 
					Ram pothineni: రామ్ పోతినేని(Ram Pothineni) టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎనర్జిటిక్ హీరోగా తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఒకానొక సమయంలో వరుస హిట్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన రామ్ ఇటీవల కాలంలో అనుకున్న స్థాయిలో తన సినిమాల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే అభిమానులు కూడా రామ్ హిట్ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రామ్ ఇస్మార్ట్ శంకర్ సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత పలు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈయనకు తీవ్ర నిరాశ మిగిలింది.
ఇక త్వరలోనే రామ్ పోతినేని మహేష్ బాబు(Mahesh Babu) దర్శకత్వంలో ఆంధ్ర కింగ్ తాలూకా(Andhra King Taluka) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా నవంబర్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాపై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటివరకు విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేశాయి. ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్న నేపథ్యంలో రామ్ పోతినేని తదుపరి సినిమాల గురించి పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రామ్ పోతినేని 23వ సినిమాని కొత్త దర్శకుడితో చేయబోతున్నట్టు సమాచారం.
ఇండస్ట్రీలో కథ రచయితగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో కిషోర్ గోపు (Kishore Gopu)ఒకరు. అయితే ఈయన దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. రామ్ హీరోగా కిషోర్ గోపు మొదటి సినిమాని చేయబోతున్నారని ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా నిర్మించబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన చర్చలు అన్నీ కూడా పూర్తి అయ్యాయి. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి పండుగ తర్వాత ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారక ప్రకటన వెల్లడించబోతున్నారు.
ఆంధ్ర కింగ్ గా ఉపేంద్ర..
ఇక ఈ సినిమాతో పాటు రామ్ పోతినేని మరొక టాలీవుడ్ డైరెక్టర్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు వస్తున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈయన మరో సినిమా కూడా చేయబోతున్నారని ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించబోతున్నట్టు తెలుస్తోంది. ఇలా ఈ ఇద్దరి తెలుగు దర్శకులతో పాటు మరో తమిళ దర్శకుడితో కూడా సినిమా చేయబోతున్నారని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందనేది తెలియాలి అంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే. ఇక ఆంధ్ర కింగ్ తాలూకా విషయానికి వస్తే ఈ సినిమాలో రామ్ సరసన భాగ్యశ్రీ హీరోయిన్ గా నటించబోతున్నారు. ఇక ఈ సినిమాలో ఆంధ్ర కింగ్ పాత్రలో కన్నడ నటుడు ఉపేంద్ర(Upendra) కనిపించబోతున్న సంగతి తెలిసిందే.
Also Read: Jailer 2: జైలర్ 2 నుంచి తప్పుకున్న బాలయ్య.. రంగంలోకి మరొక స్టార్ హీరో?