 
					Rahul Ravindran : హను రాఘవపూడి దర్శకుడుగా పరిచయమైన అందాల రాక్షసి సినిమాతో నటుడుగా పరిచయం అయ్యాడు రాహుల్ రవీంద్రన్. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ సక్సెస్ సాధించుకుంది. అయితే ఆ సినిమా చూసినప్పుడు చాలామంది రాహుల్ రవీంద్రాన్ని చూసి అట్రాక్ట్ అయ్యారు. తన మాట్లాడే విధానం కూడా ఆ సినిమాలో చాలా కొత్తగా అనిపించింది. ఆ సినిమా తర్వాత రాహుల్కు వరుసగా అవకాశాలు వచ్చాయి. కొన్ని హీరోగా కూడా సినిమాలు చేశాడు గానీ అవి ఊహించిన స్థాయిలో వర్కౌట్ కాలేదు.
అయితే నటుడుగా కొన్ని సినిమాల్లో కనిపించాడు. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమాలో కూడా ఒక కీలకపాత్రను చేశాడు. అత్తారింటికి దారేది సినిమాలో అవకాశం వచ్చినా కూడా రాహుల్ చేయలేదు. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు దర్శకుడుగా తన ప్రతిభను బయటకు తీసి చిలసౌ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ సినిమాకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది.
రాహుల్ రవీందర్ ను వైఫ్ చిన్మయి గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో అద్భుతమైన పాటలను చిన్మయి పాడారు. ముఖ్యంగా పాటలు పాడటం మాత్రమే కాకుండా చాలా సినిమాలకి డబ్బింగ్ కూడా చెప్పారు. సమంత స్టార్టింగ్ డేస్ లో చేసే సినిమాలకు చిన్మయి డబ్బింగ్ చెప్పేవాళ్ళు.
అయితే చిన్మయి కొన్ని విషయాలు పైన స్పందిస్తూ ఉంటారు. సోషల్ ఇష్యూస్ పైన ఎవరు మాట్లాడకపోయినా కూడా కొన్ని విషయాల్లో తనకు అనిపించిన పాయింట్ స్ట్రైట్ గా మాట్లాడుతారు. కొన్ని సందర్భాలలో చిన్మయి ను కూడా చాలామంది ట్రోల్ చేస్తారు. రాహుల్ రవీంద్రన్ తనను ఎలా భరిస్తున్నాడు అని అనుకుంటారు.
కానీ వాస్తవానికి రాహుల్ రవీంద్ర నికి ఉన్న ఆలోచన పరిపక్వత వలన చిన్మయి అలా మాట్లాడుతుంది. రాహుల్ రవీంద్రన్ చిన్మయిని పెళ్లి చేసుకున్నప్పుడు కూడా తన ఇంటిపేరు మార్చేయాలి అనుకోలేదు. చిన్మయిను పెళ్లి చేసుకున్నప్పుడు కూడా తాళిబొట్టు నువ్వు వేసుకోవాలి అని నేను చెప్పను నాకు వేసుకోకపోయినా పర్వాలేదు అది నీ ఇష్టం అని తనకే ఛాన్స్ ఇచ్చారట.
అలా ఎందుకు అని చిన్నవి రాహుల్ ను అడిగినప్పుడు. నీకు పెళ్లి అయింది అని తెలియటానికి తాళిబొట్టు ఉంది. అంటే అది సమాజానికి నువ్వు ఒక ప్రాపర్టీ అనేటట్టు ప్రొజెక్ట్ చేస్తుంది. కానీ ఒక మగాడికి పెళ్లయింది అని చెప్పడానికి ఏముంది.? ఇద్దరికీ సమానమైన హక్కులు ఉండాలి. అంటూ తన ఉద్దేశాన్ని చిన్నమయికి చెప్పారట. కొన్ని విషయాల్లో చిన్మయి అలా మాట్లాడుతుంటే చిన్నయిని నేనే చెడగొట్టానేమో అనే అభిప్రాయం కలుగుతుంది అని రాహుల్ రవీంద్రన్ చెప్పాడు.
Also Read: Mamitha Baiju: అదృష్టం అంటే ఈ అమ్మాయి ఇదే, నచ్చిన స్టార్లతో అవకాశం