E-Paper
Advertisement

వైరల్ అవుతున్న ఫేక్ ఫోటోలపై నటి రుక్మిణీ వసంత్ సీరియస్.. లీగల్ యాక్షన్..

వైరల్ అవుతున్న ఫేక్ ఫోటోలపై నటి రుక్మిణీ వసంత్ సీరియస్.. లీగల్ యాక్షన్..
Advertisement

Rukmini Deepfake: సినీ పరిశ్రమను ‘డీప్‌ఫేక్’ భూతం మరోసారి వణికించింది. రష్మిక మందన్న, ఆలియా భట్, కట్రినా కైఫ్ వంటి స్టార్ హీరోయిన్ల తర్వాత.. తాజాగా కన్నడ బ్యూటీ, టాలీవుడ్ అప్ కమింగ్ హీరోయిన్ రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth) ఈ ఏఐ మార్ఫింగ్ మాయాజాలానికి బలయ్యారు. సోషల్ మీడియాలో తన పేరుతో చెక్కర్లు కొడుతున్న కొన్ని అభ్యంతరకర ఫోటోలపై ఆమె తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక సుదీర్ఘమైన ప్రకటనను విడుదల చేశారు.

Read also-ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు ప్రకాష్ రాజ్ మద్దతు.. వాళ్లు రాజకీయ గుండాలంటూ ఫైర్..

బికినీ ఫోటోషూట్ పేరిట దుష్ప్రచారం

Advertisement

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో రుక్మిణీ వసంత్ ఒక స్విమ్మింగ్ పూల్ వద్ద గ్రీన్ కలర్ బికినీ ధరించి ఉన్నట్లు కొన్ని ఫోటోలు, వీడియోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. ‘సప్త సాగరదాచే ఎల్లో’ సినిమాతో హోమ్లీ గాళ్‌గా గుర్తింపు తెచ్చుకున్న రుక్మిణీ.. ఒక్కసారిగా ఇంత బోల్డ్ లుక్‌లో కనిపించేసరికి నెటిజన్లు సైతం ఆశ్చర్యపోయారు. చాలా మంది అది నిజమైన ఫోటోషూట్ అని భావించి విపరీతంగా షేర్ చేశారు. అయితే, అసలు విషయం ఏమిటంటే.. ఆ ఫోటోలు పూర్తిగా కృత్రిమ మేధస్సు (AI) సహాయంతో సృష్టించిన నకిలీ చిత్రాలు.

అది నేను కాదు..

ఈ వ్యవహారంపై రుక్మిణీ వసంత్ స్పందిస్తూ.. “నా పేరుతో ఆన్‌లైన్‌లో చలామణి అవుతున్న కొన్ని ఏఐ-జెనరేటెడ్ చిత్రాలు నా దృష్టికి వచ్చాయి. ఆ ఫోటోలు పూర్తిగా నకిలీవని, ఎవరో కావాలనే సృష్టించారని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. ఇలాంటి మార్ఫింగ్ కంటెంట్‌ను తయారు చేయడం, ప్రచారం చేయడం అనేది ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛను దారుణంగా ఉల్లంఘించడమే అవుతుంది” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

ఈ విషయాన్ని తాము చాలా సీరియస్‌గా తీసుకుంటున్నట్లు తెలిపిన రుక్మిణీ.. “ఈ ఘాతుకానికి ఒడిగట్టిన వారిపై, అలాగే ఈ నకిలీ చిత్రాలను వైరల్ చేస్తున్న వారిపై చట్టపరమైన, సైబర్ క్రైమ్ చర్యలు ప్రారంభించాము” అని స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఇలాంటి తప్పుడు కంటెంట్‌ను ఎవరూ షేర్ చేయవద్దని, వాటిని ప్రమోట్ చేయవద్దని ఆమె నెటిజన్లను కోరారు.

Read also-‘పెద్ది’ సెన్సార్ పూర్తి .. 3 గంటల సినిమాలో డిలేట్ చేసిన సీన్లు ఇవే.. పాటలో కూడా..

వరుసగా పెద్ద సినిమాలతో బిజీ..

ప్రస్తుతం రుక్మిణీ వసంత్ కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. కన్నడలో రాకింగ్ స్టార్ యష్ సరసన ప్రతిష్టాత్మక చిత్రం ‘టాక్సిక్’ (Toxic)లో నటిస్తుండగా.. తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ (Dragon) సినిమాలో కథానాయికగా నటిస్తున్నారు. ఇలాంటి కీలక సమయంలో ఆమెను టార్గెట్ చేస్తూ కొందరు ఆకతాయిలు డీప్‌ఫేక్ ఫోటోలను సృష్టించడం సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ హీరోయిన్ల గౌరవానికి భంగం కలిగిస్తున్న ఇలాంటి వారిపై కఠిన చట్టాలు తీసుకురావాలని పరిశ్రమ వర్గాల నుండి డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.

Related News

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

టాక్సిక్ vs ఇరుముడి.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇదో గుణపాఠమా?

సాహో ప్రపంచంలోకి ఓజీ..? ఏం ప్లాన్ చేస్తున్నావ్ సుజిత్ ?

మీరే నాకు స్ఫూర్తి… బాబాయ్ కు అబ్బాయ్ విషెస్!

ఒంటిమీద బట్టలు లాగేసి ఘోరంగా అవమానించారు – స్టార్ కమెడియన్ ఎమోషనల్!

Big Stories

Advertisement
×