Allari Naresh: సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు ఒక హీరోని అనుకొని కథను సిద్ధం చేస్తే కొన్ని కారణాలవల్ల ఆ సినిమాలోకి మరి కొంతమంది హీరోలు వచ్చి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాలను అందుకుంటారు. మరి కొంతమంది కొన్ని సినిమాలను రిజెక్ట్ చేసి కూడా డిజాస్టర్ సినిమాల నుంచి బయటపడిన వారు ఉన్నారు. అయితే నటుడు అల్లరి నరేష్ (Allari Naresh)మాత్రం సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాని వదులుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమా కనుక చేసి ఉంటే నేడు అల్లరి నరేష్ పాన్ ఇండియా హీరోగా చలామణి అయ్యేవారు. మరి అల్లరి నరేష్ వదులుకున్న ఆ బ్లాక్ బస్టర్ సినిమా ఏంటి అనే విషయానికి వస్తే..
దర్శకుడు చందు మొండేటి(Chandu Mondeti) దర్శకత్వంలో నిఖిల్(Nikhil) హీరోగా నటించిన సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ చిత్రం కార్తికేయ(Karthikeya). ఈ సినిమా సుబ్రహ్మణ్యపురం అనే గ్రామం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో పాములు ఈ కథకు కీలకంగా మారాయి. అయితే దర్శకుడు ముందుగా ఈ సినిమా కథను అల్లరి నరేష్ ను దృష్టిలో పెట్టుకొని రాసారట. ఈ సినిమా కథ ఆయనకు వినిపించే సమయంలో పాములు ఉంటాయనే ఒక కారణంతోనే ఈ సినిమాని వదులుకున్నారని తెలుస్తుంది. తనకు నిజ జీవితంలో పాములు చూస్తే చాలా భయమని ఒక ఇంటర్వ్యూ సందర్భంగా అల్లరి నరేష్ వెల్లడించారు.
ఇలా నిజ జీవితంలో మాత్రమే కాదు వెండితెరపై కూడా పాములకు సంబంధించిన సన్నివేశాలు చూస్తే తాను ఇప్పటికీ భయపడతానని, కార్తికేయ సినిమా మొత్తం పాములు చుట్టూ తిరుగుతుంది కనుక తాను ఈ సినిమాని వదులుకున్నానని వెల్లడించారు. ఇలా కార్తికేయ సినిమాని పాములకు భయపడే రిజెక్ట్ చేశారని విషయం తెలిసిన ఈయన అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతూ ఎంత పని చేసావు బాసు అంటూ కామెంట్లు చేస్తున్నారు . ఈ సినిమా కనుక చేసి ఉంటే నరేష్ కెరియర్ కీలక మలుపు తిరిగేది అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా కార్తికేయ 2 కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు..
ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా నిఖిల్ కి పాన్ ఇండియా స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత నిఖిల్ కెరియర్ పరంగా ఎంతో బిజీ అవుతూ పాన్ ఇండియా స్థాయిలోనే సినిమాలను చేస్తున్నారు. ఇక అల్లరి నరేష్ కూడా ఇటీవల కాలంలో కామెడీ సినిమాలు మాత్రమే కాకుండా విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల కాలంలో అల్లరి నరేష్ యాక్షన్ సినిమాలలో కూడా నటిస్తూ తనలో మరో యాంగిల్ కూడా ఉందని బయటపెట్టారు. ప్రస్తుతం పలు సినిమాల షూటింగ్ పనులలో నరేష్ బిజీగా గడుపుతున్నారు.
Also Read: Rashmika Mandanna: రష్మికను బ్యాన్ చేసిన కన్నడ ఇండస్ట్రీ..అసలు విషయం చెప్పిన నటి!