 
					Prasanth varma Dispute With Producers: హనుమాన్ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు ప్రశాంత్ వర్మ. గతేడాది సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. తక్కువ బడ్జెట్లోనే క్వాలిటీ అవుట్ పుట్ ఇచ్చి విజువల్ వండర్‌గా తీర్చిదిద్దాడు. భారత ఇతీహాసాలకు సూపర్ హీరో జానర్ని జతచేసి వెండితెరపై అద్భుతం చేశాడు. చిన్న హీరో, చిన్న దర్శకుడు, చిన్న సినిమా, చిన్న నిర్మాతలు.. కానీ, బడా హీరో, బడా దర్శకులు, బడా నిర్మాతలనే ఒడించారు. ఈ సినిమాకు పోటీగా విడుదలైన సర్కారు వారి పాట, సైంధవ్, నా సామిరంగ వంటి చిత్రాలను వెనక్కి నెట్టి సంక్రాంతి బ్లాక్బస్టర్గా నిలిచింది. ఆ ఏడాది ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిత్రం కూడా హనుమానే.
ఈ దెబ్బతో టాలీవుడ్ నిర్మాతలంత ప్రశాంత వర్మ దగ్గరికి క్యూ కట్టారు. తన దగ్గరి వచ్చిన ప్రతి నిర్మాతకు నో చెప్పకుండ సినిమా చేస్తానని మాట ఇచ్చాడు. అంతేకాదు వారిదగ్గర అడ్వాన్స్ కింద కోట్లలో రెమ్యునరేషన్ తీసుకున్నాడు. ప్రశాంత్ వర్మ ఖాతాలో ప్రస్తుతం 10పైగా సినిమాలు ఉన్నాయి. అందులో డీవీవీ దానయ్య కుమారు కళ్యాణ్ హీరోగా అధీరతో పాటు సీతాకోక చిలుక, అక్టోపస్, మహాకాళి, జై హానుమాన్, బ్రహ్మరాక్షసుడు వంటి తదితర సినిమాలు ఉన్నాయి. ఇవన్ని కూడా పెద్ద బడ్జెట్ తో బడా నిర్మాతలతో చేయాల్సిన సినిమాలు. వీటన్నింటికి ఆయా నిర్మాతల దగ్గర అడ్వాన్స్ కూడా తీసుకున్నాడట. అదీ కేవలం కథకు మాత్రమే. కేవలం కథ కోసమే ఒక్కొక్కొ నిర్మాత దగ్గర రూ. కోటి నుంచి రూ. 2 కోట్ల వరకు తీసుకున్నాడని టాక్. ఆ డబ్బుని తీసుకేళ్లి ప్రశాంత్ వర్మ తన స్టూడియోలో పెట్టాడట.
మరోవైపు ఓ బడా నిర్మాత డీవీవీ దానయ్య దగ్గర రూ. 50 కోట్ల వరకు రెమ్యునరేషన్ కూడా తీసుకున్నట్టు ఇండస్ట్రీలో టాక్. ఇంతక వరకు బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమాలన్ని తాను చేయలేనని, తన అసిస్టెంట్ డైరెక్టర్లతో చేస్తానంటూ ప్రశాంత్ వర్మ మాట మార్చాడట. కానీ, ఇందుకు నిర్మాతలు ఆసక్తిగా లేరట. మొదట తాను తీస్తానని డబ్బులు తీసుకున్నప్పుడు ఇప్పుడు మాట మార్చడమేంటని ప్రశాంత్ వర్మ తీరుపై ప్రొడ్యూసర్స్ గుర్రుగా ఉన్నారు. కానీ, ఈ యంగ్ డైరెక్టర్ మాత్రం తాను దర్శకత్వం చేయనంటున్నాడు. కథ తనదే. కానీ, తన ఆధ్వర్యంలో అసిస్టెంట్స్తో సినిమాలు చేస్తానంటున్నాడట. కానీ, తాను నేరుగా దర్శకత్వం వహించనని చెబుతూ వస్తున్నాడట. దీంతో ఈ విషయంలో ప్రశాంత్ వర్మకు, ప్రొడ్యూసర్ల మధ్య చిన్నపాటి వార్ జరుగుతుందని ఇండస్ట్రీలో గుసగుస. ఈ విషయంలో ప్రశాంత్ వర్మ మొండిగా ఉండటంతో తమ డబ్బులు వెనక్కి ఇవ్వమని నిర్మాతలు డిమాండ్ చేస్తున్నారట.
Also Read: Hyper Aadi: హైపర్ ఆది చంపేస్తానంటూ బాలయ్య వార్నింగ్.. అసలేం జరిగిందంటే!
లేదంటే తనే దర్శకత్వం చేయాలని అంటున్నారు. దీంతో ఆ నిర్మాతలకు ప్రశాంత్ వర్మ మొహం చాటేస్తున్నాడట. ఆయన తీరుతో నిర్మాతలు మరింత ఆగ్రహనికి లోనవుతున్నారు. దీంతో ఈ పంచాయతీని ఫిల్మ్ ఛాంబర్‌లోనే తేల్చుకుంటామని ప్రశాంత్ వర్మపై న్యాయపరమైన చర్యలు తీసుకోబోతున్నారట. ప్రశాంత్ వర్మపై ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదు చేసేందుకు నిర్మాలంత సిద్ధమయ్యారట. త్వరలోనే ఫిల్మ్ ఛాంబర్‌కు ప్రశాంత్ వర్మపై ఫిర్యాదు వెళ్లనుందని గట్టి ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఓ ప్రకటన ఇచ్చారు. ప్రశాంత్ వర్మకు, తమకు మధ్య ఎలాంటి ఒప్పందం జరగలేదని, ఆయనకు తమ సంస్థ నుంచి ఎలాంటి రెమ్యునరేషన్ వెళ్లలేదని స్పష్టం చేస్తూ పత్రిక ప్రకటన ఇచ్చారు. ప్రశాంత్ వర్మ తీరు వల్ల ఎక్కువ ఇబ్బంది పడుతుంది డీవీవీ దానయ్యనే అనే టాక్. ఇప్పుడే ఆయనే ప్రశాంత్ వర్మ ఎలాంటి ఒప్పందాలు లేవని చెప్పడం అందరిని షాకిస్తుంది. మరి ఈ విషయంలో ఏం జరిగిందనేది డీవీవీ, ప్రశాంత్ వర్మకే తెలియాలి.