Bigg Boss Telugu 9 Promo: బిగ్బాస్ 9 లేటెస్ట్ ప్రొమో వచ్చేసింది. ఐదోవారంలోకి అడుగుపెట్టిన బిగ్బాస్ నేటితో 32వ రోజు ఎపిసోడ్ జరుపుకుంటోంది. గురువారంకి ఎపిసోడ్కి సంబంధించి ఫస్ట్ ప్రొమోలో ఇప్పటికే రిలీజ్ చేసింది బిగ్ బాస్ టీం. ఫస్ట్ ప్రొమోలో ఎంటర్టైన్మెంట్తో పాటు కష్టమైన టాస్క్లు ఇచ్చాడు హౌజ్మేంట్స్కి. బిగ్ బాస్ పాట ప్లే చేసి వారితో డ్యాన్స్లు వేయించాడు. కానీ, పాట ఆగిపోగానే గోడకు ఉన్న హోల్స్లో నుంచి కంటెస్టెంట్స్ మరోవైపు వెళ్లాలి. అలా ఏ టీం సభ్యులు ఎంతమంది హోల్స్ నుంచి బయటకు వస్తారో వాళ్లు విజేతలు అని రూల్ పెట్టాడు. అలా ఐదో వారం కెప్టెన్సీ కొసం లీడర్ బోర్డు పెట్టి కంటెండర్స్ని ఎంపిక చేసే ప్రాసెస్ పెట్టాడు బిగ్ బాస్.
ఇందులో భాగంగా మొదటి లెవల్ కోసం సాంగ్స్ పెట్టి పాట ఆగినప్పుడు బిగ్ బాస్ చెప్పిన కలర్ హోల్ నుంచి కంటెండర్స్ బయటకు రావాల్సి ఉంటుంది. ఇదంత మ ఒదటి ప్రొమోలో చూపించారు. తాజాగా డే 32 సెకండ్ ప్రొమో విడుదలైంది. ఇందులో లీడర్ బోర్డులో భరణి–దివ్య టీం టాప్లో సంజన–ఫ్లోరా టీం డౌన్లో ఉన్నట్టు చూపించారు. రీతూ, సంజనాలు రాము రాథోడ్ని ఏడిపిస్తున్న సీన్తో ప్రొమో మొదలైంది. మేము రాము బయటికి రాము.. మేము రాము బయటికి రాము అంటూ రాము రాథోడ్ని చూస్తూ సంజన–రీతూ పాట పాడుతూ కనిపించారు. అతడు నిల్చుని అలాగే చూస్తు ఉన్నాడు. ప్లీజ్.. నీకు దండంపెడతా.. అంటూ రీతూని రిక్వెస్ట్ చేస్తూ కనిపించాడు.
మధ్యలో ఇమ్మాన్యుయేల్ వచ్చి.. అడ్డు ఉన్నవాళ్లని హగ్ చేసుకుని ఎత్తుకుని తీసుకెళ్లి పక్కకు పెట్టోచ్చు అంటాడు. రాముని ఏడిపిస్తూ రీతూ–సంజనలు కాసేపు ఆటపట్టించారు. దీంతో హౌజ్ లో కాసేపు నవ్వులు పూశాయి. ఆ తర్వాత లీడర్ బోర్డులో టాప్లో ఉన్న టీంకి బిగ్బాస్ స్పెషల్ పవర్ ఇచ్చారు. టాప్ ఉన్నవాళ్లు.. అందరికంటే కింద స్థానంలో ఉన్నవాళ్లని ఆట నుంచి తప్పించే అధికారం ఇచ్చాడు. అలా దివ్య–భరణిలకు.. లీస్ట్లో ఉన్న సంజనా–ఫ్లోరా, శ్రీజ–సుమన్ శెట్టి టీంని తొలగించే అవకాశం ఇచ్చాడు. ఇద్దరు డిస్కషన్ చేసుకుని కెప్టెన్స్ కంటెండర్స్గా సంజనా–ఫ్లోరా టీంని తొలగించారు. లీస్ట్ లో శ్రీజ-సుమన్ శెట్టి ఉన్నప్పటికి.. సంజన-ఫ్లోరా టీంని రేస్ నుంచి తొలగించడంతో ఇమ్మూ తల్లి తీవ్ర అసహనానికి గురైంది.
కేవలం కాంపిటిషన్ని దృష్టిలో ఉంచుకుని మాత్రమే వారి తొలగిస్తున్నామంటూ వారు వివరణ ఇచ్చారు. ఇక వారి నిర్ణయంతో సంజన భగ్గమంది. ఇక్కడ ఎంత కష్టపడ్డ దానికి అర్థం లేదు.. సపోర్టు లేదు... కర్మ సిద్దాంతం ఒకటి ఉంటుంది. పైన ఉన్న వాళ్లు కిందపడోచ్చు.. కింద ఉన్నది పైకి వెళ్లోచ్చు.. నేను గెలిచే వరకు పోరాడుతూనే ఉంటా. ఎంతమంది తొక్కాలని చూసిన చివరి వరకు పోరాటం చేస్తూనే ఉంటాను అంటూ హితవు పలికింది. దీంతో ప్రొమో ముగుస్తుంది. ఈ ప్రొమో చూస్తుంటే ఈ రోజు ఎపిసోడ్ ఫుల్ రసవత్తరంగా ఉంటుందని తెలుస్తోంది. కెప్టెన్సీ కంటెండర్ల మధ్య బిగ్బాస్ గట్టిపోటీ పెట్టారనిపిస్తోంది. మరీ లీడర్ బోర్డులో ఉన్న టాప్లో ఉన్న భరణి–దివ్యలు అలాగే కొనసాగి చివరికి కెప్టెన్సీ కొట్టేస్తారా? లేదా? చూడాలి.