Bison First Single:కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న విక్రమ్ చియాన్ (Vikram chiyan) వారసుడు ధృవ్ విక్రమ్(Dhruv Vikram) ఇటీవల ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. మంచి కథ ఓరియంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ధృవ్ విక్రమ్ ప్రస్తుతం బైసన్ (Bison) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నీలం స్టూడియోస్, అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో రాబోతున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు పా. రంజిత్ సమర్పణలో మారి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 24వ తేదీన విడుదల కాబోతున్న ఈ చిత్రాన్ని.. జగదంబే ఫిలిమ్స్ ప్రొడ్యూసర్ బాలాజీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో చాలా గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు.
ఇదిలా ఉండగా విడుదల తేదీకి కొన్ని రోజులే మిగిలి ఉన్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను విడుదల చేశారు మేకర్స్. నివాస్ కే ప్రసన్న కంపోజ్ చేసిన ఈ పాటకు దర్శకుడు మారి సెల్వరాజ్ తమిళంలోలిరిక్స్ అందించగా.. ఎనమంద్రా రామకృష్ణ తెలుగు లిరిక్స్ అందించారు. మనువర్ధన్ ఈ పాటను ఆలపించారు. “తీరేనా తీరేనా.. గుండెల్లోన మండుతున్న మూగవేదన” అంటూ సాగిన పాట సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ఈ పాట లిరిక్స్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకు ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ పాటలో ధృవ్ ఇంటెన్స్ లుక్ లో ఆకట్టుకుంటున్నారు.
ఇదిలా ఉండగా ఈ సినిమా పాట విడుదల సందర్భంగా జగదాంబే ఫిలిమ్స్ ప్రొడ్యూసర్ బాలాజీ మాట్లాడుతూ.. “ఈ సినిమాను తెలుగులో విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ధృవ్ తనదైన పర్ఫామెన్స్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా తెలుగులో కచ్చితంగా మంచి విజయాన్ని అందుకుంటుందని భావిస్తున్నాము.. ముఖ్యంగా నాకు తెలుగులో ఈ సినిమాను విడుదల చేసే అవకాశాన్ని ఇచ్చిన నీలం స్టూడియోస్, అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలకు ధన్యవాదాలు” అంటూ తెలిపారు..
ALSO READ:Hyderabad: స్టార్ డైరెక్టర్ చేతుల మీదుగా రిహాబిలిటేషన్ సెంటర్ ప్రారంభం!
ఈ సినిమాలో నటిస్తున్న నటీనటుల విషయానికి వస్తే.. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తోంది అలాగే కలైయరసన్, పశుపతి, రెజీషా విజయన్, హరికృష్ణన్, అళగమ్ పెరుమాళ్,, అరువి మదన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పా.రంజిత్ , అదితి ఆనంద్, దీపక్ సెగల్, సమీర్ నాయర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి నివాస్ కే ప్రసన్న సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు.
చిత్రం : బైసన్
నటీనటులు : ధృవ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరన్, పశుపతి, కలైయరసన్, రెజిషా విజయన్, హరికృష్ణన్, అళగమ్ పెరుమాళ్, అరువి మదన్ తదితరులు.
బ్యానర్ : నీలం స్టూడియోస్, అప్లాజ్ ఎంటర్టైన్మెంట్స్, జగదాంబే ఫిలిమ్స్
దర్శకుడు : మారి సెల్వరాజ్
నిర్మాతలు : సమీర్ నాయర్, దీపక్ సెగల్, పా రంజిత్, అదితి ఆనంద్
తెలుగు రైట్స్ : జగదాంబే ఫిలిమ్స్ (నిర్మాత బాలాజీ)
మ్యూజిక్ డైరెక్టర్ : నివాస్ కే ప్రసన్న
సినిమాటోగ్రాఫర్ : ఏజిల్ అరసు కే
ఎడిటర్ : శక్తి తిరు
ఆర్ట్ డైరెక్టర్ : కుమార్ గంగప్పన్
ఫైట్ మాస్టర్ : దిలీప్ సుబ్రయన్
కో ప్రొడ్యూసర్స్ : సునీల్, ప్రమోద్, ప్రసూన్, మనింద బేడి
పీ ఆర్ ఓ : హర్ష – పవన్