OTT Movie : డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ లు ఇప్పుడు రకరకాల రియల్ స్టోరీలతో వస్తున్నాయి. ఈ స్టోరీలలో అసలు నిజాలను వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో ఆడియన్స్ ని భయపెట్టిస్తోంది. ఈ సబ్జెక్ట్ దెయ్యాలు, అవి భయపెట్టే సన్నివేశాల గురించి. ఈ డాక్యుమెంటరీ నిజ జీవితంలో జరిగిన దెయ్యం సంఘటనలను, ఇంటర్వ్యూ చేస్తూ చూపిస్తుంది. ఈ స్టోరీలు చాలా రియలిస్టిక్‌గా, భయంకరంగా ఉంటాయి. ఈ డాక్యుమెంటరీ ఈ రోజు నుంచే ఓటీటీలోకి అడుగుపెట్టింది. దీని పేరు ఏమిటి ?ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘ట్రూ హాంటింగ్’ (True Haunting) 2025లో వచ్చిన అమెరికన్ హారర్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్. జేమ్స్ వాన్ దీనిని రూపొందించారు. ఈ సిరీస్‌లో 5 ఎపిసోడ్‌లతో, ఒక్కో ఎపిసోడ్ 40నుంచి 50 నిమిషాల నిడివిని కలిగి ఉంటుంది. ఇది 2025 అక్టోబర్ 7న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయ్యింది. IMDbలో 7.8/10 రేటింగ్ ని పొందింది.
1984లో క్రిస్ అనే కాలేజీ స్టూడెంట్, జెనెసియో కాలేజ్‌లో మొదటి సారిగా అడుగుపెడతాడు. అతను కాలేజ్ హాస్టల్‌లో ఉంటూ చదువుకోవడం మొదలు పెడతాడు. అయితే అక్కడ రాత్రిపూట విచిత్రమైన శబ్దాలు వస్తుంటాయి. ఒక దెయ్యం అతన్ని హాంట్ చేస్తుందని తెలుస్తుంది. క్రిస్ బాగా భయపడతాడు. ఈ విషయం అతని ఫ్రెండ్ తో షేర్ చేసుకుంటాడు. అయితే అతను మాత్రం ఆ దెయ్యంతో మాట్లాడమని ఫన్నీ ఆన్సర్ ఇస్తాడు. ఇక క్రిస్ ఆ దెయ్యం నుంచి బయటపడడానికి ట్రై చేస్తాడు. ఈ స్టోరీని రీ ఎనాక్ట్‌మెంట్స్ తో, క్రిస్ ఇప్పటి ఇంటర్వ్యూస్‌తో చూపిస్తుంది. ఈ కథ చాలా భయంకరంగా, ఎమోషనల్‌గా ఉంటుంది.
రెండో కథ : ఒక ఫ్యామిలీ కొత్త ఇంట్లోకి మారుతుంది. కానీ ఆ ఇల్లు హాంటెడ్‌గా ఉంటుంది. రాత్రిళ్లు డోర్స్ ఆటోమేటిక్‌గా మూసుకుంటాయి. విచిత్రమైన వాయిసెస్ వినిపిస్తాయి. భయంకరమైన షాడోస్ కనిపిస్తాయి. ఫ్యామిలీలో అందరూ భయపడతారు. ఒక్కొక్కరూ దెయ్యం ఎక్స్‌పీరియన్స్ ఫేస్ చేస్తారు. ఈ ఇల్లు దాదాపు వాళ్లను మర్డర్ చేసినట్టు ఫీల్ అవుతారు. ఈ సిరీస్, ఈ స్టోరీని కూడా రీ-ఎనాక్ట్‌మెంట్స్‌తో చూపిస్తుంది. ఫ్యామిలీ సర్వైవర్స్ ఇప్పుడు ఇంటర్వ్యూస్‌లో తమ భయాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు. ఈ రెండు కథలూ కలిపి, ట్రూ హాంటింగ్, నిజ జీవిత దెయ్యం స్టోరీలను భయంకరంగా చూపిస్తుంది.
Read Also : ఏం సినిమా మావా… ఇద్దరు పిల్లలున్న తల్లి ఇంట్లోకి ముగ్గురు పనోళ్ళు… ఒక్కో సీన్ కు గూస్ బంప్స్ పక్కా