస్తోంది.

కరువైన నైపుణ్యం.. ప్రమాదాలకు కారణం!

ఇటీవల కాలంలో రహదారి ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండటం వెనుక డ్రైవింగ్ స్కూళ్ల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. చాలా స్కూళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ బోర్డులు, క్లాస్‌రూమ్‌లు, శిక్షణ ఇచ్చేందుకు అర్హులైన ఇన్‌స్ట్రక్టర్లు (శిక్షకులు) కరువయ్యారు. 10బై10 షెటర్స్ ఉండాలి, బ్లాక్ బోర్డు, 3 సిస్టం, మౌలిక సదుపాయాలు ఉండాలి. రెండున్నర గంటల వీడియో ఉండాలి.. అప్పుడే డ్రైవింగ్ లైసెన్స్ కు అర్హత. ఫాం నెంబర్ 11 ఖచ్చితంగా ఉండాలి. లేకుంటే ఆఫీసును సైతం సీజ్ చేయవచ్చు. ఐటీ సర్టిఫికెట్ తప్పని సరి. అందుకు రెంటల్ అగ్రిమెంట్, ఓన్ భవన్ ఉంటే విద్యుత్ బిల్లు పెట్టాల్సి ఉంటుంది. అప్పుడే సర్టిఫికెట్ వస్తుంది.

శాస్త్రీయత లేని శిక్షణ..

Advertisement

కొంతమంది రెంటల్ కారును ఆన్ లైన్‌లో బుక్ చేసుకోవడం, శిక్షణ ఇచ్చేవారిని సైతం ఆన్ లైన్‌లో వివరాలతో వారితో శిక్షణ ఇప్పించుకుంటున్నారు. దీంతో కేవలం ‘స్టీరింగ్’ తిప్పడం, గేర్లు మార్చడం నేర్పించి చేతులు దులుపుకుంటున్నారు తప్ప.. రహదారి క్రమశిక్షణ, అత్యవసర సమయాల్లో బ్రేకింగ్ విధానం, ట్రాఫిక్ నిబంధనలపై కనీస అవగాహన కల్పించడం లేదు. ఈ నైపుణ్య లేమి కారణంగానే లైసెన్స్ చేతికి రాగానే వాహనదారులు రోడ్లపై ప్రమాదాల బారిన పడుతున్నారు. దీనికి తోడు అనుమతులు తీసుకోండా కొంతమంది డ్రైవింగ్ స్కూళ్ల పేరుతో నడుపుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు అధికారుల తనిఖీల్లోనూ వెలుగులోకి వస్తున్నట్లు సమాచారం.

Also Read: మమ్మల్ని కొన్నాళ్లు పని చేయనివ్వండి.. విపక్షాలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్!

పెరుగుతున్న ప్రమాదాలు..

Advertisement

కొన్ని డ్రైవింగ్ స్కూళ్లలో శాస్త్రీయమైన, నైపుణ్యంతో కూడిన శిక్షణ ఇవ్వకపోవడం వల్లే రహదారులపై ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరుగుతోందని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. కేవలం ‘స్టీరింగ్’ తిప్పడం నేర్పించి చేతులు దులుపుకుంటున్నారే తప్ప, ట్రాఫిక్ నియమాలు, అత్యవసర సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో నిబంధనల ప్రకారం స్కూళ్లను నడిపేవారికి సైతం చెడ్డపేరు వస్తుందని పలువురు యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్యాబ్ డ్రైవర్లు ఇల్లీగల్ గా డ్రైవింగ్ నేర్పిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎల్ఎల్ఆర్ రాకుండా డ్రైవింగ్ లైసెన్స్ నేర్పించొద్దనే నిబంధనలు సైతం ఉన్నట్లు సమాచారం.

గ్రేటర్ పరిధిలోనే 183 స్కూళ్లు.. 

అధికారుల ప్రాథమిక అంచనాల ప్రకారం కేవలం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 183 డ్రైవింగ్ స్కూళ్లు ఉన్నాయి. వీటిలో మెజారిటీ సంస్థలకు సరైన అనుమతులు లేవని, లేదా రెన్యూవల్ గడువు ముగిసిపోయిందని రవాణాశాఖ గుర్తించింది. నిబంధనల ప్రకారం డ్రైవింగ్ స్కూల్ నడపాలంటే డ్యూయల్ కంట్రోల్ (రెండు వైపులా బ్రేక్, క్లచ్ సౌకర్యం) ఉన్న వాహనాలు తప్పనిసరి. కానీ, చాలా చోట్ల సాధారణ వాహనాలతోనే శిక్షణ ఇస్తూ అటు అభ్యాసకుల, ఇటు రోడ్లపై వెళ్లే ఇతరుల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు. డ్రైవింగ్ స్కూల్ లో అండస్ మెంట్ వెహికిల్ ఉంటే ఆర్టీఓ వాళ్లు జప్తు చేయవచ్చు అనే నిబంధనలు సైతం ఉన్నాయి.

రవాణాశాఖ యాక్షన్ ప్లాన్..

