Kannappa: ఈరోజుల్లో ఎంత గొప్ప సినిమా తీశాం అనేది విషయం కాదు. ఎంతవరకు ఆ సినిమాతో ప్రేక్షకుడిని థియేటర్ వరకు నడిపించగలం అనేది మేటర్. రీసెంట్ టైమ్స్ లో ప్రేక్షకుడికి ఓపిక పూర్తిగా తగ్గిపోయింది. ఒక సినిమాకి హిట్ టాక్ వచ్చిన తర్వాత ఆ సినిమాకు వెళ్దాం అనుకునే ఆడియన్స్ ఉన్నారు అనేది వాస్తవం. కానీ హిట్ టాక్ బయటకు వచ్చేంతవరకు థియేటర్లో సినిమా ఉంటుందా ఉండదా అనేది అసలైన విషయం. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో నవీన్ చంద్ర కూడా మాట్లాడుతూ నా సినిమాకి హిట్ టాక్ వచ్చేలోపే థియేటర్ నుంచి సినిమా బయటికి వెళ్లిపోతుంది అని చెప్పాడు. ఇక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాల్లో కన్నప్ప ఒకటి.
మంచు ఫ్యామిలీ డ్రీమ్ ప్రాజెక్ట్
కొన్ని ఫ్యామిలీస్ కు సంబంధించి ప్రత్యేకమైన సినిమాలు ఉంటాయి. అక్కినేని ఫ్యామిలీ విషయానికొస్తే మనం అనేది వాళ్ళకి చాలా ప్రత్యేకమైన సినిమా. ఆ కుటుంబ సభ్యులు మొత్తం ఆ సినిమాలో కనిపించి ప్రేక్షకుడికి మంచి అనుభూతిని అందించారు. ఇప్పుడు మంచి ఫ్యామిలీ అంతా కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా కన్నప్ప సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో మనోజ్ మంచు లక్ష్మి మినహాయిస్తే మంచు విష్ణు పిల్లలు కూడా ఈ సినిమాలో కనిపిస్తున్నారు. అంతేకాకుండా ప్రతి ఇండస్ట్రీ నుంచి మంచి పేరు సాధించిన ప్రముఖులు ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపిస్తున్నారు. కేవలం మంచు ఫ్యామిలీ మెంబర్స్ ఈ సినిమాను చేస్తే ఆడియన్స్ వస్తారు అనే క్లారిటీ లేదు కాబట్టి దిగ్గజ నటులను అందరిని ఈ సినిమాలో ఇన్వాల్వ్ చేశారు.
సినిమాకు బుకింగ్స్ అంతంత మాత్రమే
ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ వంటి ప్రముఖులు ఉండడంతో కొద్దిపాటి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అయితే ఇంతమంది పెద్ద నటులు కనిపించినా కూడా ప్రమోషన్స్ మాత్రం ఎవరు హాజరు కాలేదు. ఈ సినిమాకు దాదాపు 200 కోట్లు బడ్జెట్ కేటాయించారు. విష్ణుకి మార్కెట్ అంతలా లేదు మనందరికీ తెలిసిన విషయమే. ప్రభాస్ వలన ఈ సినిమాకు కొంత బజ్ వచ్చింది అనేది వాస్తవం. అయితే హైదరాబాదులో ఒక్క థియేటర్ కూడా ఇప్పటివరకు హౌస్ ఫుల్ కాలేదు. సినిమా రేపు రిలీజ్ సిద్ధంగా ఉంటే ప్రసాద్, భ్రమరాంబ వంటి థియేటర్స్ లో బుకింగ్స్ కొంతమేరకు బాగానే ఉన్నాయి. అయితే ఈ సినిమాకి బుకింగ్స్ బాగానే ఉంటే సరిపోదు హౌస్ ఫుల్ పడితేనే అద్భుతమైన కలెక్షన్లు వస్తాయి. ఈ సినిమాకి సంబంధించి ఓటిటి హక్కులు కూడా ఇంకా అమ్మలేదు. ఎటువైపు నుంచి చూసిన ఈ సినిమా రిస్క్ ప్రాజెక్టు అనిపిస్తుంది. ఇంకా ఈ సినిమాను ఆ శివయ్య కాపాడాలి.
Also Read: Remembering Uday Kiran : ఉదయ్ కిరణ్ చావుకు అదే కారణమా.?