Saif Ali Khan About Knife Attack: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ తనపై జరిగిన కత్తి దాడిని మరోసారి గుర్తు చేసుకున్నారు. అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా హోస్ట్ చేస్తున్న ‘టూ మచ్'(Too Much) షోకి ముఖ్య అతిథిగా వచ్చారు. అక్షయ్ కుమార్‌తో కలిసి ఈ షోలో పాల్గోన్న సైఫ్ తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కి సంబంధించిన ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు. అలాగే ఈ ఏడాది జనవరిలో తనపై జరిగిన కత్తి దాడి సంఘటనను గుర్తు చేసుకున్నారు.
ఈ కేసులో ఆయన ఓ షాకింగ్ విషయం బయటపెట్టారు. ఆ రోజు దుండగుడు తనతో పాటు తన చిన్న కుమారు జేహ్పై కూడా కత్తి దాడి చేశాడని వెల్లడించాడు. ఈ షోలో సైఫ్ మాట్లాడుతూ.. తనపై జరిగిన దాడి కొందరికి నాటకమైందని అసహనం చూపించాడు. తను ఆస్పత్రిలో చికిత్స తర్వాత బాగానే ఉన్నానని చెప్పేందుకు నడుచుకుంటూ వచ్చాను. కానీ, దాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకుని నేను నాటకం ఆడాడంటూ ప్రచారం చేశారు. దాడి లేదు ఏం లేదు.. ఇది నాటకమంటూ నాపై జరిగిన దాడిని చాలా తెలికగా చూశారంటూ సైఫ్ ఆవేదన వ్యక్తం చేశాడు. దాడి జరిగిన రోజు అసలేం జరిగిందో వివరించాడు.
‘ఆ రోజు నాపైనే కాదు నా కొడుకు, కేర్ టేకర్‌పై కత్తి దాడి జరిగింది. ఆ రోజు మేమంత చాలా లేటు పడుకున్నాం. నా భార్య కరీనా ముందుగానే పడుకుంది. నేను నా ఇద్దరు పిల్లలు (తైమూర్, జేహ్)తో కలిసి సినిమా చూస్తున్నాను. అప్పటికే రాత్రి చాలా రాత్రి అయిపోయింది. సినిమా చూసి పడుకునే సరికి 1 గంటల అయిపోయింది. తైమూర్, జేహ్లు తమ రూంలోకి వెళ్లిపోయారు. జెహ్తో నాని(కేర్ టేకర్) కూడా ఉన్నారు. పిల్లలు వెళ్లిపోగానే కరీనా కిందకి వచ్చింది. దీంతో మేమిద్దరం కాసేపు మాట్లాడుకుని తిరిగి మా గదిలోకి వెళ్లిపోయాం. ఇక పడుకునే సమయాని జెహ్ నాని మా దగ్గరి వచ్చి… గదిలోకి గుర్తు తెలియని వ్యక్తి వచ్చాడని, డబ్బులు కావాలని కత్తి చూపిస్తూ బెదిరించాడని చెప్పింది.
అప్పుడు గది చూట్టు చికటిగా ఉంది. చీకట్లోని అక్కడికి వెళ్లాం. మేము వెళ్లేసరి దుండగుడు.. కత్తిని జెహ్ వైపు పెట్టి బెదిరించాడు. ఆ సమయంలో జెహ్ చేతికి కత్తి ఘాటు పడింది. అంతేకాదు కేర్ టేకర్ నానిపై కూడా ఆ దుండగుడు దాడి చేశాడు. ఆమెకు కూడా కత్తి గాట్లు పడ్డాయి. అది చూసి భయంతోనే నేను అతడిని అడ్డుకునే ప్రయత్నం చేశాను. ఈ క్రమంలో దుండగుడు నాపై పలుమార్లు దాడి చేశాడు‘ అంటూ సైఫ్ చెప్పుకొచ్చాడు. కాగా ఈ ఘటనలో సైఫ్ శరీరంపై ఆరు చోట్ల దుండగుడు కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. వెన్నుముఖ కత్తి మొన కూడా విరిగి ఉంది. దాడి అనంతరం రక్తంతోనే సైఫ్ తన పెద్ద కుమారుడు తైమూర్, కేర్ టేకర్ సాయంతో ఆటోలో ఆస్పత్రికి వెళ్లాడు.