Remembering Uday Kiran : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న చాలామంది ప్రేక్షకులకు ఉదయ్ కిరణ్ పరిచయం. అందరికంటే ముందు లవర్ బాయ్ అని ఒక క్యూట్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు ఉదయ్. ఉదయ్ కెరియర్ లో వరుసగా సిల్వర్ జూబ్లీ సినిమాలు ఉన్నాయి. చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించాయి. చాలామంది హీరోలకు ఉదయ్ కిరణ్ గట్టి పోటీ ఇచ్చాడు. అయితే రోజులు గడుస్తున్న కొద్ది ఉదయ్ కిరణ్ కు సినిమా అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. దీనికి చాలా మంది పలు రకాల కారణాలు చెబుతూ వస్తారు. అయితే అవి ఎంతవరకు వాస్తవం అనేది ఎవరికీ అవగాహన లేదు. ఇక ఉదయ్ కిరణ్ విషయానికి వస్తే అతను చనిపోవడం అనేది ఎవరు జీర్ణించుకోలేని విషయం. చాలామందికి ఉదయ్ ఆ నిర్ణయం తీసుకోవడం కోపాన్ని తెప్పించింది. ఉదయ్ ఈ లోకం నుంచి దూరమైనా కూడా అతడి జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలంగానే ఉంటాయి అనడానికి నిదర్శనం ఆయన సినిమాలు.
అసలు ఏం జరిగింది
ఉదయ్ కిరణ్ వరుసగా హిట్ సినిమాలు చేస్తూ కెరియర్ తారాస్థాయిలో ఉన్న తరుణంలో మెగాస్టార్ చిరంజీవికి అల్లుడు అవ్వనున్నట్లు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర సినిమా సక్సెస్ ఫంక్షన్ కి కూడా ఉదయ్ కిరణ్ హాజరై తన ప్రేమను తెలిపాడు. అయితే వాస్తవానికి మెగాస్టార్ చిరంజీవి కూతురును ఉదయ్ కిరణ్ కు ఇచ్చి పెళ్లి చేయాలి అని నిర్ణయం తీసుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన ఆ పెళ్లి జరగలేదు. దీనికి ఒక్కొక్కరు ఒక్కో రకమైన కారణాలు చెబుతూ ఉంటారు. అయితే ఆ పెళ్లి జరగకపోవడం అనేది ఉదయ్ కిరణ్ కెరియర్ కు శాపంగా మారిపోయింది. అప్పటికి చేస్తున్న సినిమాలు కూడా ఆగిపోయే దశకు వచ్చాయి. కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ కి ఫోన్ చేసి ఆ సినిమాను ఆపేయాలి అని బెదిరింపులు వచ్చినట్లు కూడా కథనాలు వినిపించాయి. అయితే ఇది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు. అయితే ఉదయ్ కిరణ్ తీసుకున్న నిర్ణయం వెనక ఇది కూడా ఒక బలమైన కారణం అంటూ కొంతమంది చెబుతూ వస్తారు.
ఆ పేపర్ లో రాయడం వల్లనే అలా జరిగింది
ఇకపోతే ఉదయ్ కిరణ్ చాలా తక్కువ మంది హీరోలతో మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ ను కంటిన్యూ చేసేవాడు. ఒక తరుణంలో అల్లరి నరేష్ కూడా ఉదయ్ కిరణ్ కి మంచి ఫ్రెండ్. ఉదయ్ చనిపోవడానికి కొన్ని రోజులు ముందు అల్లరి నరేష్ కి కాల్ చేశాడు. కాల్ చేసినప్పుడు కూడా బాధపడుతూ మాట్లాడారు. అయితే ఉదయ్ అల్లరి నరేష్ తో మాట్లాడుతున్న తరుణంలో ఒక హీరో గురించి ఆర్టికల్ వచ్చింది. హీరో సరైన కథలు ఎంచుకోవడం లేదు అని రాశారు. దీనికి సమాధానంగా అల్లరి నరేష్ మాట్లాడుతూ ఎవరో గురించి రాస్తే నువ్వెందుకు బాధపడుతున్నావు అని అడిగారు. దీనికి వెంటనే ఉదయ్ కిరణ్ సరైన కథలు ఎంచుకోకపోతే ఇతని కెరియర్ కూడా ఉదయ్ కిరణ్ లాగా అయిపోతుంది అని రాశారు అంటూ ఉదయ్ ఏడ్చారట. ఈ విషయాన్ని స్వయంగా అల్లరి నరేష్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఏదేమైనా ఒక గొప్ప నటుడును ఈరోజు మనం కోల్పోయాం. అతని పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో చాలామంది గుర్తు చేసుకుంటూ విష్ చేస్తున్నారు.