BigTV English
Advertisement

Samantha: తప్పు చేశాను.. ఫైనల్‌గా నిజం ఒప్పుకున్న సమంత!

Samantha: తప్పు చేశాను.. ఫైనల్‌గా నిజం ఒప్పుకున్న సమంత!

Samantha:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక పేరు సొంతం చేసుకున్న సమంత (Samantha) ఇప్పుడు బాలీవుడ్ లో వరుస వెబ్ సిరీస్ లు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే మళ్ళీ తెలుగులో సినిమాలు చేయడం ఆరంభించింది. అందులో భాగంగానే తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై ‘శుభం’ అనే సినిమాను నిర్మించి.. అందులో మాయా అనే పాత్ర ద్వారా మళ్ళీ తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఇటు థియేటర్లలోనే కాదు అటు ఓటీటీలో కూడా ఈ సినిమా ఆకట్టుకుంది.


తప్పు చేశాను – సమంత

ఇక ఇప్పుడు నందినీ రెడ్డి దర్శకత్వంలో ‘మా ఇంటి బంగారం’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. నిన్న ఘనంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. మరోవైపు షూటింగ్ కూడా ప్రారంభం అయింది. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తప్పు చేశాను అంటూ అసలు విషయం చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. సమంత మాట్లాడుతూ.. “కెరియర్ ఆరంభంలో నేను ఎన్నో గ్లామరస్ పాత్రలు చేశాను. అయితే అవి నాలాగా అనిపించడం లేదు. వేరే హీరోయిన్స్ లా ఉండడానికి.. వాళ్లలా నటించడానికి.. వాళ్ళలా కనిపించడానికి మాత్రమే నేను ప్రయత్నించేదాన్ని. అలాంటి పాత్రలలో నేను ఎంతో ఇబ్బంది పడ్డాను.

ALSO READ:Suryakantham: గయ్యాళి అత్తనే భయపెట్టిన మహిళ.. నడిరోడ్డుపై కడిగిపారేసిందిగా!


ఇకపై అలా జరగదు..

అయితే ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే.. ఆ పాత్రలన్నీ నాకు చాలా కామెడీగా అనిపిస్తున్నాయి. అప్పట్లో నేను ఎంత చెడ్డగా నటించానో అనుకునేదాన్ని. ఆ తప్పు ఇప్పుడు తెలిసి వచ్చింది. అయితే నేను నేర్చుకోవడానికి అదొక్కటే మార్గంగా భావించాను. కాబట్టే అలా చేయక తప్పలేదు. పరిశ్రమలో ఎటువంటి సంబంధాలు లేకుండా స్వయంగా వచ్చి అన్ని నేర్చుకున్నాను. ఇకపై జాగ్రత్త పడుతూ.. నేను నాలాగే ఉంటాను. ఎవరికోసమో కాదు” అంటూ స్పష్టం చేసింది సమంత. మొత్తానికైతే ఒకప్పుడు ఒకరిని చూసి ఫాలో అయ్యేదాన్ని అని.. కానీ ఇప్పుడు అన్ని మెలకువలు నేర్చుకున్నాను కాబట్టి తానేంటో నిరూపిస్తానని చెప్పుకొచ్చింది సమంత. ప్రస్తుతం సమంత చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నెటిజన్స్..

ఇకపోతే సమంత ఇలాంటి కామెంట్లు చేయడంతో నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అంత కష్టం అయినప్పుడు చేయడం ఇష్టం లేదు అని చెప్పొచ్చు కదా అని కామెంట్లు చేస్తుంటే.. మరికొంతమంది ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి అంటే వచ్చిన అవకాశం వదులుకోకూడదు.. అన్ని పాత్రలు చేస్తేనే అప్పుడే స్టార్ హీరోయిన్గా ఎదుగుతారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా సమంత ఇష్టం లేకపోయినా తప్పని పరిస్థితుల్లో ఆ పాత్రలు చేసింది కాబట్టే ఇప్పుడు ఆమెకు ఈ స్థాయి లభించింది అంటూ ఇంకొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా సమంత ఇప్పుడు స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకొని సినిమాలలో నటించకపోయినా అత్యంత ప్రేక్షకాదరణ పొందిన నటిగా పేరు దక్కించుకోవడం విశేషం.

Related News

Mass Jathara Event: ఈసారి ఏం జరిగినా కూడా దుబాయ్ అయితే వెళ్ళను, నాగ వంశీ కౌంటర్ వాళ్లకేనా?

Mass Jathara Event : మీకు చిరాకు తెప్పించాను నన్ను క్షమించండి, నా ప్రామిస్ ను నమ్మండి 

Aaryan Postponed: తెలుగు సినిమాలకు భయపడ్డావా విష్ణు విశాల్..

Rajinikanth: సినిమాలకు రజినీ గుడ్ బై.. అనారోగ్యమే కారణమా

Mass jathara Pre Release: రవితేజ డైలాగ్ రిక్రియేట్ చేసిన సూర్య.. ఇరగదీసాడుగా?

Mass jathara Pre Release: ఎక్కడికి వెళ్ళినా నీ గోలేంటీ.. సుమపై రాజేంద్రప్రసాద్ కామెంట్స్!

Rashmika Mandanna: 8 గంటల పని వివాదం.. దీపికాకు రష్మిక సపోర్ట్

Mass Jathara Event : నాగ వంశీ ను మించిన రివ్యూ రైటర్స్ లేరు, దర్శకుడు సంచలన కామెంట్స్

Big Stories

×