Gukesh Dommaraju: ప్రస్తుత ప్రపంచ చెస్ ఛాంపియన్, భారత యువ సంచలనం డి. గుకేశ్ తన అద్భుతమైన ఫామ్ ను కొనసాగిస్తూ సెయింట్ లూయిస్ చెస్ క్లబ్ లో జరిగిన క్లచ్ చెస్ ఛాంపియన్స్ షో డౌన్ 2025 కోసం అతడు యూఎస్ఏ లోని సెయింట్ లూయిస్, మిస్సోరీ కి వెళ్ళాడు. ఇందులో భాగంగా తొలి రోజు అతడు ప్రపంచ నెంబర్ వన్ మాగ్నస్ కార్ల్ సేన్ తో అద్భుత ఆట ఆడి గెలుపొందాడు. స్టాండింగ్స్ లో ఆదిక్యాన్ని కైవసం చేసుకున్నాడు. తొలి రౌండ్ లో గుకేశ్.. కార్లెన్ చేతిలో 1.5 – 0.5 తేడాతో ఓడిపోయాడు.
ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకొని రౌండ్ 2 లో ప్రపంచ నెంబర్ 2 ఆటగాడు హికారు నకమురాను 1.5 – 0.5 తేడాతో ఓడించి.. అనంతరం కరువానాను 2-0 తేడాతో ఓడించాడు. ఈ విజయం గుకేశ్ ప్రతిభకు, ఒత్తిడిని తట్టుకొని నిలబడే అతని సామర్థ్యానికి నిదర్శనం. దీంతో తొలిరోజు ముగింపులో గుకేశ్ 4/6 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాత కార్లేన్ 3.5, నకమురా 3, కరువాన 1.5 లతో ఉన్నారు. గుకేశ్ ముఖ్యంగా మాగ్నస్ కార్ల్ సేన్ తో అద్భుతమైన ఆట ఆడాడు. గడియారంలో కేవలం 14 సెకండ్లు మిగిలి ఉండగా.. చాలా క్లిష్టమైన పరిస్థితిలో మాగ్నస్ సరైన రక్షణను కనుగొనలేకపోయాడు. దీంతో క్విట్ అయ్యాడు.
Also Read: Indian Team: ఎముకలు కొరికే చలిలో టీమిండియా ప్రాక్టీస్.. చేతులు పగిలిపోతున్నాయి.. వీడియో వైరల్
ఇక రెండవ గేమ్ లో కార్ల్ సేన్ తో గుకేశ్ డ్రా చేసుకున్నాడు. అనంతరం రౌండ్- 2 లో హికారు నకమురా ను ఓడించాడు. ఈ క్లచ్ చెస్ ఛాంపియన్స్ షోడౌన్ 2025 రాపిడ్ టోర్నమెంట్ లో ప్రపంచంలోని నలుగురు అత్యుత్తమ ఆటగాళ్లు ఉన్నారు. ఇందులో మూడు రౌండ్ – రాబిన్ లు ఉన్నాయి. దీనిలో ఒక ఆటగాడు ప్రతిరోజు రెండు రంగులతో ఉన్న అన్ని ఇతర ఆటగాళ్లతో పోటీపడతారు. ఈ టోర్నమెంట్ అక్టోబర్ 30వ తేదీన ముగియనుంది.
ఫిడే ప్రపంచ కప్ 2025 టోర్నమెంట్ కి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. దాదాపు 23 సంవత్సరాల తరువాత తొలిసారి ఈ మెగా ఈవెంట్ కి భారత్ వేదిక కాగా.. గోవాలో అక్టోబర్ 31 నుండి నవంబర్ 27 వరకు ఈ టోర్నీ నిర్వాహనకు ఇప్పటికే షెడ్యూల్ ఖరారు అయింది. ఉత్తర గోవాలోని ఓ రిసార్ట్ లో ఈ టోర్నీని నిర్వహించబోతున్నారు.
Also Read: BAN vs WI: 100 మీటర్ల సిక్స్ కొట్టాడు.. కానీ అదే బంతికి ఔట్ అయ్యాడు.. ఎలా అంటే
ఈ టోర్నీలో మొత్తంగా 82 దేశాల నుంచి 206 మంది చెస్ క్రీడాకారులు ప్రపంచకప్ టోర్నీలో పాల్గొనబోతున్నారు. నాకౌట్ ఫార్మాట్ లో నిర్వహించే ఈ ఈవెంట్ లో టాప్ 3 గా నిలిచిన వాళ్ళు 2026 క్యాండిడేట్స్ ఈవెంట్ కి అర్హత సాధించారు. ఇందులో విజేతకు ప్రైజ్ మనీ 20,00,000 డాలర్లు. అయితే ఈసారి ఏకంగా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో గుకేశ్ బరిలోకి దిగనుండడం విశేషం.
WATCH 🎥 | GUKESH TAKES DOWN WORLD NO.2 HIKARU NAKAMURA IN CLUTCH CHESS!
– Much needed win after loss in Checkmate! 🔥pic.twitter.com/hSn0eemBWq
— The Khel India (@TheKhelIndia) October 27, 2025