PKL 2025: ప్రో కబడ్డీ లీగ్ {PKL} 2025 సీజన్ లో తెలుగు టైటాన్స్ దుమ్ము రేపుతోంది. సమిష్టి ప్రదర్శనతో సత్తా చాటుతూ 12వ సీజన్ లో ట్రోఫీ చేజిక్కించుకునే దిశగా మరో అడుగు వేసేందుకు సిద్ధంగా ఉంది. ఈరోజు తెలుగు టైటాన్స్ – పాట్నా పైరేట్స్ {Telugu Titans vs Patna Pirates} మధ్య ఎలిమినేటర్ – 3 మ్యాచ్ జరగబోతోంది. ఆదివారం రోజు జరిగిన మినీ క్వాలిఫైయర్స్ లో తెలుగు టైటాన్స్ 37 – 32 తేడాతో బెంగళూరు బుల్స్ ని ఓడించింది.
Also Read: BAN vs WI: 100 మీటర్ల సిక్స్ కొట్టాడు.. కానీ అదే బంతికి ఔట్ అయ్యాడు.. ఎలా అంటే
మ్యాచ్ ప్రారంభం నుంచి దూకుడుగా ఆడిన తెలుగు టైటాన్స్ రైడింగ్ లో సత్తా చాటి ఫస్ట్ ఆఫ్ ముగిసే సమయానికి 16-14 తేడాతో ఆదిక్యంలో నిలిచింది. ఇక సెకండ్ హాఫ్ లో బెంగుళూరు బుల్స్ నుంచి ప్రతిఘటన ఎదురైనప్పటికీ.. రైడింగ్ లో ఎలాంటి తప్పిదాలు చేయకుండా ఆదిక్యాన్ని కాపాడుకుని విజయాన్ని కైవసం చేసుకుంది.
మినీ క్వాలిఫైయర్ లో 37 – 32 పాయింట్ల తేడాతో బెంగుళూరు బుల్స్ పై విజయం సాధించింది. దీంతో తెలుగు టైటాన్స్ ఎలిమినేటర్ – 3 కి చేరింది. ఈ క్రమంలో మంగళవారం రోజు జరిగే ఎలిమినేటర్ – 3 లో పాట్నా పైరేట్స్ తో పోటీ పడనుంది. ఇందులో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఇక గెలిచిన జట్టు రేపు క్వాలిఫైయర్ 2 లో పుణేరి పల్టాన్ తో తలపడబోతోంది. ఇక నిన్న జరిగిన క్వాలిఫైయర్ – 1 లో పుణేరీ పల్టాన్ పై గెలిచిన దబాంగ్ ఢిల్లీ ఫైనల్ కీ చేరింది.
Also Read: Cricketers Toilet: బ్యాటింగ్ చేసేటప్పుడు టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తే ఎలా.. రూల్స్ ఏం చెబుతున్నాయంటే
సోమవారం రోజు హోరోహోరీగా జరిగిన ఈ క్వాలిఫైయర్ – 1 లో ఢిల్లీ – పుణేరి పల్టాన్ జట్లు నిర్ణీత సమయం ముగిసేసరికి 34 – 34 తో సమంగా నిలవడంతో మ్యాచ్ టై గా ముగిసింది. ఈ క్రమంలో ఫలితాలు తేల్చేందుకు టై బ్రేకర్ నిర్వహించగా ఢిల్లీ 6 – 4 తో పుణేరిని ఓడించి ఫైనల్ బెర్త్ ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ లో ఓడిన పునేరి జట్టు.. నేడు తెలుగు టైటాన్స్ – పాట్నా పైరేట్స్ జట్లలో గెలిచిన జట్టుతో బుధవారం రోజు జరగనున్న క్వాలిఫైయర్ – 2 లో తలపడనుంది. ఇక సూపర్ ఫామ్ లో ఉన్న తెలుగు టైటాన్స్ ఈ సీజన్ లో విజేతగా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
మంగళవారం రోజు తెలుగు టైటాన్స్ – పాట్నా {Telugu Titans vs Patna Pirates} మధ్య జరిగే ఈ మ్యాచ్ లో ఎలిమినేటర్ – 2 కి విజేతతో తలపడుతుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే నేరుగా క్వాలిఫైయర్ – 2 కి అర్హత సాధిస్తుంది. ఆ మ్యాచ్ లో కూడా గెలిస్తే ఫైనల్ కీ చేరుకుంటుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది.