BigTV English

Gudivada Amarnath: వైఎస్ జగన్ పర్యటన జరిగి తీరుతుంది.. ఎవరు ఆపుతారో చూస్తాం: గుడివాడ అమర్నాథ్

Gudivada Amarnath: వైఎస్ జగన్ పర్యటన జరిగి తీరుతుంది.. ఎవరు ఆపుతారో చూస్తాం: గుడివాడ అమర్నాథ్

Gudivada Amarnath: మాజీ మంత్రి అమర్నాథ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ నర్సీపట్నం పర్యటన గురించి.. తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు జగన్ పర్యటనకు అనుమతులు ఇవ్వాలని కోరగా.. పోలీసులు భద్రత కారణంగా ఆపివేస్తున్నట్టు ఆయన ఆరోపించారు.


జగన్ పర్యటనకు సుమారు 65,000 మంది ప్రజలు హాజరవుతారని చెప్పామని, పోలీసులు తమ లెక్కల ప్రకారం కూడా ఇదే ఎస్టిమేట్ వచ్చిందని చెప్పారు. దీంతో పోలీసులు భద్రతా కారణాల ఆధారంగా అనుమతులను నిరాకరిస్తున్నారని జగన్ విమర్శించారు. పోలీసుల లెక్కలు ద్వారా ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో అర్థం అవుతుంది అని ఆయన పేర్కొన్నారు.

పర్యటనకు సంబంధించి పోలీసులు విశాఖ నుంచి నర్సీపట్నం వెళ్ళే రూట్ పై, బందోబస్తు ఏర్పాటు చేసే సమయంలో.. సమస్యలు ఉన్నట్లు తెలిపారు. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయలేమని అంటున్నారు. మీరు ఎప్పుడూ సక్రమంగా వైఎస్ జగన్ కు సెక్యూరిటీ ఇచ్చారు. రోడ్ షో అని, రోడ్ ను బ్లాక్ చేస్తామని మేము ఎక్కడ చెప్పలేదు.హెలికాప్టర్ మీద వస్తె అనుమతి పరిశీలిస్తామని పోలీసులు చెపుతున్నారు. వైఎస్ జగన్ ఎలా రావాలో ఈ ప్రభుత్వంమే నిర్ణయిస్తుందా అంటూ ప్రశ్నల వర్షం కురింపించారు.


జగన్ తన నాయకత్వంలో ఎప్పుడూ భద్రతా ప్రోటోకాల్స్, రోజ్ షోలు సక్రమంగా నిర్వహించామని, రోడ్డులను బ్లాక్ చేయడం గురించి వారు ఎక్కడా వాగ్దానం చేయలేదని స్పష్టం చేశారు. గత 14 ఏళ్లలో తన పర్యటనల్లో ఒక్క చిన్న సంఘటన కూడా జరగలేదని ఆయన గుర్తుచేశారు. ఈ సందర్భంలో ఆయన దేవరకొండలో జరిగిన సంఘటనలను ఉదాహరించి, అప్పుడప్పుడు ఇతర రాష్ట్రాలలో జరిగే సంఘటనలను బూచిగా చూపి అనుమతులు నిరాకరించడం అసహ్యమేనని అభిప్రాయపడ్డారు.

చంద్రబాబు పర్యటనల సమయంలో జరిగిన ఘటనల పట్ల ప్రభుత్వ స్పందన ఏంటి? పుష్కరాల సమయంలో ఘోర సంఘటనలు జరిగితే కూడా దానిపై ప్రభుత్వం చర్య తీసుకుంటుందా? అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక, నర్సీపట్నం మెడికల్ కాలేజీ సమస్యలపై ప్రజలకు సమాధానం చెప్పే అవసరం ఉందని, అందుకే జరిగే పర్యటనను అడ్డుకోవద్దని ఆయన కోరారు.

Also Read: సిరిమానోత్సవంలో అపశృతి.. బొత్స కి తప్పిన ప్రమాదం

ఇన్ని రోజులు హెలికాప్టర్ కు అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు హెలికాప్టర్ మీద రావాలంటే నాకు చాలా అనుమాంగా ఉంది. ఇందులో ఏమైనా కుట్ర కోణం ఉందా? నాకే కాదు రాష్ట్ర వ్యాప్తంగావైసీపీ నాయకులకు ఇదే అనుమానం ఉంది. రోడ్డు మార్గానే నర్సీపట్నం మెడికల్ కాలేజీ కి వెళ్తారు. ఎవరు అడ్డుకుంటారో చూస్తాం.. మీరు భద్రత కల్పించకపోతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు భద్రత కల్పిస్తారు. అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

Related News

YS Jagan: వైఎస్ జగన్‌కు పోలీసులు షాక్.. విశాఖ రోడ్ షోకి నో పర్మిషన్

AP Dairy Farmers: పాడి రైతులకు గుడ్ న్యూస్.. పశుగ్రాసం సాగుకు 100% రాయితీ.. దరఖాస్తు ఇలా!

Anantapur Land Grab: అనంతపురంలో అదుపులేని భూ కబ్జాలు.. అధికార పార్టీ నేతపై ఆరోపణలు

Vizianagaram Sirimanotsavam: సిరిమానోత్సవంలో అపశృతి.. బొత్స కి తప్పిన ప్రమాదం

Tidco Houses: టిడ్కో ఇళ్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వచ్చే జూన్ నాటికి కంప్లీట్

YCP Politics: వైసీపీ డిజిటల్ బుక్.. సొంత నేతలకు సెగ, డైలామాలో వైసీపీ అధిష్టానం?

Vizianagaram Pydithalli: విజయనగరంలో ఘనంగా పైడితల్లి అమ్మవారి జాతర..

Big Stories

×