BigTV English
Advertisement

Hyderabad–Madinah Flights: హైదరాబాద్ నుంచి మదీనాకు నేరుగా విమానాలు, గుడ్ న్యూస్ చెప్పిన ఇండిగో!

Hyderabad–Madinah Flights: హైదరాబాద్ నుంచి మదీనాకు నేరుగా విమానాలు, గుడ్ న్యూస్ చెప్పిన ఇండిగో!

తక్కువ ధరలకే విమాన సర్వీసులు అందిస్తున్న ఇండిగో విమానయాన సంస్థ సౌదీ అరేబియాకు తన సర్వీసులను మరింతగా పెంచబోతోంది. ఇప్పటి వరకు హైదరాబాద్ – మదీనా మధ్య వారానికి నాలుగు సర్వీసులు నడిపిస్తుండగా, ఇకపై రోజు వారీ సర్వీసులను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ మేరకు ఇండిగో కీలక ప్రకటన చేసింది. హజ్, ఉమ్రా యాత్రికులతో పాటు ఇతర ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని అందించేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ సర్వీసులు ప్రారంభం అయ్యాయి. ఇకపై హైదరాబాద్ నుంచి రోజు వారీ విమాన సర్వీసులు అందుబాటులో ఉండబోతున్నాయి.


హైదరాబాద్- మదీనా  విమానాల షెడ్యూల్

నవంబర్ 16 నుంచి హైదరాబాద్- మదీనా మధ్య ప్రతి రోజూ విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్-మదీనా మధ్య 6E 0057 విమాన సర్వీసు అందుబాటులో ఉంటుంది. ఈ విమానం ప్రతి రోజు సాయంత్రం 7.35 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరుతుంది. రాత్రి 11.45 నిమిషాలకు మదీనా చేరుకుంటుంది. అటు మదీనా-హైదరాబాద్ మధ్య 6E 0058 విమాన సర్వీసు అందుబాటులో ఉంటుంది. ఇది ప్రతి రోజు రాత్రి 12.45 నిమిషాలకు మదీనా నుంచి బయల్దేరుతుంది. ఉదయం 8.10 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.  ఎయిర్‌ బస్ A320 విమానం హైదరాబాద్-మదీనా, మదీనా-హైదరాబాద్ మధ్య సర్వీసులను అందిస్తుంది. ఈ విమాన సర్వీసుల ద్వారా భారత్ నుంచి మతపరమైన యాత్రికులు, వ్యాపార ప్రయాణికులు, పర్యాటకులకు సరసమైన, సౌకర్యవంతమైన ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది.

ముంబై- మదీనా విమానాల షెడ్యూల్

అటు ముంబై- మదీనా మధ్య  కూడా రోజు వారీ విమాన సర్వీసులు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఇండిగో ప్రకటించింది. ముంబై- మదీనా మధ్య  6E 0059 విమానం ప్రతి రోజు రాత్రి 10.05 నిమిషాలకు ముంబై నుంచి బయల్దేరుతుంది.  మదీనా- ముంబై మధ్య 6E 0060 విమానం ప్రతి రోజు రాత్రి  9. 50కి మదీనా నుంచి బయల్దేరుతుంది.  నవంబర్ 15 నుంచి ముంబై మరియు మదీనా మధ్య రోజువారీ ప్రత్యక్ష సేవను ప్రారంభించనున్నట్లు ఇండిగో తెలిపింది. ఇండిగో అధికారిక వెబ్‌ సైట్, మొబైల్ యాప్ లో టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేసినట్లు వెల్లడించింది.


ఈ విమానయాన సంస్థ ప్రస్తుతం సౌదీ అరేబియాలోని నాలుగు ప్రధాన నగరాలు అయిన జెడ్డా, రియాద్, దమ్మామ్, మదీనాకు 150 కి పైగా విమానాలను నడుపుతోంది. రెండు దేశాల మధ్య మతపరమైన పర్యాటకం, వాణిజ్యం పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణీకుల డిమాండ్‌కు అనుగుణంగా ఈ సర్వీసులను ఇండిగో మరింత విస్తరిస్తోంది.  “భారత్ తో సహా ప్రపంచ వ్యాప్తంగా యాత్రికులను ఆకర్షించే సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన గమ్యస్థానం మదీనా. ఈ పవిత్ర నగరానికి మతపరమైన పర్యాటకం కోసం పెరుగుతున్న డిమాండ్‌ కు అనుగుణంగా హైదరాబాద్- మదీనా, నవీ ముంబై-మదీనా మార్గంలో రోజు వారీ విమాన సర్వీసులు ప్రారంభించడం మాకు సంతోషంగా ఉంది” అని ఇండిగో సేల్స్ హెడ్ వినయ్ మల్హోత్రా  వెల్లడించారు. 400 కంటే ఎక్కువ విమానాలతో ఇండిగో 90కి పైగా దేశీయ, 40కి పైగా అంతర్జాతీయ గమ్యస్థానాలను కలుపుతూ 2,200 కంటే ఎక్కువ రోజు వారీ విమాన సర్వీసులను అందిస్తుంది.

Read Also:  రైల్వే స్టేషన్‌లో మెట్లు దిగలేక వికలాంగుడి పాట్లు.. వెంటనే రైల్వే పోలీస్ ఏం చేశాడంటే..

Related News

IRCTC Tour Package: భారత్ గౌరవ్ ట్రైన్‌తో దక్షిణ భారత ఆలయాల దివ్య దర్శనం.. భక్తుల కోసం సువర్ణావకాశం

Viral Video: రైల్వే స్టేషన్‌లో మెట్లు దిగలేక వికలాంగుడి పాట్లు.. వెంటనే రైల్వే పోలీస్ ఏం చేశాడంటే..

IRCTC Master List: టికెట్ కన్ఫార్మ్ కావడానికి ఇదో కొత్త ట్రిక్.. మాస్టర్ లిస్ట్‌తో ఇలా ట్రై చేయండి!

IRCTC Down: షాకింగ్.. 6 గంటల పాటు IRCTC వెబ్ సైట్ డౌన్.. కారణం ఏంటంటే?

AP Trains: ఏపీలో రైళ్లకు మరింత వేగం.. రైల్వేశాఖ కీలక నిర్ణయం!

Viral Video: పర్సును కొట్టేసిన దొంగలు, కోపంతో ఏసీ కోచ్ విండో పగలగొట్టిన మహిళ, వీడియో వైరల్!

Train Derailed: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, అదే మార్గంలో దూసుకొచ్చిన ఎక్స్‌ ప్రెస్‌..

Big Stories

×