డ్రైవింగ్ స్కూల్ కోసం దరఖాస్తు చేసుకుంటే 5 ఏళ్లవరకు అనుమతి ఉంటుంది. నిబంధనల ప్రకారం ఈ స్కూల్ ను నడుపవచ్చు. అయితే కొంతమంది స్కూల్ కోసం అద్దెభవనాలు ఉండటంతో అద్దె చెల్లించాల్సి వస్తుందని భావించి స్కూల్ లేకుండా శిక్షణ ఇస్తున్నారని అధికారుల తనిఖీల్లో వెల్లడైనట్లు సమాచారం. తనిఖీలకు వెళ్లిన సందర్భంలో బోర్డులు పెట్టి మమ అనిపిస్తున్నారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న రవాణాశాఖ డ్రైవింగ్ స్కూళ్ల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేసేందుకు ఇకపై ప్రతి సంవత్సరం తప్పనిసరిగా తనిఖీలు నిర్వహించాలని రవాణాశాఖ నిర్ణయించినట్లు సమాచారం. వసతులు లేని స్కూళ్ల లైసెన్సులను రద్దు చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే రెన్యూవల్ చేసుకొని స్కూల్లకు నోటీసులు సైతం ఇచ్చినట్లు తెలిసింది. వారం రోజుల్లో రిప్లై ఇవ్వకుండా అనుమతులు రద్దు చేయబోతున్నారు.

Also read: Delhi: వాహన యజమానులకు శుభవార్త, తెరపైకి కొత్త ప్రతిపాదనలు, ఇకపై మూడేళ్లు

వెబ్‌సైట్‌లో పూర్తి సమాచారం?

ప్రజలు మోసపోకుండా ఉండేందుకు, గుర్తింపు పొందిన అధికారిక డ్రైవింగ్ స్కూళ్ల వివరాలను రవాణాశాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచేందుకు కసరత్తు వేగవంతం చేసినట్లు సమాచారం. దీనివల్ల ఏ స్కూల్‌కు అనుమతి ఉందో ప్రజలు నేరుగా చూసుకోవచ్చు. అందులోని వసతులు, శిక్షణ సైతం చెక్ చేసుకోవచ్చు. రహదారి భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తి లేదని, నిబంధనలు ఉల్లంఘించే డ్రైవింగ్ స్కూళ్లపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు కూడా వెనకాడబోమని రవాణాశాఖ అధికారులు స్పష్టం చేశారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నట్లు తెలిపారు. దీంతో అనాధికారికంగా నడిపే డ్రైవింగ్ స్కూల్లకు చెక్ పడనుంది.

అనుమత్తుల్లేని డ్రైవింగ్ స్కూళ్లపై చర్యలు: బాలస్వామిగౌడ్..

డ్రైవింగ్ స్కూలు నడపాలంటే రవాణాశాఖ అనుమతి తీసుకోవాలి. 5 ఏళ్లు కాలపరిమితితో అనుమతి ఇస్తుంది. అయితే కొంతమంది స్కూల్ లేకుండానే సొంతకారుతోనే శిక్షణ ఇస్తున్నారు. వారం రోజులకే శిక్షణ ఇచ్చి లైసెన్స్‌లకు అప్లయి చేయిస్తున్నారు. అలా తీసుకున్నవారితో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకొని డ్రైవింగ్ స్కూల్లు నడుపుతున్నవారికి చెడ్డపేరు వస్తుంది. 30రోజులపాటు శిక్షణ మస్ట్. అంతేకాదు రెండున్నర గంటల డ్రైవింగ్ వీడియో సైతం పోస్టు చేయాల్సి ఉంటుంది. అవేమీ లేకుండా ఇంకొంతమంది ఆన్ లైన్ లో వాహనం, శిక్షణ ఇచ్చేవారిని బుక్ చేసుకొని శిక్షణ తీసుకుంటూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. ప్రభుత్వ అనుమతి లేకుండా స్కూల్లు నడిపేవారిపై, రెన్యూవల్ చేసుకొని వారిపై చర్యలు తీసుకోవాలి. రోడ్డు ప్రమాదాలు జరుగకుండా నిబంధనలు అమలు చేయాలి.

Also read: Telangana Education: పీజీఐ ర్యాంకింగ్స్‌లో దూసుకుపోయిన తెలంగాణ.. ఫలించిన సీఎం రేవంత్ వ్యూహం!

Related News

విజయవాడ నుంచి వారణాసి, కోల్‌కతాకు డైరెక్ట్ ఫ్లైట్స్.. ఇండిగో బిగ్ సర్‌ప్రైజ్!

ఇండియన్ రైల్వేలో ఇలాంటి రైళ్లు కూడా ఉన్నాయా? జీవితంలో ఒక్కసారైనా ప్రయాణించాల్సిందే!

మాన్సూన్ ట్రిప్‌ కు బెస్ట్ ఛాయిస్.. తెలంగాణలో ఈ 8 ప్లేస్‌లు మిస్ కావొద్దు!

రూ.5లకే ప్లేట్ ఇడ్లీ.. 70 ఏళ్ల పెద్దాయన ఇడ్లీలకు భలే క్రేజ్, ఎక్కడంటే?

115 దీవుల దేశం, స్వర్గాన్ని తలపించే ప్రకృతి.. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకట్టుకుంటున్న సెషెల్స్

జస్ట్ రూ.23 వేలకే.. రౌండ్ ట్రిప్, ఆగస్టులో ఈ ప్రాంతాలకు వెళ్లి వచ్చేయండి!

రైలు బోగిలో ఫస్ట్ నైట్ పై స్పందించిన రైల్వే.. వాళ్లకు దబిడి దిబిడే!

Big Stories

Advertisement
×