 
					Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని లోక్‌పాల్ సర్వే అంచనా వేసింది. ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 44 శాతం ఓట్లతో విజయం సాధిస్తారని వెల్లడించింది. అటు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 38%, బీజేపీకి 15%, ఇతరులకు 3% ఓట్లు దక్కుతాయని లోక్‌పాల్ సర్వే అంచనా వేసింది.
కాంగ్రెస్‌కు ప్లస్ పాయింట్ ఇదే..
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, డివిజన్ల వారిగా జరుగుతున్న అభివృద్ధి పనులు కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుస్తాయని అంచనా వేసింది. అంతేకాకుండా స్థానికంగా బలమైన యువ నాయకుడు నవీన్ యాదవ్‌ను బరిలో నిలపడం కాంగ్రెస్ విజయావకాశాలను మరింత మెరుగుపరిచిందని పేర్కొంది. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే యువ నాయకుడిగా ఆయనకు ఆదరణ ఉందని వెల్లడించింది. ఇక అధికార పార్టీ వైపు మొగ్గుచూపడం వల్ల స్థానిక అవసరాలు, అభివృద్ధి పనులు జరుగుతాయన్న ప్రజల భావన కాంగ్రెస్ పార్టీకి ప్లస్‌పాయింట్ అని పేర్కొంది.
ఎంఐఎం మద్దతు కాంగ్రెస్ బలం..
మరోవైపు ఎంఐఎం మద్దతు, హెచ్‌వైసీ సల్మాన్ ఖాన్ నామినేషన్ తిరస్కరణకు గురవ్వడం మైనారిటీల్లో కాంగ్రెస్ బలాన్ని పెంచిందని క్షేత్రస్థాయి పరిస్థితులను వివరించింది. దీనికి తోడుగా మైనారిటీ సంఘాల నాయకులు, మత పెద్దల మద్దతును కూడగట్టడం కాంగ్రెస్‌కు మేలు చేయనుందని పేర్కొంది.
పట్టుకోల్పోయిన బీఆర్ఎస్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక మహిళ చుట్టూ రాజకీయం చేస్తున్న బీఆర్ఎస్ క్షేత్ర స్థాయిలో పట్టుకోల్పోతోందని వివరించింది. అంతేకాకుండా గత పదేళ్లలో జూబ్లీహిల్స్‌పై బీఆర్ఎస్ ప్రదర్శించిన నిర్లక్ష్యం ఆ పార్టీ విజయావకాశాలను దెబ్బతీసిందని పేర్కొంది. అటు బీజేపీ హిందూత్వ రాజకీయాలు బీఆర్ఎస్ ఓటు బ్యాంకును దెబ్బతీయవచ్చని, అయితే ప్రధాని పోటీదారులకు సవాల్ విసిరేంత పరిస్థితి బీజేపీకి లేకుండా పోయిందని పేర్కొంది. గతంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా లోక్‌పాల్ విడుదల చేసిన సర్వే వాస్తవ పరిస్థితులను అద్దం పట్టింది. తాజాగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆ సంస్థ విడుదల చేసిన సర్వే అధికార పార్టీకి పోలింగ్‌కి ముందు బూస్ట్ ఇచ్చినట్టైంది.