E-Paper
Advertisement

Lionel Messi: స్టేడియంలో ఫ్యాన్స్ అరాచ‌కం, ఇక మ‌రోసారి ఇండియాకు మెస్సీ రాకుండా చేశారు క‌ద‌రా ?

Lionel Messi: స్టేడియంలో ఫ్యాన్స్ అరాచ‌కం, ఇక మ‌రోసారి ఇండియాకు మెస్సీ రాకుండా చేశారు క‌ద‌రా ?
Advertisement

Lionel Messi:  ప్రస్తుతం ఇండియాలో దిగ్గ‌జ్ ఫుట్ బాల్‌ ప్లేయర్ లియోనెల్ మెస్సీ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ అర్ధరాత్రి రెండున్నర గంటల సమయంలో కోల్ క‌తాలో దిగారు లియోనెల్ మెస్సీ. ఈ సందర్భంగా ఇవాళ ఉదయం పూట కోల్ క‌తాలోని సాల్ట్ లేక్ స్టేడియం ( Salt Lake Stadium) దగ్గర లియోనెల్ మెస్సీ 70 అడుగుల‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కూడా పాల్గొన్నారు. అనంతరం కోల్ క‌తాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో మ్యాచ్ కూడా ఆడారు లియోనెల్ మెస్సీ. అయితే మ్యాచ్ జరిగిన 22 నిమిషాల్లో పై చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో అక్కడి నుంచి అర్ధాంతరంగా వెళ్ళిపోయాడు లియోనెల్ మెస్సీ.

Also Read: T20 World Cup 2026: అదంతా ఫేక్‌.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ప్ర‌సారాల‌పై ICC అదిరిపోయే ప్ర‌క‌ట‌న‌, 2027 వ‌ర‌కు ఢోకా లేదు

ఫ్యాన్స్ ఆగ్రహం, అర్ధాంతరంగా వెళ్లిపోయిన లియోనెల్ మెస్సీ

Advertisement

కోల్‌క‌తా సాల్ట్ లేక్ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభమైన తర్వాత, లియోనెల్ మెస్సీని సరిగ్గా చూడలేకపోతున్నామని ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఈవెంట్‌ నిర్వహించిన వారి పట్ల అసహనం వ్యక్తం చేశారు. అనంతరం వాటర్ బాటిల్స్‌ స్టేడియం లోపలికి విసిరేశారు. అక్కడే ఉన్న ఫ్లెక్సీలు కూడా చింపేశారు ఫ్యాన్స్. వేల‌ల్లో డబ్బులు పెట్టి టికెట్లు కొంటే, సరిగ్గా ఏర్పాట్లు చేయలేదని మండిపడ్డారు. ఇక పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో లియోనెల్ మెస్సీని అక్కడి నుంచి తరలించారు. స్టేడియం బంకర్ నుంచి బయటకు వెళ్లిపోయారు లియోనెల్ మెస్సీ. అనంతరం స్టేడియంలో ఉన్న అభిమానులు అక్కడ ఉన్న ఫర్నిచర్, ఫ్లెక్సీలను ధ్వంసం చేయ‌డ‌మే కాకుండా, ద‌గ్ధం చేసేశారు. అటు స్టేడియంలో ఏర్పాటు చేసిన గ్రీన్ మ్యాట్ కూడా ఎత్తుకెళ్లాడు ఓ ఫ్యాన్‌. తాను పెట్టిన డ‌బ్బులు రివ‌ర్స్ రావు కదా, అందుకే గ్రీన్ మ్యాట్ తీసుకెళుతున్న‌ట్లు వెల్ల‌డించారు సద‌రు ఫ్యాన్‌. ఇంటి ద‌గ్గ‌ర మ్యాచ్ ఆడుకుంటాన‌ని తెలిపాడు. ఇక ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో, ఫోటోలు వైర‌ల్ గా మారాయి.

ఈవెంట్ నిర్వాహుకుల‌పై గ‌వ‌ర్న‌ర్ సీరియ‌స్

కోల్ క‌తా మెస్సీ ఈవెంట్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేసిన పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్… నిర్వాహకులను టికెట్ డబ్బును తిరిగి చెల్లించాలని ఆదేశించారు. నిర్వాహకులను అరెస్టు చేయాలని పిలుపునిచ్చిన ఆనంద బోస్, క‌ఠిన చ‌ర్చ‌లు తీసుకోవాల‌న్నారు. ఈవెంట్ మెయిన్ ఆర్గనైజర్ ను అరెస్టు చేసామన్న బెంగాల్ డీజీపీ, మిగిలిన నిర్వాహకులను కూడా అరెస్టు చేస్తామని ప్ర‌క‌టించారు. నిర్వాహకులను విచారించి కఠిన చర్యలు తీసుకుంటామని వివ‌రించారు డిజిపి. అటు మెస్సి ఈవెంట్ నిర్వహణ లోపాలపై విచరించేందుకు ఒక ప్యానెల్ ఏర్పాటు చేస్తామని సీఎం మమత బెనర్జీ వెల్ల‌డించారు. దీంతో ప్యానల్ సభ్యులను త్వరలోనే ప్రకటిస్తామన్నారు ప్రభుత్వ అధికారులు.

Advertisement

Also Read: Messi Meets Revanth: నేడే రేవంత్ రెడ్డి వ‌ర్సెస్‌ మెస్సీ మ్యాచ్‌…షెడ్యూల్ ఇదే,ఒక్క‌ ఫోటోకు రూ.10 లక్షలు

 

 

Related News

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

బాబ‌ర్ ఆజం గొప్పోడని డ‌బ్బా కొట్ట‌డం త‌ప్ప‌, పీకిందేమీ లేదు..అంతా ప్ర‌చారం మాత్ర‌మే

ఓయో రూంల్లో ఉండ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్లు ?

ధోని చాణ‌క్యం…బెంగాలీ రాద‌ని డ్రామాలు ఆడి బంగ్లా ప‌ళ్లు రాలగొట్టాడు

ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయినా, టీమిండియా అంతు చూస్తాం !

స్మృతి మందాన‌ బ్యాట్ లో AI చిప్స్…అందుకే సెంచ‌రీ చేసింది

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

Big Stories

Advertisement
×