 
					Peddi: చాలామంది జీవితాల్లో సంగీతం అనేది ఒక కీలక పాత్రను పోషిస్తుంది. చాలా సందర్భాల్లో సంగీతం అనేది మనసుకు ప్రశాంతత ఇస్తుంది. సంగీతానికి భాషతో సంబంధం లేదు. అందుకే చాలామంది తెలుగు ప్రేక్షకులు కూడా తమిళ సంగీత దర్శకులను ఇష్టపడుతూ ఉంటారు. వాళ్లు కంపోజ్ చేసిన సాంగ్స్ను విపరీతంగా వింటుంటారు. ఏఆర్ రెహమాన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాలతో అద్భుతమైన సంగీతాన్ని అందించారు.
ఇప్పటికీ రెహమాన్ పాటలు వింటుంటే ఒక ప్రశాంతత ఉంటుంది. పల్లవి నుంచి చరణంతో పాటు చివరి వరకు పాట కోసం కష్టపడతారు రెహమాన్. కొందరు సంగీత దర్శకుల చేసే పాటలలో పల్లవి బాగుంటే చరణం అంతగా ఆకట్టుకోదు లేకుంటే చరణం బాగుంటే పల్లవి ఎంతగా బాగోదు. కానీ రహమాన్ విషయానికి వస్తే పాటలు కూడా పూర్తి బాగుంటాయి. తెలుగులో కొమరం పులి సినిమా తర్వాత ఇప్పటివరకు ఏఆర్ రెహమాన్ సంగీతం చేయలేదు. ఇప్పుడు బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న పెద్ది సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
చాలామంది కన్సర్ట్ కు వెళ్లడానికి ఇష్టపడుతుంటారు. అక్కడికి వెళ్లి వాళ్లతో పాటు పాటలు పాడుతూ ఉత్సాహంగా ఎగరడం అనేది ఒక ఆనందం. అయితే ఏఆర్ రెహమాన్ కి సంబంధించిన కన్సర్ట్ హైదరాబాద్లో జరగనుంది. నవంబర్ 8న ఈ ఈవెంట్ జరుగుతుంది.
అయితే పెద్ది సినిమాకి సంబంధించి ఫస్ట్ సింగల్ గురించి ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఫస్ట్ సింగిల్ ఆల్రెడీ పూర్తయిపోయింది. ఇంకా రామ్ చరణ్ జాన్వి కపూర్ విజువల్ తో ఈ సాంగ్ ని డిజైన్ చేయాల్సి ఉంది అందుకోసమే ఇప్పటివరకు ఈ సాంగ్ ను విడుదల చేయలేదు. నవంబర్ 8న పెద్ది సినిమా ఫస్ట్ సింగిల్ లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.
మరోవైపు పెద్ద సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడటం. ఇదివరకే ఆ సినిమా నుంచి విడుదలైన వీడియో విపరీతంగా ఆకట్టుకోవటం ఇవన్నీ కూడా సినిమాకి బాగా కలిసి వస్తున్నాయి.
చిట్టిబాబు అనే పాత్ర తర్వాత ఆ స్థాయిలో ఈ పాత్ర ఆకట్టుకుంటుంది అని అందరూ ఊహిస్తున్నారు. రంగస్థలం సినిమాతో అద్భుతమైన సక్సెస్ ఇచ్చాడు సుకుమార్. ఇప్పుడు సుక్కు శిష్యుడు ఏ రేంజ్ సక్సెస్ ఇస్తాడు అనే క్యూరియాసిటీ చాలామందికి మొదలైంది. ఈ సినిమా 2026 మార్చి 25వ తారీకు నుంచి థియేటర్లకు తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారు.
Also Read: Rahul Ravindran : చిన్మయిని చెడగొట్టింది నేనేనేమో అనిపిస్తుంది