IAS Transfers: రాష్ట్ర పరిపాలనలో భాగంగా పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె. రామకృష్ణ రావు జీవోను విడుదల చేశారు. ఈ బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
	
	
బదిలీల వివరాలు:
- సబ్యసాచి ఘోష్ (1994 బ్యాచ్): ప్రస్తుతం స్పెషల్ చీఫ్ సెక్రటరీగా (All, DD & F) ఉన్న ఘోష్ ను.. ‘ఫ్లాగ్‌షిప్ వెల్ఫేర్ & డెవలప్‌మెంటల్ స్కీమ్స్ యూనిట్’ ఇంప్లిమెంటేషన్ కోసం స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ చేశారు. అలాగే, ఈయన సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు (FAC) కూడా కొనసాగిస్తారు.
- అనితా రామచంద్రన్ (2004 బ్యాచ్): మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఉన్న అనితా రామచంద్రన్ కు, అదే శాఖ కార్యదర్శిగా, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
- ఇలంబరితి కె (2005 బ్యాచ్): మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్ (MA&UD) శాఖ కార్యదర్శిగా ఉన్న ఈయనను ప్రభుత్వ కార్యదర్శిగా బదిలీ చేశారు. అదనంగా, (All, DD & F) శాఖ కార్యదర్శిగా కూడా FAC బాధ్యతలు అప్పగించారు.
- బి. శ్రీధర్ (2004 బ్యాచ్): బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఉన్న ఈయనను, సయ్యద్ అలీ ముర్తాజా రిజ్వీ స్వచ్ఛంద పదవీ విరమణ నేపథ్యంలో సాధారణ పరిపాలన శాఖ (GA Dept) కార్యదర్శిగా నియమించారు.
- డా. యశ్మీన్ బాషా (2015 బ్యాచ్): హార్టికల్చర్ & సెరికల్చర్ డైరెక్టర్‌గా ఉన్న ఈమెకు, టీజీ ఆయిల్‌ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
- జి. జితేందర్ రెడ్డి: ఆదిలాబాద్ జెడ్పీ సీఈవోగా ఉన్న ఈయనను ఎస్సీడీ శాఖ స్పెషల్ కమిషనర్‌గా నియమించారు. దీంతో పాటు, టీజీ షెడ్యూల్డ్ కులాల కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వీసీ & ఎండీగా కూడా FAC బాధ్యతలు ఇచ్చారు.
- బి. సైదులు (IFS-2005): ఎంజేపీ(టి)బీసీడబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శిగా ఉన్న ఈయనను ‘ఫ్లాగ్‌షిప్ వెల్ఫేర్ & డెవలప్‌మెంటల్ స్కీమ్స్ యూనిట్’ స్పెషల్ సెక్రటరీగా FACలో నియమించారు.
- MA&UD శాఖ కార్యదర్శి పోస్టు పూర్తి అదనపు బాధ్యతలు చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణ రావు వద్దే కొనసాగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.