Shikhar Dhawan: టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శిఖర్ ధావన్ ఎన్నోసార్లు తన అద్భుతమైన ఆట తీరును కనబరిచాడు. ప్రస్తుతం శిఖర్ ధావన్ తన రిటైర్మెంట్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా… శిఖర్ ధావన్ తాజాగా తన అభిమానులకు తీపి కబురు అందించారు. శిఖర్ ధావన్ వివాహం చేసుకున్నట్లుగా ఓ వీడియోలో తెలుస్తోంది. శిఖర్ ధావన్ తన రెండవ భార్యను పరిచయం చేశాడు. అందరూ ఊహించిన విధంగానే సోఫి షైన్ ( shopie shine ) అనే అమ్మాయిని వివాహం చేసుకున్నట్లుగా ఉన్న వీడియోను బయటపెట్టాడు.
శిఖర్ ధావన్…రెండో పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అది కూడా యుజ్వేంద్ర చాహల్ సమక్షంలో తన భార్యను పరిచయం చేశాడు. ఈ వీడియోలో శిఖర్ ధావన్ చాహల్ ను కూడా వివాహం చేసుకో అని పేర్కొన్నారు. నువ్వు వివాహం చేసుకో చాహల్ అని శిఖర్ ధావన్ చెప్పగా నువ్వు కూడా వివాహం చేసుకో అంటూ చాహాల్ అంటాడు. అప్పుడు ఇదిగో నా భార్య అని సోఫీ షైన్ ను ధావన్ చూపిస్తాడు. దీంతో చాహల్ షాక్ అవుతాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ వీడియో ప్రకారం శిఖర్ ధావన్ రెండవ వివాహం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
కాగా, శిఖర్ ధావన్ తన మొదటి భార్య అయేషా ముఖర్జీకి కొద్ది రోజుల క్రితమే విడాకులు ఇచ్చారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నారు. ప్రస్తుతం వీరి కుమారుడు తన తల్లితోనే ఉంటున్నాడు. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ తన కుమారుడిని అయేషా ముఖర్జీ కలవనివ్వడం లేదు. దీంతో శిఖర్ ధావన్ తన కుమారుడికి అప్పుడప్పుడు మెసేజ్లు చేస్తూ ఉంటాడు. ఇదిలా ఉండగా….. స్టార్ స్పిన్నర్ చాహల్ గత కొద్ది రోజుల క్రితమే తన భార్య ధనశ్రీ వర్మతో విడాకులు తీసుకున్నారు. వీరిద్దరూ ప్రేమించుకొని కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వివాహం జరిగిన తక్కువ సమయంలోనే మనస్పర్ధల కారణంగా వేరుగా ఉన్నారు. ఆ తర్వాత అందరి సమక్షంలో విడిపోయారు.
విడాకుల సమయంలో చాహల్ తన భార్య ధనశ్రీ వర్మకు భారీ మొత్తంలో భరణం అందించారు. విడాకుల తర్వాత చాహల్ ఎన్నో రకాల విమర్శలను ఎదుర్కొన్నారు. మరో అమ్మాయితో ఎ***ఫైర్ పెట్టుకున్నట్లుగా వివాహం కూడా చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు కూడా వచ్చాయి. చాహల్ ఇంతవరకు వివాహం చేసుకోకుండా సింగిల్ గానే ఉన్నారు. కానీ చాహల్ ఆర్జె మహ్వాష్ అనే అమ్మాయితో సీక్రెట్ గా రిలేషన్ కొనసాగిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. వీరిద్దరూ కలిసి ఉండడానికి ముంబైలో ఓ ఖరీదైన ఫ్లాట్ కూడా అద్దెకు తీసుకున్నారు. దాని ఖరీదు దాదాపు మూడు లక్షలకు పైనే ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. మరి చాహల్, ఆర్జే మాహ్వాష్ వివాహం చేసుకుంటారో లేదో చూడాలి.
Shikhar Dhawan and Yuzi Chahal 😂🔥 pic.twitter.com/zPfDHrEWM9
— Mention Cricket (@MentionCricket) October 7, 2025